Suriya: హిట్ కోసం సూర్య వెయిటింగ్.. హోప్స్ అన్ని ఆ సినిమా పైనే
కెరీర్‌లో ఏదో రకంగా తళుకుబెళుకులు కనిపిస్తూనే ఉన్నాయి కానీ, సాలిడ్ సక్సెస్ వస్తేనే కదా కిక్.. అని ఫీలవుతున్నట్టున్నారు నడిప్పిన్ నాయగన్ సూర్య. 2021లో జై భీమ్ ఇచ్చిన కిక్ మళ్లీ ఇప్పటిదాకా ఆయనకు ఏ సినిమా కూడా ఇవ్వలేదు. అందుకే కంగువ మీద కాస్త ఎక్కువగానే హోప్స్ పెట్టుకున్నారు ఈ స్టార్. జై భీమ్‌లో సూర్య యాక్టింగ్‌ని ఇప్పటికీ గుర్తుచేసుకుంటూ ఉంటారు అభిమానులు.
Updated on: Sep 28, 2024 | 12:01 PM

కెరీర్‌లో ఏదో రకంగా తళుకుబెళుకులు కనిపిస్తూనే ఉన్నాయి కానీ, సాలిడ్ సక్సెస్ వస్తేనే కదా కిక్.. అని ఫీలవుతున్నట్టున్నారు నడిప్పిన్ నాయగన్ సూర్య. 2021లో జై భీమ్ ఇచ్చిన కిక్ మళ్లీ ఇప్పటిదాకా ఆయనకు ఏ సినిమా కూడా ఇవ్వలేదు. అందుకే కంగువ మీద కాస్త ఎక్కువగానే హోప్స్ పెట్టుకున్నారు ఈ స్టార్.

జై భీమ్‌లో సూర్య యాక్టింగ్‌ని ఇప్పటికీ గుర్తుచేసుకుంటూ ఉంటారు అభిమానులు. ఇలాంటి స్క్రిప్ట్ లు సెలక్ట్ చేసుకోవడం కూడా ఓ కళేనని అప్పట్లో సూర్యకి ప్రశంసలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత ఆయన చేసిన ఎదర్కుమ్ తునిందవన్ కూడా సోషల్ కాజ్ ఉన్న సినిమానే. తమ తప్పు లేనప్పుడు ఆడపిల్లలు ధైర్యంగా తిరగాలన్న విషయాన్ని స్పష్టంగా చెప్పిన సినిమా ఎదర్కుమ్ తునిందవన్.

ఇప్పటికీ ఈ సినిమా మంచి వసూళ్లు సాధిస్తుండటంతో కొన్ని థియేటర్లలో ఆ సినిమాను కంటిన్యూ చేసే ఛాన్స్ ఉందంటున్నారు ఇండస్ట్రీ జనాలు.

ఆ రేంజ్ పేరు ఇప్పుడు కంగువతో వస్తుందని ఆశిస్తున్నారు సూర్య. ప్రతి ఫ్రేమ్ వేరే లెవల్లో ఉంటుందన్నది మేకర్స్ మొదటి నుంచీ చెబుతున్న మాట. 35కి పైగా భాషల్లో రిలీజ్‌కి రెడీ అవుతోంది కంగువ. నార్త్ నుంచి బాబీ డియోల్‌ని రంగంలోకి దించారు.

సినిమాలను జస్ట్ సినిమాలుగా చూసి ఆస్వాదించాలి. వాటిలో తప్పొప్పులను వెతుకుతూ కూర్చుంటే సినిమాలను ఎంజాయ్ చేయలేరన్నది సూర్య లేటెస్ట్ గా చెబుతున్న మాట. అంటే... కంగువ సినిమా కోసం ఆడియన్స్ ని నడిప్పిన్ నాయగన్ ఇప్పటి నుంచే ఇలా ప్రిపేర్ చేస్తున్నారా? అనే టాక్ మొదలైంది.




