బైకు ప్రమాదంలో కొడుకు మరణం.. లారీ గుద్దడంతో కూతురికి అవిటితనం! కోట బాధలు వింటే కన్నీళ్లే
కష్టాలు మనుషులకు వస్తాయి. అవునే కాదనలేం. కానీ ఆ కష్టాలన్నీంటిని ఎదురించి వాటి వల్ల వచ్చిన బాధలను దిగమింగి.. తన నటనతో వెండి తెరపై వెలిగిన గొప్ప నటుడు కోట. అయితే కోట మరణం తర్వాత ఆయన కస్టాలు. బాధలు.. కన్నీళ్లు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. గతంలో ఆయన పలు ఇంటర్వ్యూల్లో చెప్పిన సంగతులు సోషల్ మీడయాలో వైరల్ అవుతున్నాయి.
ఆ క్రమంలోనే తన బిడ్డలకు జరిగిన ప్రమాదాలు ఆయన్ను ఎంతగా బాధించాయో మరో సారి ఇప్పుడు తెలియజేస్తున్నాయి. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కోట… తనకు ఎదురైన బాధల గురించి చెప్పుకొచ్చాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు బైకు ప్రమాదంలో మరణించాడని చెప్పుకొంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. 2010 జూన్ 21న రోడ్డు ప్రమాదంలో కోటా కుమారుడు ఆంజనేయ ప్రసాద్ మరణించాడు. తనకు తలకొరివి పెట్టాల్సిన కొడుక్కి.. తానే అంత్యక్రియలు చేయాల్సి రావడంతో తల్లడిల్లిపోయారు. ఆ బాధ నుంచి బయటపడ్డారా? అని అడిగినప్పుడు మర్చిపోవడానికి ఇదేమైనా జ్ఞాపకమా? జీవితం.. ఎలా మర్చిపోతాను? అంటూ ఓ నిట్టూర్పు విడిచారు. కానీ నటనలో బిజీగా ఉండటం వల్ల ఆ బాధను ఎంతో కొంత తట్టుకోగలిగాను అని అన్నారు కోట. ఇక తన రెండో కూతురు కూడా ప్రమాదంతో కాలు పోగొట్టుకుందంటూ అప్పటి ఇంటర్వ్యూలో కోట బయటపెట్టారు. తన రెండో అమ్మాయి ఎంకాం చదివిందని చెప్పిన కోట.. తను ఎప్పుడూ రిక్షా ఎక్కలేదని.. ముచ్చపడి ఓ సారి విజయవాడలో బంధువులతో కలిసి రిక్షా ఎక్కింది. ఎదురుగా బ్రేకులు ఫెయిలైన లారీ అదే రిక్షాను గుద్దడంతో… ఆ ప్రమాదంలో కొందరు చనిపోగా తన కూతురు మాత్రం కాలు కోల్పోయి ప్రాణాలతో బయటపడిందంటూ చెప్పారు కోట. అంతేకాదు బ్యాంకులో ఎవరిదగ్గరైతే గుమాస్తాగా పనిచేశానో ఆయనే తనకు వియ్యంకుడయ్యాడన్నారు. నా కూతురు జీవితం బాగుపడిందని సంతోషించేలోపే నా కుమారుడు చనిపోయాడు. ఆ భగవంతుడు ఎంత పేరిచ్చాడో అన్ని కష్టాలిచ్చాడు. ఇవన్నీ గుర్తుచేసుకుని అప్పుడప్పుడు ఇంట్లో కూర్చుని ఏడుస్తూ ఉంటాను అంటూ కోట ఎమోషనలయ్యారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
2 కోట్లతో సొంతూరిలో ఆసుపత్రి.. ఇంకా ఎన్నో.. బయటికొచ్చిన ఆర్. నారాయణ మూర్తి గొప్పతనం
ఛావా రికార్డు బ్రేక్ చేసిన 3 కోట్ల మూవీ.. చూస్తే వణికిపోవాల్సిందే
రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.1600 కోట్ల కలెక్షన్స్.. బాక్సాఫీస్ షేక్ చేసిన హారర్ మూవీ..
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

