Satyam Sundaram 2024 Movie Review: ‘సత్యం సుందరం’ సినిమా రివ్యూ.. కార్తి, అరవిందస్వామి కాంబో ఎలా ఉందంటే..
కార్తీ, అరవింద స్వామి హీరోలుగా 96 ఫేమ్ ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన సినిమా సత్యం సుందరం. తమిళంలో ప్రీమియర్స్ నుంచే ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు మొదలయ్యాయి. మరి తెలుగులో సత్యం సుందరం ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..
మూవీ రివ్యూ: సత్యం సుందరం
నటీనటులు: కార్తీ, అరవింద్ స్వామి, శ్రీ దివ్య, దేవదర్శిని, స్వాతి కొండే తదితరులు
సంగీతం: గోవింద్ వసంత
సినిమాటోగ్రాఫర్: మహేంద్రన్ జయరాజు
ఎడిటర్: ఆర్.గోవిందరాజ్
కథ, స్క్రీన్ ప్లే,దర్శకుడు: సి. ప్రేమ్ కుమార్
నిర్మాతలు: జ్యోతిక సదన, సూర్య శివకుమార్
కార్తీ, అరవింద స్వామి హీరోలుగా 96 ఫేమ్ ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన సినిమా సత్యం సుందరం. తమిళంలో ప్రీమియర్స్ నుంచే ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు మొదలయ్యాయి. మరి తెలుగులో సత్యం సుందరం ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..
కథ:
సత్యం (అరవింద స్వామి) కుటుంబాన్ని ఊర్లో కొందరు మోసం చేయడంతో ఉన్న ఇంటిని అమ్ముకొని వైజాగ్ కు షిఫ్ట్ అవుతారు. అక్కడి నుంచి వచ్చిన కూడా ఆయనకు ఆ ఇల్లు అంటే ప్రాణం. కానీ తమను మోసం చేసిన ఆ ఊరు అన్న, ఆ మనుషులు అన్న సత్యంకు కోపం. అందుకే మళ్ళీ ఎప్పుడు ఆ ఊరికి వెళ్లడు. కానీ తన చెల్లెలు భువన పెళ్లికి 20 ఏళ్ల తర్వాత ఊరికి రావాల్సి వస్తుంది. అలా పెళ్ళికి వెళ్లిన సత్యంకు బాగా తెలిసిన వ్యక్తిగా సుందరం (కార్తీ) పరిచయం అవుతాడు. అతడిని బావ అని పిలుస్తుంటాడు. కానీ సత్యంకు మాత్రం సుందరం ఎవరో గుర్తుకురాదు. అక్కడ నుంచి ఈ ఇద్దరి పరిచయం ఎలా సాగింది.. మొదట్లో సుందరం ను చూసి నసగాడు అనుకున్నా.. ఆ తర్వాత అతనికి ఎమోషనల్ గా సత్యం ఎందుకు అంతగా కనెక్ట్ అవుతాడు అనేది సినిమా చూస్తే అర్థమవుతుంది..
కథనం:
కొన్ని సినిమాలలో కథలో ఏదో తెలియని ఒక జీవం ఉంటుంది. అది ఉన్నప్పుడు భాషతో సంబంధం అవసరం ఉండదు. ఎవరు చూసినా ఈజీగా కనెక్ట్ అయిపోతుంది. ఇంకొన్ని సినిమాలు మనతో మాట్లాడుతుంటాయి.. కథలు త్వరగా కనెక్ట్ అవుతుంటాయి. జీవితంలో జరిగిన సంఘటనలను గుర్తు చేస్తుంటాయి. మనతో పాటే ఆ కథ ప్రయాణం చేస్తుంది. అలాంటి సినిమానే సత్యం సుందరం.. ఓ మంచోడి కథ ఇది.. భరించలేనంత మంచోడి కథ. మన లైఫ్ లో ఇలాంటి ఓ మంచోడు ఉంటే బాగుణ్ణు అనిపించే కథ. ఇదేం తెలియని కథ కాదు.. 20 ఏళ్ళ తర్వాత ఊరికి వచ్చిన బావపై బామ్మర్ది చూపించే ప్రేమే ఈ సినిమా. తెలియకుండానే కథలో లీనం అయిపోతాం.. అందులో ఎమోషన్స్ కి కనెక్ట్ అయిపోతాం. వాళ్ళు నవ్వితే నవ్వుతాం.. ఏడిస్తే ఏడుస్తాం.. ఇంత ఎమోషన్ ఈ మధ్య కాలంలో ఏ సినిమాలో చూడలేదు. కనీసం ఒక్కసారైనా కళ్ళు చెమ్మగిల్లే కథ ఇది. ఫస్టాఫ్, సెకండాఫ్ అని తేడా లేదు.. రెండూ ఆకట్టుకుంటాయి. చిన్ననాటి రోజుల్ని గుర్తు తెప్పిస్తుంది. ఇంకా పర్టికులర్ గా చెప్పాలంటే చిన్న చిన్న సన్నివేశాలు కూడా అద్భుతంగా రాసుకున్నాడు దర్శకుడు ప్రేమ్ కుమార్. తన చెల్లి పెళ్లికి వచ్చినప్పుడు గిఫ్ట్ తీసుకొచ్చి.. అక్కడ ఒక్కొక్కటి ఆమెకు స్వయంగా అన్నయ్య తొడుగుతుంటే ఎమోషన్ చాలా బాగా వర్కౌట్ ఉంది. అలాగే కార్తీ, అరవింద స్వామి మధ్యలో వచ్చే ప్రతి సీన్ కూడా అద్భుతంగా ఉంది. సెకండాఫ్ ఎమోషన్ అద్భుతంగా క్యారీ అయింది.
నటీనటులు:
కార్తీ ఓ అద్భుతం.. కామెడీతో బాగా నవ్వించాడు.. ఎమోషన్ తో ఏడిపించాడు. ఇలాంటి క్యారెక్టర్స్ గతంలో కూడా కార్తి చేశాడు. కానీ ఇందులో కెరీర్ బెస్ట్ ఫర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అరవింద్ స్వామి చాలా బాగా నటించాడు. ఆ పాత్రకు సరిగ్గా సరిపోయాడు. సీనియర్ నటులు రాజ్ కిరణ్, జయప్రకాష్ ఉన్నది కాసేపైనా చాలా బాగున్నారు. దేవదర్శని లాంటి వాళ్ళు కూడా చిన్న క్యారెక్టర్స్ చేసిన ఆకట్టుకున్నారు.
టెక్నికల్ టీం:
గోవింద్ వసంత్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రాణం. చిన్న చిన్న సన్నివేశాలను కూడా తన అరే రికార్డింగ్ తో అద్భుతం చేసి చూపించాడు ఈయన. ఎడిటర్ కూడా అద్భుతమైన పనితీరు కనబరిచారు. అక్కడక్కడ స్లో అయిన ఫీలింగ్ వచ్చినప్పుడు బోర్ అయితే కొట్టదు. సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది. దర్శకుడు ప్రేమ్ కుమార్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. 96లో సింపుల్ కథను మనసుకి హత్తుకునేలా తీశాడు ఈ దర్శకుడు. ఇప్పుడు సత్యం సుందరం కూడా అంతే. చాలా అంటే చాలా చిన్న కథను మనసును కలిగించేలా తెరకెక్కించాడు.
పంచ్ లైన్:
ఓవరాల్ గా సత్యం సుందరం.. మనసు నిండే మంచి సినిమా..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.