Chor Bazar: విడుదలకు సిద్ధమైన ఆకాష్ పూరి సినిమా.. చోర్ బజార్ రిలీజ్ ఎప్పుడంటే ?..
మోహబుబా, రొమాంటిక్ సినిమాలతో అలరించిన ఈ యంగ్ హీరో ఇప్పుడు చోర్ బజార్ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం చోర్ బజార్ (Chor Bazar). మోహబుబా, రొమాంటిక్ సినిమాలతో అలరించిన ఈ యంగ్ హీరో ఇప్పుడు చోర్ బజార్ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రానికి డైరెక్టర్ జీవన్ రెడ్డి దర్శకత్వం వహించగా.. ఐ.వి ప్రొడక్షన్స్ పతాకంపై వీ.ఎస్ రాజు నిర్మించిన విడుదలకు సిద్ధమైంది.. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా ఈనెల 24న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ షూరు చేసింది చిత్రయూనిట్. మంగళవారం హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్ మీట్ ఆకాష్ పూరితోపాటు డైరెక్టర్ జీవన్ రెడ్డి.. చిత్రయూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆకాష్ పూరి మాట్లాడుతూ… ట్రైలర్, సాంగ్స్ కు వచ్చిన రెస్పాన్స్ కు ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పారు..
అలాగే డైరెక్టర్ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. మా స్నేహితుడు వీఎస్ రాజు నా సినిమాకు నిర్మాత కావడం సంతోషంగా ఉంది. ఒక కలర్ పుల్ సినిమా చేద్దామని ఆయన అనేవారు. అన్నట్లుగానే మంచి కమర్షియల్, కలర్ ఫుల్ సినిమా చేశాం. నాతో పాటు నా టెక్నికల్ టీమ్ వందశాతం ఎఫర్ట్ పెట్టి పనిచేశారు. ఈ సినిమా బాగుందంటే ఆ క్రెడిట్ నా టీమ్ కు ఇస్తాను. ఒక యువ హీరో ఈ కథకు కావాలి అనుకున్నప్పుడు ఆకాష్ నా మనసులో మెదిలారు. ఆయన బచ్చన్ సాబ్ అనే ఈ క్యారెక్టర్ లో పర్పెక్ట్ గా నటించారు అని అన్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.