Sai Pallavi: ఆ లోకం కొత్తగా అనిపించింది.. కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్లుగా ఉంది.. సాయి పల్లవి ఆసక్తికర కామెంట్స్..

వెన్నెల పాత్రకు ప్రేరణ అయినటువంటి సరళ గారి కుటుంబాన్ని కలవడం చాలా ఎమోషనల్ మూమెంట్. చాలా ఆప్యాయంగా మాట్లాడారు. అమ్మ నన్ను దీవించి చీర కానుకగా ఇచ్చారు.

Sai Pallavi: ఆ లోకం కొత్తగా అనిపించింది.. కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్లుగా ఉంది.. సాయి పల్లవి ఆసక్తికర కామెంట్స్..
Sai Pallavi
Follow us
Rajitha Chanti

| Edited By: Ravi Kiran

Updated on: Jun 15, 2022 | 9:11 PM

డైరెక్టర్ వేణు ఉడుగుల తెరకెక్కించిన లేటేస్ట్ చిత్రం విరాట పర్వం(Virata Parvam). న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi), రానా దగ్గుబాటి జంటగా నటించిన ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ మూవీ కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా మరో రెండు రోజుల్లో అంటే జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ప్రమోషన్లలో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఇటీవల కర్నూల్‏లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. వరంగల్ లో ఆత్మీయ వేడుక నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక ఈరోజు హైదరాబాద్ లో విరాట పర్వం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, వెంకటేష్, సుకుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు హీరోయిన్ సాయి పల్లవి..

సాయి పల్లవి మాట్లాడుతూ.. ” వెన్నెల పాత్రకు ప్రేరణ అయినటువంటి సరళ గారి కుటుంబాన్ని కలవడం చాలా ఎమోషనల్ మూమెంట్. చాలా ఆప్యాయంగా మాట్లాడారు. అమ్మ నన్ను దీవించి చీర కానుకగా ఇచ్చారు. నిజంగా ఆ సమయంలో జరిగిన విషయాలన్నీ మనకు తెలీవు. దిన్ని ఒక కథలానే అప్రోచ్ అయ్యాను. వెన్నెల పాత్రగానే చేశాను. డైరెక్టర్ వేణు ఊడుగుల కథ చెప్పినపుడు అ లోకం కొత్తగా అనిపించింది. నాటి పరిస్థితులు గురించి తెలుసుకుంటున్నపుడు ఒక కొత్త ప్రపంచంలోకి వెళుతున్న భావన కలిగింది. ఇప్పుడు అందరికీ స్వేఛ్చ వుంది. ఇప్పుడు ఒక కార్ బ్యాక్ ఫైర్ కావడం సామాన్యమైన విషయంగా చూస్తున్నా ము. కానీ అప్పుడు ఒక శబ్దం వచ్చినా ఏదైనా పేలుడు జరిగిందా అనే కంగారులో చూసేవారు. నాటి పరిస్థితులు, సమయం గురించి దర్శకుడు వేణు గారు చాలా విషయాలు నేర్పారు. తెలియకుండా వున్న కథ చేయడంలో మజా వుంటుంది. తెలిసిన కథ మళ్ళీమళ్ళీ చేస్తే ఎప్పుడు నేను ఉండేలానే వుంటాను. ఒక కొత్త ప్రపంచంలోకి వెళితే నటిగా కూడా మెరుగౌతాను. నన్ను నేను సవాల్ చేసుకున్నట్లు ఉంటుందని విరాట పర్వం చేశాను.

వెన్నెల పాత్రలో రానెస్ వుంది. ఇసకతో బొమ్మ తయారు చేసుకోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, ఆయుధంగా కూడా మలుచుకోవచ్చు. వెన్నెల పాత్ర కూడా అలానే అనిపించింది. వెన్నెల ఒక తెల్లకాగితం. దానిపై ఏది రాస్తే అదే ఆమె అవుతుంది. దర్శకుడు ఆ పాత్రని చాలా నిజాయితీగా రాశారు. దర్శకుడు వేణు గారు మొదట నిర్మాతలు సుధాకర్ గారు, శ్రీకాంత్ గారితో తర్వాత నాతో మాట్లాడారు. ఈ స్క్రిప్ట్ సురేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత రానా గారు రవన్న పాత్ర చేస్తారని తెలిసింది.చాలా ఆనందంగా అనిపించింది. రానా గారి స్టార్ డమ్, స్థాయి, ఆయనకి వున్న వాయిస్ కి రవన్న పాత్ర ఆయనకి గొప్పగా నప్పుతుందనిపించింది. రానా గారు వచ్చిన తర్వాత విరాట పర్వం స్కేల్ మారిపోయింది. రానా గారు ఈ ప్రాజెక్ట్ చేయడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది” అంటూ చెప్పుకొచ్చారు..

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందంటే?
పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందంటే?
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!