Puri Jagannadh: హీరోయిన్ దొరికేసిందోచ్.. విజయ్ సేతుపతి జోడిగా ఆ క్రేజీ బ్యూటీ.. ఫోటో షేర్ చేసిన మేకర్స్..
విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ సౌత్ సినీపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్ సేతుపతి. హీరోయిజం సినిమాలు కాకుండా కంటెంట్ ప్రధానంగా ఉన్న సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవలే మహారాజా, ఎస్ చిత్రాలతో సక్సెస్ అందుకున్న ఈ హీరో ఇప్పుడు డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

దక్షిణాది చిత్రపరిశ్రమలోని అగ్ర హీరోలలో విజయ్ సేతుపతి ఒకరు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీరంగంలోకి అడుగుపెట్టి మొదట్లో చిన్న చిన్న పాత్రలు పోషించారు. హీరోయిజం, మాస్ యాక్షన్ ఉండే చిత్రాలు కాకుండా కంటెంట్ ప్రధానంగా ఉండే విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. విజయ్ సేతుపతి సినిమాలకు బాక్సాఫీస్ వద్ద స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ఇప్పటివరకు వరుస హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఈహీరో.. అటు విలన్ పాత్రలతోనూ ఇరగదీస్తున్నాడు. ఇప్పటికే ఉప్పెన సినిమాలో రాయనం పాత్రతో తెలుగువారికి దగ్గరయ్యారు. ఇక షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమాతో నార్త్ లోనూ ఫేమస్ అయ్యారు. ఇక ఇప్పుడు డేరింగ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ చేయనున్నారు. ఇదివరకు ఈ మూవీ గురించి అఫీషియల్ ప్రకటన వచ్చింది. దీంతో నిత్యం ఈ మూవీ గురించి ఏదోక న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.
ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ టబు కీలకపాత్రలో కనిపించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆ తర్వాత విజయ్ సేతుపతి జోడిగా చాలా మంది హీరోయిన్స్ పేర్లు తెరపైకి వచ్చాయి. బాలీవుడ్ బ్యూటీ రాధిక ఆప్టే నుంచి టాలీవుడ్ హీరోయిన్ నివేదా థామస్ వరకు ప్రతి ఒక్కరి పేర్లు వినిపించాయి. తాజాగా ఈ మూవీలో కనిపించే హీరోయిన్ గురించి అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాలో కేరళ కుట్టి సంయుక్త మీనన్ జాయిన్ అయినట్లు తెలుపుతూ ట్విట్టర్ ఖాతాలో ఆ బ్యూటీ ఫోటో షేర్ చేశారు. “ఆమె నడకలో హుందాతనం… కళ్లల్లో ఆగ్రహం” అంటూ సంయుక్తకు స్వాగతం పలికారు.
ఈ సినిమాకు బెగ్గర్ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. అలాగే భిక్షాందేహి అనే టైటిల్ పేరు సైతం వినిపిస్తుంది. కానీ వీటిపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. దీనిపై అధికారిక ప్రకటన కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. కొన్నాళ్లుగా సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నారు పూరి జగన్నాథ్. లైగర్, డబుల్ ఇస్మార్ట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాయి. దీంతో హిట్ అందుకోవడమే లక్ష్యంగా ఇప్పుడు విజయ్ సేతుపతితో చేయబోయే ప్రాజెక్ట్ పై మరింత ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం నిఖిల్ సిద్ధార్థ్ సరసన స్వయంభు చిత్రంలో నటిస్తుంది సంయుక్త.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
వయసు 41.. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు.. క్రేజ్ చూస్తే దిమాక్ కరాబ్..
సీరియల్లో పద్దతిగా.. వెకేషన్లో గ్లామర్‌గా.. రుద్రాణి అత్త అరాచకమే..
త్రిష అందానికి రహస్యం ఇదేనట.. ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట..
Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..