Laya: లయ కూతురు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతుందా ?.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే తన కూతురు ఇండస్ట్రీ ఎంట్రీ గురించి కూడా క్లారిటీ ఇచ్చారు లయ.

Laya: లయ కూతురు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతుందా ?.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..
Laya
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 28, 2023 | 8:21 AM

తెలుగు చిత్రపరిశ్రమలో అందం, అభినయంతో మెప్పించిన హీరోయిన్లలో లయ ఒకరు. స్వయంవరం సినిమాతో తెలుగు తెరకు పరిచమయైన లయ.. తొలి చిత్రంతోనే నంది అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత వరుసగా సూపర్ హిట్స్ అందుకుంటూ టాప్ హీరోయిన్‏గా కొనసాగిన లయ.. దాదాపు 13 ఏళ్లపాటు సినీ పరిశ్రమలో రాణించింది. కానీ పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది లయ. ఇటీవల కొంత కాలంగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది. రీల్స్, డాన్స్, వ్యక్తిగత ఫ్యామిలీ ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులతో ముచ్చటిస్తుంటుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే తన కూతురు ఇండస్ట్రీ ఎంట్రీ గురించి కూడా క్లారిటీ ఇచ్చారు లయ.

తన భర్త శ్రీ గణేశ్ గోర్తి అమెరికాలో ఫేమస్ డాక్టర్ అని.. తమది ఆరెంజ్డ్ మ్యారేజ్ అన్నారు లయ. తాను సినిమాల్లో నటించవద్దని తన భర్త ఎలాంటి ఆంక్షలు పెట్టలేదని అన్నారు. “అమెరికాలో నేను ఐటీలో వర్క్ చేశాను. కానీ 2017 నుంచి బ్రేక్ తీసుకున్నాను. చిన్న చిన్న విషయాలు జీవితంలో సంతోషాన్నిస్తాయి. డ్రాయింగ్ వేసినప్పుడు సంతోషంగా అనిపిస్తుంది. నాకు ఇద్దరు పిల్లలు. అమ్మాయి ప్రస్తుతం 9వ తరగతి చదువుతుంది. మేమిద్దరం కనిపిస్తే మీ సిస్టరా అని అడుగుతారు. బాబుకు 12 ఏళ్లు. నా కూతురు ఒక సినిమాలో చేస్తే బాగుంటుందనిపిస్తుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలో నటించింది.

ఇవి కూడా చదవండి

కానీ నేనెప్పుడూ ఎవరినీ అడగలేదు. నేనైతే ఇండస్ట్రీలోకి వెళ్లమని బలవంతం చేయను. నా పిల్లలిద్దరూ తెలుగు కూడా బాగా మాట్లాడతారు. ఇంగ్లీషులోకి వచ్చాక తెలుగు మర్చిపోయారు అని అన్నారు. 2005లో లాస్ ఎంజిల్స్ వెళ్లినప్పుడు మా మదర్ వాళ్ల కజిన్ పెళ్లి విషయం మాట్లాడారు. ఇండియాకు వచ్చిన నాలుగు నెలల తర్వాత మళ్లీ ఫోన్ చేశారు. అప్పుడే ఫోన్ నంబర్స్ తీసుకుని మాట్లాడుకున్నాం. అలా మా పెళ్లి కుదిరింది ” అంటూ చెప్పుకొచ్చింది లయ.

View this post on Instagram

A post shared by Laya Gorty (@layagorty)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.