Devara Movie: సత్తా చాటిన దేవర.. ఎన్టీఆర్, సైఫ్ పారితోషికాలు ఎంతో తెలుసా..?

అటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా సత్తా చాటింది. మొదటి రోజే రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.68 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. వరల్డ్ వైడ్ రూ.140 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ జాన్వీ కపూర్. ఇది తెలుగులో తొలి సినిమా అయినా.. అందం, అభినయం, డ్యాన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది. అలాగే సైఫ్ అలీ ఖాన్ యాకింగ్ గురించి చెప్పక్కర్లేదు.

Devara Movie: సత్తా చాటిన దేవర.. ఎన్టీఆర్, సైఫ్ పారితోషికాలు ఎంతో తెలుసా..?
Devara Movie Cast
Follow us

|

Updated on: Sep 28, 2024 | 12:24 PM

మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర ఎట్టకేలకు అడియన్స్ ముందుకు వచ్చేసింది. విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా ఉదయం నుంచి మంచి రివ్యూస్ వచ్చాయి. డైరెక్టర్ కొరటాల శివ స్టోరీ, డైరెక్షన్, ఎన్టీఆర్ యాక్టింగ్ పై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా తారక్ ద్విపాత్రాభినయం అదరగొట్టాడని.. అలాగే యాక్షన్, బీజీఎం, మ్యూజిక్ సినిమాకు ప్రదాన అస్సెట్స్ గా నిలిచాయని క్రిటిక్స్ ప్రశించారు. అటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా సత్తా చాటింది. మొదటి రోజే రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.68 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. వరల్డ్ వైడ్ రూ.140 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ జాన్వీ కపూర్. ఇది తెలుగులో తొలి సినిమా అయినా.. అందం, అభినయం, డ్యాన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది. అలాగే సైఫ్ అలీ ఖాన్ యాకింగ్ గురించి చెప్పక్కర్లేదు.

దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఎన్టీఆర్, సైఫ్ రెమ్యునరేషన్ గురించి నెట్టింట చర్చ జరుగుతుంది. ఈ సినిమా బడ్జెట్ లో దాదాపు 26 శాతం ప్రధాన తారాగణం కోసమే చెల్లించారని టాక్ నడుస్తుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్, సైఫ్, జాన్వీ కపూర్, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ , శ్రీకాంత్ కీలకపాత్రలు పోషించారు. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం తారక్ రూ.45 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. కానీ ఇప్పుడు దేవర కోసం రూ.60 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది.

ఇవి కూడా చదవండి

అలాగే జాన్వీ కపూర్ ఒక్కో సినిమాకు 3.5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటుంది.. కానీ దేవర సినిమాకు ఆమె ఏకంగా రూ.5 కోట్లు తీసుకుందట. ఇక బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ దేవర సినిమాలో భైరా పాత్ర కోసం రూ.10 కోట్లు పారితోషికం తీసుకున్నారట. ప్రకాష్ రాజ్ రూ.1.5 కోట్లు, శ్రీకాంత్ రూ.50 లక్షలు, మురళీ శర్మ, నరైన్ లు ఒక్కొక్కరు రూ.40 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం దేవర సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే రూ.172 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.