Bigg Boss 8 Telugu: ముగిసిన బిగ్‏బాస్ ఓటింగ్.. ఆమె కోసం అతడు బలి.. ఊహించని కంటెస్టెంట్

సోమవారం జరిగిన నామినేషన్స్ లో నబీల్ వర్సె్స్ సోనియా టీమ్ మధ్య హీట్ డిస్కషన్ నడిచింది. ఇక ఆ మరుసటి రోజు నబీల్ ఏకంగా 35 శాతం ఓటింగ్ తో టాప్ లో నిలిచాడు. ఈ వారం మొత్తం అత్యధిక ఓటింగ్ తో నబీల్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానంలో మణికంఠ ఉన్నాడు.

Bigg Boss 8 Telugu: ముగిసిన బిగ్‏బాస్ ఓటింగ్.. ఆమె కోసం అతడు బలి.. ఊహించని కంటెస్టెంట్
Bigg Boss 8 Telugu Eliminat
Follow us

|

Updated on: Sep 28, 2024 | 1:33 PM

బిగ్‏బాస్ సీజన్ 8 రసవత్తరంగా సాగుతుంది. ఇప్పటివరకు ముగ్గురు ఎలిమినేట్ కాగా.. ప్రస్తుతం హౌస్ లో 11 మంది ఉన్నారు. ఇక ఇప్పుడు నాలుగో వారం ఎలిమినేషన్ సమయం కూడా దగ్గరపడింది. సోమవారం అర్దరాత్రి నుంచి మొదలైన ఓటింగ్.. శుక్రవారం వరకు కొనసాగింది. ఇక ఇప్పుడు ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయ్యాయి. దీంతో ఈవారం ఎవరు ఎలిమినేట్ కానున్నారనే విషయంపై మరికొన్ని గంటల్లో పూర్తిగా క్లారిటీ రానుంది. మొదటి నుంచి జనాల్లో పూర్తిగా నెగిటివిటీ సొంతం చేసుకున్న కంటెస్టెంట్స్ సోనియా, పృథ్వీ ఇద్దరూ ఈసారి డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సోనియా పై నిఖిల్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. రోజు రోజుకీ నిఖిల్ టైటిల్ రేసులో దూరమవుతున్నాడని.. ఎలాగైన సోనియాను బయటకు పంపించాలని నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. సోనియా పై కోపంతో మిగతా కంటెస్టెంట్స్ కు ఓట్లు వేస్తున్నారని సోషల్ మీడియా నివేదికలు చూస్తే తెలుస్తోంది.

ఈ వారం నామినేషన్లలో మొత్తం 8 మంది ఉన్నారు. నబీల్, సోనియా, మణికంఠ, పృథ్వీ, ఆదిత్య, ప్రేరణ, నైనిక నామినేట్ కాగా.. చీఫ్ నిఖిల్ తన స్పెషల్ పవర్ తో నైనికను సేవ్ చేశాడు. ఇక ఈ వారం తన ఆట తీరు.. ముఖ్యంగా సోనియా, పృథ్వీ, నిఖిల్ ఆట తీరుపై నబీల్ మాట్లాడిన పాయింట్స్ జనాలకు ఎక్కువగా కనెక్ట్ అయ్యాయి. దీంతో ఊహించని రేంజ్ లో నబీల్ కు ఓటింగ్ శాతం పెరిగిపోయింది. సోమవారం జరిగిన నామినేషన్స్ లో నబీల్ వర్సె్స్ సోనియా టీమ్ మధ్య హీట్ డిస్కషన్ నడిచింది. ఇక ఆ మరుసటి రోజు నబీల్ ఏకంగా 35 శాతం ఓటింగ్ తో టాప్ లో నిలిచాడు. ఈ వారం మొత్తం అత్యధిక ఓటింగ్ తో నబీల్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానంలో మణికంఠ ఉన్నాడు.

ప్రస్తుతం మొదటి స్థానంలో నబీల్ దూసుకుపోతుండగా.. ఆ తర్వాత మణికంఠ, ప్రేరణ ఉన్నారు. దీంతో ఈ వారం ముగ్గురు సేఫ్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వీరి తర్వాత ఆదిత్య ఓం, పృథ్వీ, సోనియా డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి అతి తక్కువ ఓటింగ్ లో ఆదిత్య ఓం, పృథ్వీ ఉన్నారు. కానీ సోనియాను టార్గెట్ చేసిన నిఖిల్ ఫ్యాన్స్ ఆమె పై కోపంతో అటు పృథ్వీ, ఆదిత్య ఓంకు సపోర్ట్ చేశారు. దీంతో సోనియాకు అతి తక్కువ ఓటింగ్ వచ్చినట్లు తెలుస్తోంది. సోనియాను ఎలాగైనా ఈ వారం ఎలిమినేట్ చేయాలంటూ బిగ్‏బాస్ ప్రోమోస్ కింద తెగ కామెంట్స్ చేస్తున్నారు నిఖిల్ ఫ్యాన్స్. కానీ ఈసారి సోనియాకు బదులుగా ఆదిత్య ఓంను బయటకు పంపనున్నట్లు తెలుస్తోంది. సోనియా, పృథ్వీ, నిఖిల్ టీం వర్సెస్ సీత టీమ్ మధ్య గట్టి ఫైట్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అలాగే సోనియా ఉంటేనే కావాల్సినంత కంటెంట్, గొడవలు ఉండనున్నాయి. దీంతో ఆమెకు బదులుగా జనాల ఓట్లతో సంబంధం లేకుండా ఆదిత్య ఓంను ఎలిమినేట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. గత సీజన్లలోనూ అడియన్స్ ఓటింగ్ తో సంబంధం లేకుండా ఎలిమినేషన్ జరిగిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.