Sai Pallavi: ఆ కారణంతోనే పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం.. సాయి పల్లవి కామెంట్స్ వైరల్..

డైరెక్టర్ వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా జూన్ 17న విడుదల కానుంది. 1990లో జరిగిన యాదార్థ సంఘటనల ఆధారంగా రాబోతున్న ఈ మూవీపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి.

Sai Pallavi: ఆ కారణంతోనే పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం..  సాయి పల్లవి కామెంట్స్ వైరల్..
Sai Pallavi Pawan Kalyan
Follow us
Rajitha Chanti

| Edited By: Ravi Kiran

Updated on: Jun 15, 2022 | 9:11 PM

మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi).. గ్లామర్ పాత్రలకు ఆమడ దూరంలో ఉంటూ సహజమైన నటనతో ఆడియన్స్‏కు దగ్గరయ్యింది ఈ బ్యూటీ. శ్యామ్ సింగరాయ్ సినిమాతో ఇటీవల ప్రేక్షకులను అలరించిన సాయి పల్లవి.. ఇప్పుడు విరాట పర్వం సినిమాతో థియేటర్లలో సందడి చేయనుంది. డైరెక్టర్ వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా జూన్ 17న విడుదల కానుంది. 1990లో జరిగిన యాదార్థ సంఘటనల ఆధారంగా రాబోతున్న ఈ మూవీపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే షూరు అయిన ఈ మూవీ ప్రమోషన్స జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల ఓ ఛానల్‏ గేమ్ షోలో పాల్గోన్న సాయి పల్లవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తన మనసులోని మమాటలను బయటపెట్టింది..

పవన్ కళ్యాణ్ ప్రస్తావన రాగానే సాయి పల్లవి మాట్లాడుతూ.. “పవన్ కళ్యాణ్ గారికి అంత క్రేజ్ ఉన్నప్పటికీ.. స్టార్ అయినప్పటికీ సాధారణ వ్యక్తిలాగా కనిపిస్తారని.. తన మనసులోని మాటలను ముక్కుసూటిగా చెప్పేస్తారని.. అందుకే ఆయనంటే నాకు చాలా ఇష్టం” అంటూ చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. నక్సలిజం నేపథ్యంలో రాబోతున్న విరాట పర్వం సినిమాలో నక్సలైట్ రవి శంకర్ అలియాస్ రవన్న పాత్రలో నటించగా… వెన్నెల పాత్రలో సాయి పల్లవి కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి