AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఒకప్పుడు రోడ్లపై నిమ్మరసం అమ్మింది.. ఇప్పుడు టాప్ మోస్ట్ హీరోయిన్.. ఆస్తులు కోట్లలో.. ఎవరంటే?

ఈ టాప్ మోస్ట్ హీరోయిన్ టీనేజ్ లో చాలా కష్టాలు పడింది. పొట్ట కూటి కోసం, కుటుంబ పోషణ కోసం రోడ్డుపై నిమ్మరసం అమ్మడాలు, ఇంటింటికీ తిరిగి వార్తా పత్రికలు వేయడం లాంటి పనులు చేసింది. కట్ చేస్తే.. ఇప్పుడామె ఆస్తులు వంద కోట్లకు పైగానే ఉన్నాయి.

Tollywood: ఒకప్పుడు రోడ్లపై నిమ్మరసం అమ్మింది.. ఇప్పుడు టాప్ మోస్ట్ హీరోయిన్.. ఆస్తులు కోట్లలో.. ఎవరంటే?
Sunny Leone
Basha Shek
|

Updated on: Dec 23, 2025 | 8:50 PM

Share

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు, హీరోయిన్లుగా వెలుగొందుతోన్న వారిలో చాలా మంది గతంలో చాలా కష్టాలు అనుభవించిన వారే. పొట్ట కూటి కోసం చిన్న చితకా పనులు, ఉద్యోగాలు చేసిన వారే. ఈ హీరోయిన్ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ఈ నటి కెనడాలో జన్మించింది. తల్లిదండ్రులను చూసుకునే క్రమంలో చిన్న వయసులోనే పని చేయడం ప్రారంభించింది. ఇళ్లపై మంచు తొలగించడం, రోడ్లపై నిమ్మరసం అమ్మడం, ఇంటింటికీ తిరిగి వార్తా పత్రికలు, పచ్చిక బయళ్లను తొలగించడం తదితర పనులు చేసింది. అలాగనీ చదువను నిర్లక్ష్యం చేయలేదు. అమెరికాలోనే పీడియాట్రిక్ నర్సుగా శిక్షణ తీసుకుంది. ఇదే క్రమంలో మోడల్ గానూ అదృష్టం పరీక్షించుకుంది. కొన్ని అడల్డ్ సినిమాల్లో నటించిన ఈ అందాల తార బిగ్ బాస్ హిందీ సీజన్ 5 లోనూ పాల్గొంది. ఆ తర్వాత హిందీ సినిమా పరిశ్రమలో వరుస అవకాశాలు దక్కించుకుంది. ప్రస్తుతం హిందీతో పాటు దక్షిణాది సినిమాల్లో హీరోయిన్ గా రాణిస్తూనే స్పెషల్ సాంగ్స లోనూ మెరుస్తోంది. ఇంతకీ ఆమె ఎవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా?

కెనడాలో జన్మించిన సన్నీ లియోన్ అసలు పేరు కరణ్ జిత్ కౌర్ వోహ్రా. కొన్నేళ్ల పాటు అమెరికాలో కూడా నివసించిందీ అందాల తార. ఈ నటికి కెనడాతో పాటు అమెరికన్ పౌరసత్వం కూడా ఉంది. 2011 లో వివాహం చేసుకున్న తర్వాత 2012 లో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది సన్నీ లియోన్. ‘జిస్మ్ 2’ చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘రాగిణి ఎంఎంఎస్ 2’, ‘ఏక్ పహేలి లీలా’, ‘మస్తిజాదే’ వంటి హిట్ చిత్రాల్లో నటించింది. ‘లైలా మైన్ లైలా’, ‘బేబీ డాల్’ ‘పింక్ లిప్స్’ వంటి స్పెషల్ సాంగ్స్ తో నేషనల్ వైడ్ క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక కరెంట్ తీగ, జిన్నా వంటి తెలుగు సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషించింది.

ఇవి కూడా చదవండి

సన్నీ లియోన్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

View this post on Instagram

A post shared by Karan Kundrra (@kkundrra)

సన్నీ ఇప్పుడు వ్యాపారవేత్తగా కూడా బాగా ఫేమస్ . 2018లో ఆమె కాస్మెటిక్ బ్రాండ్ స్టార్ స్ట్రక్‌ను ప్రారంభించింది. 2021లో పెటా ఆమోదించిన వీగన్ అథ్లెటిక్ బ్రాండ్‌లో కూడా ఇన్వెస్టెమెంట్స్ పెట్టింది. సన్నీ లియోన్ ఇప్పుడు కోట్ల ఆస్తులకు మహారాణి. సెలబ్రిటీ నెట్ వర్త్ నివేదిక ప్రకారం, ఆమె మొత్తం ఆస్తులు దాదాపు రూ.115 కోట్లు. ఆమెకు ముంబైతో పాటు అమెరికాలో కూడా విలాసవంతమైన బంగ్లాలు ఉన్నాయి. అలాగే మసెరటి గిబ్లి నెరిస్సిమో, మసెరటి క్వాట్రోపోర్టే, BMW 7 సిరీస్ ఆడి A5 లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఒకప్పుడు రోడ్లపై నిమ్మరసం అమ్మింది.. ఇప్పుడు టాప్ మోస్ట్ హీరోయిన్
ఒకప్పుడు రోడ్లపై నిమ్మరసం అమ్మింది.. ఇప్పుడు టాప్ మోస్ట్ హీరోయిన్
చలిగా ఉందని కాళ్ల నుంచి తల వరకు మొత్తం దుప్పటితో కప్పేస్తున్నారా?
చలిగా ఉందని కాళ్ల నుంచి తల వరకు మొత్తం దుప్పటితో కప్పేస్తున్నారా?
మీకు ఆదాయపు పన్ను నుండి ఇలాంటి సందేశాలు వస్తున్నాయా? జాగ్రత్త!
మీకు ఆదాయపు పన్ను నుండి ఇలాంటి సందేశాలు వస్తున్నాయా? జాగ్రత్త!
ధనుష్కోడి మహా విషాదానికి 59 ఏళ్లు.. ఆ రైలు ఏమైంది?
ధనుష్కోడి మహా విషాదానికి 59 ఏళ్లు.. ఆ రైలు ఏమైంది?
సులువుగా బరువు తగ్గాలా? ఐతే ఉదయాన్నే ఈ 4 పనులు చేయండి..
సులువుగా బరువు తగ్గాలా? ఐతే ఉదయాన్నే ఈ 4 పనులు చేయండి..
విజయ్ హజారేలో కోహ్లీ, రోహిత్ పారితోషికం ఎంతో తెలుసా?
విజయ్ హజారేలో కోహ్లీ, రోహిత్ పారితోషికం ఎంతో తెలుసా?
మార్కెట్లో సంచలన సృష్టించనున్న మరో రియల్‌మీ ఫోన్‌.. 200MP కెమెరా!
మార్కెట్లో సంచలన సృష్టించనున్న మరో రియల్‌మీ ఫోన్‌.. 200MP కెమెరా!
భారత ఆటగాళ్లపై ఐసీసీకి ఫిర్యాదు చేయనున్న పాకిస్తాన్
భారత ఆటగాళ్లపై ఐసీసీకి ఫిర్యాదు చేయనున్న పాకిస్తాన్
గూగుల్ పే నుంచి మొదటి క్రెడిట్ కార్డు.. యుపిఐ ద్వారా చెల్లింపులు
గూగుల్ పే నుంచి మొదటి క్రెడిట్ కార్డు.. యుపిఐ ద్వారా చెల్లింపులు
వేణుస్వామి పూజల ఫలితంగానే మెడల్స్ వచ్చాయా? ప్రగతి రియాక్షన్ ఇదే
వేణుస్వామి పూజల ఫలితంగానే మెడల్స్ వచ్చాయా? ప్రగతి రియాక్షన్ ఇదే