Sreeleela: శ్రీలీల క్రేజ్ అస్సలు తగ్గట్లేదుగా.. యంగ్ హీరో సరసన పెళ్లి సందD బ్యూటీ..

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందD సినిమాతో వెండితెరకు హీరోయిన్ గా పరిచయమైంది శ్రీలీల (Sreeleela). అందం, అభినయంతో ఫస్ట్ మూవీతోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది.

Sreeleela: శ్రీలీల క్రేజ్ అస్సలు తగ్గట్లేదుగా.. యంగ్ హీరో సరసన పెళ్లి సందD బ్యూటీ..
Sreeleela
Follow us
Rajitha Chanti

| Edited By: Ravi Kiran

Updated on: Jun 15, 2022 | 9:12 PM

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో యువతరం కథానాయికగా హంగామా కొనసాగుతుంది. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను మెప్పించి… వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతున్నారు యంగ్ హీరోయిన్స్… ఇప్పటికే ఉప్పెన సినిమాతో ప్రేక్షకుల మదిని దొచుకుంది కృతి శెట్టి. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ షెడ్యూల్ గడిపేస్తుంది. అదే కోవలో.. వరుస ఆఫర్లు అందుకుంటుంది యువ కథానాయిక కృతిశెట్టి. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందD సినిమాతో వెండితెరకు హీరోయిన్ గా పరిచయమైంది శ్రీలీల (Sreeleela). అందం, అభినయంతో ఫస్ట్ మూవీతోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. ప్రస్తుతం రవితేజ సరసన ధమాకా సినిమాలో నటిస్తోంది.

తాజగా మరో ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది శ్రీలీల. జాతి రత్నాలు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి. ప్రస్తుతం ఈ యంగ్ హీరో అనగనగా ఒక రాజు సినిమా చేస్తున్నాడు. ఇందులో నవీన్ సరసన శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. మంగళవారం శ్రీలీల పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తుండగా.. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఇవి కూడా చదవండి

ట్వీట్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.