AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Inter 2026 Revised Time Table: ఏపీ ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల టైం టేబుల్ మారిందోచ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే

ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఇటీవల కూటమి సర్కార్‌ 2026 సంవత్సరానికి సెలవుల క్యాలెండర్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో హోలీ, రంజాన్‌ పండగల సెలవు రోజుల్లో వస్తున్న ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ పరీక్షల తేదీలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రెండు పరీక్షల తేదీలను మార్పు చేసినట్లు ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి రంజిత్‌ బాషా తెలిపారు. మిగతా పరీక్షల్లో ఎలాంటి..

AP Inter 2026 Revised Time Table: ఏపీ ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల టైం టేబుల్ మారిందోచ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే
Andhra Pradesh Inter 2026 Revised Time Table
Srilakshmi C
|

Updated on: Dec 20, 2025 | 7:09 AM

Share

అమరావతి, డిసెంబర్‌ 20: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఇటీవల కూటమి సర్కార్‌ 2026 సంవత్సరానికి సెలవుల క్యాలెండర్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో హోలీ, రంజాన్‌ పండగల సెలవు రోజుల్లో వస్తున్న ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ పరీక్షల తేదీలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రెండు పరీక్షల తేదీలను మార్పు చేసినట్లు ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి రంజిత్‌ బాషా తెలిపారు. మిగతా పరీక్షల్లో ఎలాంటి మార్పులూ ఉండబోవని, ఆయా తేదీల్లో యథాతథంగా జరుగుతాయని వెల్లడించారు. సెకండ్ ఇయర్‌ మ్యాథ్స్ పేపర్‌ 2ఏ, సివిక్స్‌ పేపర్‌ 2 పరీక్షలు గతంలో ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం మార్చి 3న జరగాల్సి ఉంది. మార్చి 3న హోలీ పండగ ఉండటంతో ఈ పరీక్షలను మార్చి 4కు మార్చారు. మార్చి 20న జరగాల్సిన మొదటి ఏడాది పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, లాజిక్‌ పరీక్షలు మార్చి 20న జరగాల్సి ఉండగా.. ఈ రోజు రంజాన్‌ పండగ సెలవు వచ్చింది. దీంతో ఈ పరీక్షలను మార్చి 21వ తేదీకి సవరించారు. ఈ మేరకు టైం టేబుల్‌లో మార్పులు చేసినట్లు ఇంటర్‌ బోర్డు ప్రకటించింది.

ఏడాది ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌ సిలబస్‌ మారడంతో పాటు పరీక్షల విధానంలోనూ మార్పులు చేయడంతో ఫస్ట్‌ ఇయర్‌ బ్యాక్‌లాగ్‌ సబ్జెక్టులకు ప్రత్యేకంగా షెడ్యూల్‌ ఇచ్చారు. నైతికత, మానవ విలువల పరీక్షలు జనవరి 21న, పర్యావరణ పరీక్ష జనవరి 23న నిర్వహిస్తారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఇక ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు, వృత్తివిద్యా కోర్సులకు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 10 వరకు జరుగుతాయి. ఉదయం 9 నుంచి 12గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు రెండు విడతలుగా ప్రాక్టికల్స్‌ నిర్వహిస్తారు.

ఇవి కూడా చదవండి

ఏపీ ఇంటర్ 1st ఇయర్‌ పరీక్షల కొత్త టైం టేబుల్‌ 2026 ఇదే..

  • ఫిబ్రవరి 23న లాంగ్వేజ్ పేపర్ 1 పరీక్ష
  • ఫిబ్రవరి 25న ఇంగ్లీష్ పేపర్ 1 పరీక్ష
  • ఫిబ్రవరి 27న హిస్టరీ పేపర్ 1 పరీక్ష
  • మార్చి 2న మ్యాథ్స్ పేపర్ 1 పరీక్ష
  • మార్చి 5న జూలాజీ / మ్యాథ్స్ 1బి పరీక్ష
  • మార్చి 7న ఎకనామిక్స్ 1 పరీక్ష
  • మార్చి 10న ఫిజిక్స్ 1 పరీక్ష
  • మార్చి 12న కామర్స్ / సోషియాలజీ / మ్యూజిక్ 1 పరీక్ష
  • మార్చి 14న సివిక్స్ 1 పరీక్ష
  • మార్చి 17న కెమిస్ట్రీ 1 పరీక్ష
  • మార్చి 21న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / లాజిక్ 1 పరీక్ష (పరీక్ష తేదీ మారింది)
  • మార్చి 24న మోడ్రన్ లాంగ్వేజ్ / జియోగ్రఫీ 1 పరీక్ష

ఏపీ ఇంటర్ 2nd ఇయర్‌ పరీక్షల కొత్త టైం టేబుల్‌ 2026 ఇదే..

  • ఫిబ్రవరి 24న లాంగ్వేజ్ పేపర్ 2 పరీక్ష
  • ఫిబ్రవరి 26న ఇంగ్లీష్ పేపర్ 2 పరీక్ష
  • ఫిబ్రవరి 28న హిస్టరీ / బోటనీ పేపర్ 2 పరీక్ష
  • మార్చి 4న మ్యాథ్స్ పేపర్ 2 ఎ / సివిక్స్ 2 పరీక్ష (పరీక్ష తేదీ మారింది)
  • మార్చి 6న జూలాజీ 2 / ఎకనామిక్స్ 2 పరీక్ష
  • మార్చి 9న మ్యాథ్స్ పేపర్ 2 బి పరీక్ష
  • మార్చి 11న ఫిజిక్స్ / కామర్స్ / సోషియాలజీ / మ్యూజిక్ 2 పరీక్ష
  • మార్చి 13న ఫిజిక్స్ 2 పరీక్ష
  • మార్చి 16న మోడ్రన్ లాంగ్వేజ్ / జియోగ్రఫీ 2 పరీక్ష
  • మార్చి 18న కెమిస్ట్రీ 2 పరీక్ష
  • మార్చి 23న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / లాజిక్ 2 పరీక్ష

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా