vaishali tucker: సీరియల్ నటి వైశాలి ఆత్మహత్య కేసులో కీలక మలుపు.. అతని వేధింపులు భరించలేకనే..

ఆమె ఇంటి ముందు ఉండే రాహుల్ అనే వ్యక్తి వేధింపులు భరించలేక వైశాలి ఆత్మహత్యకు పాల్పడిందని ఇండోర్ ఏసీపీ ఎం.రెహమాన్ తెలిపారు. ఆమె ఇ-గాడ్జెట్‏లో ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

vaishali tucker: సీరియల్ నటి వైశాలి ఆత్మహత్య కేసులో కీలక మలుపు.. అతని వేధింపులు భరించలేకనే..
Vaishali
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 17, 2022 | 4:14 PM

హిందీ బుల్లితెర నటి వైశాలి టక్కర్ ఆత్మహత్య కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లోని తన నివాసంలో వైశాలి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. వైశాలి డెడ్ బాడీతోపాటు.. సూసైడ్ నోట్ కూడా పోలీసులు స్వాదధీనం చేసుకున్నారు. ఆమె ఇంటి ముందు ఉండే రాహుల్ అనే వ్యక్తి వేధింపులు భరించలేక వైశాలి ఆత్మహత్యకు పాల్పడిందని ఇండోర్ ఏసీపీ ఎం.రెహమాన్ తెలిపారు. ఆమె ఇ-గాడ్జెట్‏లో ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. వైశాలిని రాహుల్ వేధించినట్లు విచారణలో తేలిందని ఆయన పేర్కొన్నారు. ఆమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకోబోతుందని తెలిసి రాహుల్ గొడవ చేశాడని. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నట్లు ఏసీపీ రెహమాన్ తెలిపారు.

వైశాలికి కెన్యాలో పనిచేస్తున్న సర్జన్ అభినందన్ సింగ్‏తో నిశ్చితార్థం జరిగినట్లుగా తెలుస్తోంది. ఆమె స్వస్థలం ఉజ్జయిని జిల్లాలలోని మహిద్ పూర్. అయితే గత రెండేళ్లుగా ఇండోర్‏లో నివసిస్తుంది. ఆమె 2015లో యే రిష్తా క్యా కెహ్లెతా అనే సీరియల్ ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సూపర్ సిస్టర్స్, మన్మోహిని 2 ధారవాహికలో నటించింది. ఆమె చివరిగా రక్షాబంధన్ సీరియల్ లో కనిపించింది.

వైశాలి టక్కర్ దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్‏పుత్ కు బెస్ట్ ఫ్రెండ్. అతను ఆత్మహత్య చేసుకోవడం పై ఆమె చాలా అనుమానాలు వ్యక్తం చేసింది. సుశాంత్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని.. అతని మరణం వెనక చాలా మంది ప్రమేయం ఉందని ఆరోపించింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?