Samantha: అయ్యో.. సమంతకు ఏమైంది.. చేతులకు గాయాలు.. రక్తంతో షాకింగ్ పోస్ట్..
మోటివేషనల్ కోట్స్ మాత్రమే కాకుండా.. సినిమా అప్టేట్స్ షేర్ చేస్తుంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతుంది. సామ్ పోస్ట్ చేసిన పిక్ చూసి షాకవుతున్నారు అభిమానులు. ఇంతకీ సమంత ఏం ఫోటో షేర్ చేసిందో తెలుసుకుందామా.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడిప్పుడే మయోసైటిస్ సమస్య నుంచి కోలుకుంటుంది. కొద్ది రోజులుగా ఆమె సిటాడెల్ చిత్రీకరణలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ కీలకపాత్రలో నటిస్తుండగా.. ఫ్యామిలీ మ్యాన్ 2 సీరిస్ మేకర్స్ రాజ్ అండ్ డీకే నిర్మిస్తున్నారు. ఈ సిరీస్ లో సామ్ పాత్రలో పూర్తిగా యాక్షన్ లో ఉంటుంది.. ఇందుకోసం ఆమె ప్రత్యేక శిక్షణ సెషన్స్ కూడా తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఓవైపు చిత్రీకరణలో పాల్గొంటూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది సామ్. మోటివేషనల్ కోట్స్ మాత్రమే కాకుండా.. సినిమా అప్టేట్స్ షేర్ చేస్తుంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతుంది. సామ్ పోస్ట్ చేసిన పిక్ చూసి షాకవుతున్నారు అభిమానులు. ఇంతకీ సమంత ఏం ఫోటో షేర్ చేసిందో తెలుసుకుందామా.
సిటాడెల్ చిత్రీకరణలో సామ్ గాయపడినట్లుగా తెలుస్తోంది. చేతులకు స్వల్ప గాయాలు.. రక్తపు మరకలు కనిపిస్తున్నారు. సిటాడెల్ సిరీస్ లో కొన్ని హై ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారని.. ఇందుకోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ దగ్గర సామ్ మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. సామ్ షేర్ చేసిన లేటేస్ట్ ఫోటో చూసి షాకవుతున్నారు అభిమానులు. సమంతకు ఏమైంది అనే సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల సామ్ తన యాక్షన్ డైరెక్టర్ యాన్నిక్ బెన్ తో యాక్షన్ సన్నివేశాలను ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను పంచుకున్నారు. ఎనిమిది డిగ్రీల సెల్సియస్ లో నైనిటాల్ లో యాక్షన్ షూట్ కోసం సిద్ధమవుతున్న సమయంలో సామ్ ప్రాక్టిస్ వీడియోను షేర్ చేసింది. అలాగే సామ్ గుర్రపు స్వారీకి సంబంధించిన ఫోటోలను కూడా పంచుకుంటున్నారు.