Rakul Preeth Singh: ఓ చిన్న విషయాన్ని ఇంత పెద్దదిగా చేస్తున్నారు.. రకుల్ ప్రీత్ సింగ్ అసహనం..

సినిమా బాగుంటే థియేటర్లో ఓటీటీలో కూడా చూస్తారని తెలిపింది. ప్రేక్షకుల ఎమోషన్స్ మీదే సినిమాల ఫలితం ఆధారపడి ఉంటుందని చెప్పుకొచ్చింది.

Rakul Preeth Singh: ఓ చిన్న విషయాన్ని ఇంత పెద్దదిగా చేస్తున్నారు.. రకుల్ ప్రీత్ సింగ్ అసహనం..
Rakul Preeth Singh
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 28, 2023 | 8:04 AM

గత కొద్ది రోజులుగా తెలుగు చిత్రపరిశ్రమకు దూరంగా ఉంటుంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఇటీవలి కాలంలో ఈ ముద్దుగుమ్మ పూర్తిగా హిందీలో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంది. గతేడాదిలోనే ఏకంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఐదు సినిమాలు చేసింది. ఇప్పుడు కూడా ఆమెకు అక్కడ ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. మరోవైపు కరోనా తర్వాత బాలీవుడ్ టూ టాలీవుడ్ పెద్ద పోటీని ఇస్తోంది. దక్షిణాది చిత్రాలు పాన్ ఇండియా లెవల్లో సత్తా చాటుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబడుతుండగా.. హిందీ చిత్రాలు మాత్రం డిజాస్టర్స్ అవుతున్నాయి. అటు ఓటీటీలోనూ తెలుగు సినిమాల హవా నడుస్తోంది. అయితే ఇదే అంశం పై ఇప్పటికే పలువురు స్టార్ నటీనటులు ఆసక్తికర కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంపై హీరోయిన్ రకుల్ షాకింగ్ కామెంట్స్ చేసింది.

రకుల్ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో ప్రతి చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నారని విమర్శించింది. హిందీ సినిమాలు, ప్రాంతీయ సినిమాలు రెండూ ఒక్కటేనని.. వాటిని ఒకదానితో మరొకదాన్ని పోల్చడం సరికాదని వ్యాఖ్యనించింది. అన్నింటికన్నా ప్రేక్షకులే ముఖ్యమని.. మంచి సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారని తెలిపింది. మన దేశంలో గొప్ప ఆలోచనలు ఉన్న దర్శకులు చాలా మంది ఉన్నారని.. వారు మన దేశ సినీ పరిశ్రమకు మంచి పేరు తెచ్చే సినిమాలను రూపొందించగలరని చెప్పారు. ప్రస్తుతం కంటెంట్ ప్రాధాన్యత చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారని. అలాగే ఓటీటీలకు కూడా ఆదరణ బాగా పెరిగిందని చెప్పారు. సినిమా బాగుంటే థియేటర్లో ఓటీటీలో కూడా చూస్తారని తెలిపింది. ప్రేక్షకుల ఎమోషన్స్ మీదే సినిమాల ఫలితం ఆధారపడి ఉంటుందని చెప్పుకొచ్చింది.

మన దేశంలో గొప్ప ఆలోచనలు ఉన్న దర్శకులు చాలా మంది ఉన్నారని.. వారు మన దేశ సినీ పరిశ్రమకు మంచి పేరు తెచ్చే సినిమలాను రూపొందించగలరని అన్నారు రకుల్. ఇక కొంతకాలంగా బాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ అండ్ హీరో జాకీ భగ్నానీతో రకుల్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.