Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uppena Movie: ఉప్పెన సినిమాను ఆ స్టార్ హీరోతో చేయాలనుకున్నారా..? ఎలా మిస్సైందంటే..

ఉప్పెన.. టాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమాకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఈ చిత్రంలోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి. కానీ మీకు తెలుసా.. ? ఈ చిత్రాన్ని ముందుగా ఓ స్టార్ హీరోతో చేయాలనుకున్నారట. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా..?

Uppena Movie: ఉప్పెన సినిమాను ఆ స్టార్ హీరోతో చేయాలనుకున్నారా..? ఎలా మిస్సైందంటే..
Uppena Movie
Rajitha Chanti
|

Updated on: Jun 17, 2025 | 3:38 PM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన భారీ విజయాన్ని అందుకున్న సినిమాల్లో ఉప్పెన ఒకటి. ఈ చిత్రంతోనే దర్శకుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టారు బుచ్చిబాబు సన. మొదటి సినిమాతోనే అద్భుతమైన స్క్రీన్ ప్లేతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. కట్ చేస్తే.. రెండవ సినిమా ఏకంగా పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ తో తెరకెక్కించే ఛాన్స్ కొట్టేశారు. ఇక ఈ సినిమాతోనే హీరోగా వైష్ణవ్ తేజ్.. కథానాయికగా కృతిశెట్టి వెండితెరకు పరిచయమయ్యారు. తొలి చిత్రంతోనే వీరిద్దుర సహజ నటనతో కట్టిపడేశారు. అంతేకాదు వీరిద్దరి కెమిస్ట్రీ, యాక్టింగ్ కు అడియన్స్ ఫిదా అయ్యారు. ఇండస్ట్రీలోనే హిట్ జోడిగా స్పెషల్ క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ మరో హైలెట్. ఇప్పటికీ ఈ మూవీలోని సాంగ్స్ యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. అయితే ఈ హిట్ మూవీకి ముందుగా అనుకున్న హీరో వైష్ణవ్ తేజ్ కాదట.

ఉప్పెన సినిమా కథను డైరెక్టర్ బుచ్చిబాబు సన సిద్ధం చేసుకుని హీరో కోసం ప్రయత్నాలు స్టార్ట్ చేశారట. ఈ క్రమంలోనే ముందుగా ఈ కథకు విజయ్ దేవరకొండ అయితే బాగుంటుందని అనుకున్నారట. కానీ అప్పటికే అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ రేంజ్ పెరిగిపోయిందని.. అలాంటి పరిస్థితుల్లో విజయ్ ను ఈ ప్రేమకథలో నటించాలని కోరడం సరైంది కాదని అనుకున్నారట డైరెక్టర్ బుచ్చిబాబు. లుక్స్ పరంగా విజయ్ లాంటి కుర్రాడే కావాలని.. అర్జున్ రెడ్డిలో విజయ్ లా కథను భుజాలపై వేసుకుని నడిపించగలిగే కొత్త నటుడు కావాలనుకున్నారట.

ఇక ఆ తర్వాత మరో కొత్త హీరో కోసం వెతకడం స్టార్ట్ చేశారట. ఆ సమయంలోనే సోషల్ మీడియాలో వైష్ణవ్ ఫోటో చూసి ఉప్పెన చిత్రానికి హీరో అని ఫిక్స్ అయిపోయారట. అలా ఉప్పెన సినిమాకు వైష్ణవ్ తేజ్ ఎంపికయ్యారు.ఈ సినిమాతో హీరోగా తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యారు వైష్ణన్. ఆ తర్వాత ఆయన నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ పెద్ది అనే సినిమాలో నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :  

వయసు 41.. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు.. క్రేజ్ చూస్తే దిమాక్ కరాబ్..

సీరియల్లో పద్దతిగా.. వెకేషన్‏లో గ్లామర్‏గా.. రుద్రాణి అత్త అరాచకమే..

త్రిష అందానికి రహస్యం ఇదేనట.. ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట..

Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..

హ్యాట్సాఫ్‌! ట్రయథ్లాన్‌లో చరిత్ర సృష్టించిన.. టాలీవుడ్ హీరోయిన్.
హ్యాట్సాఫ్‌! ట్రయథ్లాన్‌లో చరిత్ర సృష్టించిన.. టాలీవుడ్ హీరోయిన్.
నయన్‌పై ధనుష్‌తో పాటు మరో నిర్మాత సీరియస్.. 5 కోట్లకు నోటీస్‌
నయన్‌పై ధనుష్‌తో పాటు మరో నిర్మాత సీరియస్.. 5 కోట్లకు నోటీస్‌
తన సినిమా ప్రివ్యూ చూస్తూ.. కుప్పకూలిన టాలీవుడ్ డైరెక్టర్
తన సినిమా ప్రివ్యూ చూస్తూ.. కుప్పకూలిన టాలీవుడ్ డైరెక్టర్
3 ఏళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఫ్రీ ఫైర్ గేమింగ్‌.. ఎప్పటి నుంచి అంటే
3 ఏళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఫ్రీ ఫైర్ గేమింగ్‌.. ఎప్పటి నుంచి అంటే
ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. చిక్కుల్లో 29 మంది తారలు..
ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. చిక్కుల్లో 29 మంది తారలు..
చిన్న తప్పుతో.. EDకి అడ్డంగా దొరికిన టాలీవుడ్ స్టార్స్
చిన్న తప్పుతో.. EDకి అడ్డంగా దొరికిన టాలీవుడ్ స్టార్స్
సినిమాల్లో నటించాలనుకునే వారికి సూపర్ డూపర్ ఛాన్స్..
సినిమాల్లో నటించాలనుకునే వారికి సూపర్ డూపర్ ఛాన్స్..
ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి
ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి
నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా
నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా
ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో
ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో