AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SSMB 29 : మహేష్, రాజమౌళి సినిమా.. సెంథిల్‌ ఎందుకు లేరు..? మాస్‌ సాంగ్‌ ముచ్చటేంటి..?

డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అడియన్స్ ఎదురుచూస్తున్నారు. దీంతో ఈ సినిమాకు సంబంధించిన ఏ అప్డేట్ అయినా క్షణాల్లో వైరల్ అవుతుంది. తాజాగా ఈ మూవీపై సినిమాటోగ్రాఫర్ కెకె సెంథిల్ కుమార్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

SSMB 29 : మహేష్, రాజమౌళి సినిమా.. సెంథిల్‌ ఎందుకు లేరు..? మాస్‌ సాంగ్‌ ముచ్చటేంటి..?
Senthil Kumar
Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: |

Updated on: Jul 15, 2025 | 7:51 PM

Share

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది SSMB29. ఇండియన్ సినిమా స్థాయిని అంతర్జాతీయంగా తీసుకెళ్లిన క్రియేటివ్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి. ఆయన డైరక్షన్‌లో ట్రిపుల్‌ ఆర్‌ తర్వాత వస్తున్న సినిమా.. అందులోనూ ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్ తో తెరకెక్కుతున్న సినిమా కావడంతో వరల్డ్ వైడ్‌ బజ్‌ ఉంది. ఇప్పటిదాకా ప్యాన్‌ ఇండియా సినిమా కూడా చేయని మహేష్‌ని, ఏకంగా ఇంటర్నేషనల్‌ స్టార్‌గా ఎస్టాబ్లిష్‌ చేయడానికి రాజమౌళి అన్ని రకాల జాగ్రత్తల్నీ తీసుకుంటున్నారు. మాస్, యాక్షన్, అడ్వెంచర్, ఎమోషన్, విజువల్స్… ప్రతి యాంగిల్‌లోనూ ది బెస్ట్ అనిపించుకునేలా తెరకెక్కించి శభాష్‌ అనిపించుకోవాలన్న ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నారు జక్కన్న.

ప్రీ ప్రొడక్షన్‌ స్టేజ్‌ దాటి, విజువలైజేషన్‌ ఫేజ్‌లోకి ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చేసింది ఎస్‌ ఎస్‌ ఎంబీ29. ఆల్రెడీ కొన్ని షెడ్యూల్స్ కంప్లీట్‌ అయ్యాయి. ఈ పని చేశాం.. అని ప్రత్యేకించి రాజమౌళి ఎక్కడా ఏమీ చెప్పకపోయినా, అన్నీ విషయాలను ఏదో రకంగా కనుక్కుంటూనే ఉన్నారు అభిమానులు. తనదైన టీమ్‌తో ఎప్పుడూ ముందుకు నడిచే రాజమౌళి ఎస్‌ ఎస్‌ ఎంబీ 29కి మాత్రం సెంథిల్‌ ని తనవెంట పెట్టుకోలేదు. రాజమౌళి – సెంథిల్‌ కాంబో ఈ సినిమాలో లేదన్న నిజాన్ని చాలా మంది ఇంకా నమ్మలేకపోతున్నాయి. వారిద్దరి కాంబినేషన్‌కి ఉన్న క్రేజ్‌ అలాంటిది మరి. మగధీర, ఈగ, బాహుబలి, RRR లాంటి విజువల్ స్పెక్టాకిల్స్ కి ఈ కాంబో కలిసి పనిచేసింది.

మరి ఎస్‌ ఎస్‌ఎంబీ29కి మాత్రం సెంథిల్‌ ఎందుకు పనిచేయడం లేదు? ఈ విషయాన్ని లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో అడ్రస్‌ చేశారు సెంథిల్‌. ‘అది సంపూర్ణంగా రాజమౌళి నిర్ణయం. ఆయన కొత్తగా ఏదో ట్రై చేయాలని అనుకున్నట్టున్నారు. అలా మూవ్‌ అయ్యారు’ అని ఓపెన్‌ అయ్యారు సెంథిల్‌.

ఇవి కూడా చదవండి

ఓ వైపు సెంథిల్‌ చెప్పిన విషయం, మరోవైపు ఎస్‌ ఎస్‌ ఎంబీ29లో మాస్‌ సాంగ్‌ పక్కాగా ఉంటుందనే న్యూస్‌తో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది ఎస్‌ ఎస్‌ ఎంబీ హ్యాష్‌ ట్యాగ్‌. ‘గుంటూరు కారం’లో కుర్చీ మడతపెట్టి.. సాంగ్‌కి మహేష్‌ వేసిన స్టెప్పులు లాంటివే.. ఇప్పుడు రాజమౌళి సినిమాలోనూ ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయనే టాక్‌ వినిపిస్తోంది. ఈ మాటలు వైరల్‌ కాగానే.. ఇందులో స్టెప్పులేసే స్పెషల్‌ లేడీ ఎవరని ఆరా తీస్తున్నారు ఆడియన్స్. హైదరాబాద్‌ పరిసరాల్లో ఈ సాంగ్‌ కోసం ఓ స్పెషల్‌ సెట్‌ కూడా వేశారని టాక్‌. మార్కెట్‌ ప్లేస్‌ థీమ్‌తో సాగుతుందట ఈ సాంగ్‌. రియల్‌ లొకేషన్స్ ని రీక్రియేట్‌ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వీటన్నిటినీ బట్టి చూస్తుంటే, రాజమౌళి – మహేష్ బాబు కాంబో సరికొత్త హై బెంచ్‌ మార్క్ సెట్ చేయనుంది అనడంలో సందేహం లేదని ఖుషీ అవుతున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి : 

Kota Srinivasa Rao: సినిమాలంటే ఆసక్తి లేకుండానే 750 పైగా చిత్రాలు.. ఎలా చేశారో తెలుసా..?

Tollywood: ఒక్క సినిమా చేయకుండానే క్రేజీ ఫాలోయింగ్.. నెట్టింట గ్లామర్ అరాచకమే ఈ అమ్మడు..

Bigg Boss 9 Telugu: బిగ్‏బాస్‏లోకి సోషల్ మీడియా క్రేజీ బ్యూటీ.. నెట్టింట ఫుల్ లిస్ట్ లీక్.. ఇక రచ్చే..

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్