Samantha: చాలా కాలం తర్వాత సింగర్ చిన్మయి గురించి ట్వీట్ చేసిన సమంత.. గాయని రియాక్షన్ ఏంటంటే..
ఇప్పుడిప్పుడే మయోసైటిస్ నుంచి కోలుకుంటున్న సామ్.. తిరిగి తన తదుపరి చిత్రాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ అయ్యారు. తాజాగా ఆమె వరుణ్ ధావన్ కథానాయకుడిగా.. ఫ్యామిలీ మెన్ 2 సిరీస్ డైరెక్టర్స్ రూపొందిస్తోన్న సిరీస్ సిటాడెల్.
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ సమంత.. సింగర్ చిన్మయి బెస్ట్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. మొదటి సినిమా నుంచి సామ్ కు డబ్బింగ్ చెప్పింది చిన్మయి. అయితే కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య విభేధాలు వచ్చాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తుంది. దీనిపై ఇప్పటికే సింగర్ చిన్మయి స్పందిస్తూ.. తమ మధ్య ఎలాంటి మనస్పర్ధలు రాలేదని క్లారిటీ కూడా ఇచ్చారు. కానీ సామ్ నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు. తాజాగా చాలా కాలం తర్వాత చిన్మయి గురించి ట్వీట్ చేశారు సామ్. వీరిద్దరి మధ్య నడిచిన ట్విట్టర్ ముచ్చట ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతుంది. ఇంతకీ సామ్ ఏమని ట్వీట్ చేశారో తెలుసుకుందాం. ఇప్పుడిప్పుడే మయోసైటిస్ నుంచి కోలుకుంటున్న సామ్.. తిరిగి తన తదుపరి చిత్రాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ అయ్యారు. తాజాగా ఆమె వరుణ్ ధావన్ కథానాయకుడిగా.. ఫ్యామిలీ మెన్ 2 సిరీస్ డైరెక్టర్స్ రూపొందిస్తోన్న సిరీస్ సిటాడెల్. ఈ సిరీస్ షూటింగ్లో బుధవారం సమంత జాయిన్ అయ్యింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ హాలీవుడ్ దర్శక ద్వయం రస్సో బ్రదర్స్ ఓ ట్వీట్ చేశారు.
సిటాడెల్ సిరీస్ లోకి సామ్ కు స్వాగతం పలుకుతూ రస్సో బ్రదర్స్ చేసిన ట్వీట్ కు చిన్మయి భర్త రాహుల్ స్పందిస్తూ.. “సామ్ ప్రయాణం ఎలా మొదలైందో నాకింకా గుర్తుంది. హాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్స్ రస్సో బ్రదర్స్.. సమంతను తమ ప్రాజెక్ట్ లోకి ఆహ్వానించడం చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది” అని పేర్కొన్నారు. దీనిపై చిన్మయి స్పందిస్తూ.. సమంత ఓ క్వీన్.. ఇదే నిదర్శనం అంటూ ప్రశంసించారు. ఇక వీరిద్దరి ట్వీట్స్ పై స్పందించింది సామ్. “నేను కాదు నువ్వే చిన్మయి .. అలాగే రాహుల్ లాంటి మంచి స్నేహితుడు నాకు దొరకడం నిజంగా నా అదృష్టం” అంటూ బదులిచ్చారు. ప్రస్తుతం వీరి ముగ్గురి ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయంటూ వస్తున్న వార్తలకు చెక్ పడింది.
ప్రస్తుతం సామ్.. సిటాడెల్ సిరీస్ చిత్రీకరణలో పాల్గొంటుంది. ఇక త్వరలోనే ఆమె.. డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కిస్తోన్న ఖుషి చిత్రంలోనూ పాల్గొననుంది. ఇందులో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా సగం చిత్రీకరణ పూర్తిచేసుకుంది.
No you are @Chinmayi ? https://t.co/McAvAnedr9
— Samantha (@Samanthaprabhu2) February 1, 2023
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.