AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: యూరప్ వెకేషన్‏లో సూపర్ స్టార్.. సితార షేర్ చేసిన వీడియోకు నెటిజన్స్ అట్రాక్ట్..

ప్రస్తుతం సూపర్ స్టార్ తన కుటుంబంతో కలిసి యూరప్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్యామిలీతో కలిసి గడుపుతున్న ఆనంద క్షణాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా

Mahesh Babu: యూరప్ వెకేషన్‏లో సూపర్ స్టార్.. సితార షేర్ చేసిన వీడియోకు నెటిజన్స్ అట్రాక్ట్..
Mahesh Babu
Rajitha Chanti
| Edited By: |

Updated on: Jun 15, 2022 | 9:11 PM

Share

సర్కారు వారి పాట సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‏గా నిలిచింది. ఇందులో మహేష్ సరసన కీర్తి సురేష్ నటించగా.. సముద్రఖని, వెన్నెల కిశోర్, సుబ్బరాజు, నదియా కీలకపాత్రలలో నటించారు. తెలుగు రాష్ట్రాల్లో సర్కారు వారి పాట భారీగా వసూళ్లు సాధించింది. ఈ మూవీ తర్వాత మహేష్… డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. జూన్ చివరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ప్రస్తుతం సూపర్ స్టార్ తన కుటుంబంతో కలిసి యూరప్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్యామిలీతో కలిసి గడుపుతున్న ఆనంద క్షణాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు మహేష్ (Mahesh babu )..

తాజాగా మహేష్ గారాలపట్టి సితార పోస్ట్ చేసిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియో చూసిన మహేష్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు… అందులో మహేష్, సితార ఇద్దరూ ఎంతో ప్రశాంతంగా ఉన్న రోడ్డుపై నడుస్తూ.. ముచ్చటిస్తూ వస్తున్నారు. కూతురుతో కలిసి మహేష్ తన విలువైన సమయాన్ని గడుపుతున్నట్లుగా తెలుస్తోంది. వీరిద్దరి వాకింగ్‏కు సంబంధించిన సితార తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ.. సమ్మర్ వాక్స్ విత్ నాన్న.. ఎప్పటికీ నాకు ఇష్టమైనది అంటూ క్యాప్షన్ ఇచ్చంది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో