AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thanuja: 'భరించలేకపోతున్నా...' కళ్యాణ్ ఫ్యాన్స్‌పై తనూజ ఎదురుదాడి

Thanuja: ‘భరించలేకపోతున్నా…’ కళ్యాణ్ ఫ్యాన్స్‌పై తనూజ ఎదురుదాడి

Phani CH
|

Updated on: Feb 05, 2026 | 9:25 PM

Share

బిగ్ బాస్ 9 తర్వాత ఫ్యాన్ వార్స్ శ్రుతి మించాయి. విన్నర్ కళ్యాణ్ అభిమానుల ట్రోలింగ్‌తో తనుజ మానసిక క్షోభకు గురైంది. సోషల్ మీడియా నుండి దూరమై, ఇప్పుడు ట్రోలర్స్‌పై తీవ్రంగా స్పందించింది. "మానసికంగా చిత్రహింస చేస్తే ఏమొస్తుంది?" అంటూ భావోద్వేగానికి లోనైంది. నకిలీ అకౌంట్స్‌తో తనను, తన మద్దతుదారులను టార్గెట్ చేయడాన్ని ఆమె ప్రశ్నించింది, ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటుంది.

బిగ్ బాస్ రియాల్టీ షోను ఈ మధ్య నెటిజన్లు ఎంటర్‌టైనింగ్‌గా తీసుకోవడం లేదు. దానికి బదులుగా కాస్త సీరియస్‌గా అందులోని హౌస్‌ మేట్స్‌ను ఫాలో అవుతున్నారు. నెట్టింట ఫ్యాన్ వార్‌కు కారణంగా అవుతున్నారు. ఇక రీసెంట్‌ బిగ్ బాస్‌9 ముగిసినప్పటికీ.. ఈ సీజన్ విన్నర్ కళ్యాణ్ ఫ్యాన్స్.. తనూజపై రెచ్చి పోయి నెట్టింట కామెంట్స్ పెడుతున్నారు. ఆమె ప్రతీ పనిని విమర్శిస్తున్నారు. ట్రోల్ చేస్తున్నారు. దీంతో రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న తనూజ.. ఇప్పుడు ఉన్నట్టుండి ఒక్క సారిగా ట్రోలర్స్ పై సీరియస్ అయ్యారు. కొందరు నెటిజన్లు చిత్రవధ చేస్తున్నారు.. నేను భరించలేకపోతున్నా అంటూ ఎమోషనల్ అయ్యారు. అసభ్య కామెంట్లు పెట్టే ఫేక్‌ అకౌంట్స్‌ ఎక్కడినుంచి పుట్టుకొస్తున్నాయో అర్థం కావడంలేదంటూ అసహనం వ్యక్తం చేశారు. తనను మానసికంగా చిత్రవధ చేస్తే ఏమోస్తుంది మీకు అంటూ ట్రోలర్స్‌ను ప్రశ్నించారు. తానే కాదు.. తనకు సపోర్ట్‌గా నిలబడ్డవారిని కూడా కొందరు నెటిజన్లు ద్వేషిస్తున్నారంటూ తనూజ ఆవేధన వ్యక్తం చేశారు. ఒకర్ని మానసికంగా చిత్రవధ చేస్తే ఏమొస్తుంది? ఒకరిపై విషం చిమ్మితే ప్రశాంతంగా ఉండొచ్చనుకుంటున్నారా? ఇక్కడ నేనెవర్నీ కిందకు లాగాలనుకోవడం లేదు. డ్రామా క్రియేట్‌ చేయాలని అసలే అనుకోవట్లేదు. నా పని నేను చేసుకుంటూ ప్రశాంతంగా, గౌరవంగా జీవించాలనుకుంటున్నాను అంటూ ఎమోషనల్‌గా తన పోస్టులో తనూజ ఎమోషనల్‌గా రాసుకొచ్చింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 5 ET: విజయ్‌‌తో పెళ్లి.. డేట్‌ కన్ఫామ్ చేసిన రష్మిక

TOP 9 ET: 6 నెలలు ట్రైనింగ్ ఇప్పించి మరీ నా రన్నింగ్ స్టైల్ మార్చాడు..

Chiranjeevi: ఏదో పొరపాటున చెబితే.. నాకు క్యాన్సర్ అంటూ ప్రచారం చేశారు

లీకులు.. చాటింగ్ లు.. ఒకటా రెండా? ఎమ్మెల్యే శ్రీధర్ అన్‌లిమిడెడ్ బాగోతం

కుళ్ళిన మాంసంతో నూనె దందా.. ఎవరా ముఠా