Jabardasth Vinod: రెండోసారి తండ్రైన జబర్దస్త్ వినోద్.. భార్య, పిల్లలు ఎంత క్యూట్‌గా ఉన్నారో చూశారా? వీడియో
జబర్దస్త్ తో పాటు కొన్ని టీవీ షోస్, సినిమాల్లోనూ నటించిన వినోద్ ఇప్పుడు బుల్లితెరకు పూర్తిగా దూరంగా ఉంటున్నాడు. అయితే తన సొంత యూట్యూబ్ ఛానెల్ ‘వినోద్ తో వినోదం’ అంటూ అభిమానులను అలరిస్తున్నాడు. తన లేటెస్ట్ వీడియోలను అందులో అప్ లోడ్ చేస్తూ ఎంటర్ టైన్ చేస్తున్నాడు.
జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో వినోద్ అలియాస్ జబరస్త్ వినోదిని కూడా ఒకరు. తనదైన లేడీ గెటప్స్ తో బుల్లితెర ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. ముఖ్యంగా చమ్మక్ చంద్రతో వినోదిని వేసిన స్కిట్లు ఓ రేంజ్ లో హిట్ అయ్యాయి. జబర్దస్త్ తో పాటు కొన్ని టీవీ షోస్, సినిమాల్లోనూ నటించిన వినోద్ ఇప్పుడు బుల్లితెరకు పూర్తిగా దూరంగా ఉంటున్నాడు. అయితే తన సొంత యూట్యూబ్ ఛానెల్ ‘వినోద్ తో వినోదం’ అంటూ అభిమానులను అలరిస్తున్నాడు. తన లేటెస్ట్ వీడియోలను అందులో అప్ లోడ్ చేస్తూ ఎంటర్ టైన్ చేస్తున్నాడు. ఇదంతా పక్కన పెడితే జబర్దస్త్ వినోద్ ఇటీవలే రెండోసారి తండ్రి అయ్యాడు. అతని భార్య విజయ లక్ష్మీ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభ సందర్భంగానే తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ప్రముఖ ఆలయాన్ని సందర్శించాడు వినోద్. అనంతరం ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. వీటికి ‘ఇట్స్ ఫ్యామిలీ, బ్లెస్డ్ టైమ్’ అంటూ క్రేజీ క్యాప్షన్ ఇచ్చాడు. ఇందులో వినోద్ కూతురు, కొడుకు ఎంతో క్యూట్ గా కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. పలువురు బుల్లితెర సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు జబర్దస్త్ వినోద్ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
తన మేనత్త కూతురు విజయలక్ష్మినే పెళ్లి చేసుకున్నాడు వినోద్. ఆమె స్వస్థలం కడప. లాక్ డౌన్ సమయంలో వీరి వివాహం జరిగింది. 2022లో వినోద్- విజయలక్ష్మీ దంపతులకు పాప పుట్టింది. ఇప్పుడు పండంటి మగ బిడ్డ వీరి జీవితంలోకి రావడంతో వినోద్ దంపతుల ఆనందానికి అవధుల్లేవు. కాగా అంతకు ముందు కొన్ని నెలల క్రితం తన భార్య సీమంతానికి సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు వినోద్. అలాగే మెటర్నిటీ ఫొటోషూట్ లో నూ మెరిశారీ లవ్లీ కపుల్.
భార్య, బిడ్డలతో జబర్దస్త్ వినోద్.. వీడియో ఇదిగో..
View this post on Instagram
జబర్దస్త్ వినోద్ భార్య సీమంతం.. వీడియో ఇదిగో..
View this post on Instagram
విజయ లక్ష్మీ సీమంతం ఫొటోలు.. ఇదిగో..
View this post on Instagram
మెటర్నిటీ ఫొటో షూట్ లో వినోద్ భార్య విజయ లక్ష్మి..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.