అనసూయను మోసం చేసి డబ్బు గుంజిన కేటుగాళ్లు
ఈ మధ్య సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. పలు రకాల పన్నాగాలతో... నెట్టింట అందరికీ గాలం వేస్తూ.. మోసం చేస్తున్నారు. డబ్బులు గుంజుతున్నారు. ఇందుకు సెలబ్రిటీలు కూడా బలవుతున్నారు. ఇప్పుడు వారిలో అనసూయ కూడా చేరిపోయారు. ఇక ఇదే విషయాన్న తనే స్వయంగా చెబుతూ తన సోషల్ మీడియా హ్యాండిల్లో ఓ స్టోరీని షేర్ చేశారు.
ఓ ఈ కామర్స్ సైట్ వల్ల తాను మోసపోయనంటూ.. వేరే వాళ్లు నాలా మోసపోకూడదంటూ హెచ్చరించారు. అనసూయ నెల క్రితం ట్రఫుల్ ఇండియా అనే క్లాతింగ్ వెబ్ సైట్ లో కొన్ని దుస్తులను ఆర్డర్ పెట్టింది. ముందే డబ్బులు చెల్లించింది. కానీ ఇప్పటికీ తనకు సదరు వస్తువులు రాలేదని.. అదే టైంలో రీఫండ్ కూడా రాలేదని చెప్పుకొచ్చింది. సొంతంగా దుస్తులు అమ్ముతున్నామని చెప్పి డబ్బులు కాజేస్తున్నారని మండిపడింది. ఈ విషయంపై తాను స్పందించకూడదని అనుకున్నానని.. కానీ మిగతా వారు తనలాగా మోసపోవద్దని చెప్పేందుకే ఈ పోస్ట్ చేసినట్లు తన పోస్టులో రాసుకొచ్చింది. అనసూయ మాత్రమే కాకుండా చాలా మందికి ఇలాంటి ఆన్ లైన్ మోసాలు ఎదురవుతున్నారు. అందుకు తగినట్లే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. ఇప్పుడు అనసూయ కూడా ఆన్ లైన్ మోసానికి గురైంది. దీంతో ఈ టాపిక్ కాస్తా ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చిరులా.. నోరు జారిన నాగ్ రజినీ ఫ్యాన్స్ సీరియస్
ఆ లెజెండరీ డైరెక్టర్‌ను ఫాలో అవుతున్న సందీప్ రెడ్డి వంగా…
రూ.1000 కోట్లతో సినిమా తీస్తా !! శంకర్ అనౌన్స్‌మెంట్‌తో షాకవుతున్న ప్రొడ్యూసర్లు
కన్నప్ప అట్టర్ ఫ్లాప్ అంటూ ట్రోలింగ్.. మోహన్ బాబు రియాక్షన్
కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన నవ జంట.. అంతలోనే..
రెండు నెలల ఆపరేషన్ సక్సెస్.. బోనులో చిక్కిన మ్యాన్ ఈటర్
అమావాస్య వేళ పచ్చని పొలంలో క్షుద్ర పూజలు.. ఏం జరిగిందంటే
చలి వణికిస్తుంటే.. ఈ ఆటో డ్రైవర్ మాస్టర్ ప్లాన్ చూశారా?
కొడుకు సమాధి వద్ద సీసీ కెమెరా ఏర్పాటు.. ఎందుకో తెలిస్తే..
సముద్ర తీరంలో ఊహించని అతిథి.. అంతలోనే
అల్లుడితో కలిసి భర్తను చంపిన అత్త.. కారణం మీరనుకున్నదేనా ??

