Rashmika Mandanna: దుబాయ్లో చీరకట్టుతో రష్మిక మెరుపులు.. శారీ ధర ఎన్ని లక్షలంటే..
ప్రస్తుతం ఈ బ్యూటీకి ఇన్ స్టాలో 39.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇక ముద్దుగుమ్మ షేర్ చేసే ప్రతి చిన్న పోస్ట్ క్షణాల్లో వైరలవుతుంటుంది. ఇటీవల పుష్ప మూవీలోని పుష్పరాజ్ సెట్ పిక్ షేర్ చేసుకుంది రష్మిక. అలాగే రెండు రోజుల క్రితం దుబాయ్ ఈవెంట్ కు సంబంధించిన అందమైన ఫోటోస్ పంచుకుంది. మీరంతా కలిసి నాకు చీరలపై మరింత ఇష్టాన్ని పెంచేశారు.. అంటూ దుబాయ్ లో ఓ ఈవెంట్ కోసం చీరలో మరింత అందంగా ముస్తాబైన ఫోటోస్ పంచుకుంది.

పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటుందో తెలిసిన విషయమే. సినిమా అప్డేట్స్, ఫ్యామిలీ విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటుంది ఈ బ్యూటీ. ఇక రోజంతా తన అన్ని కార్యకలాపాలను అభిమానులను అప్‌డేట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీకి ఇన్ స్టాలో 39.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇక ముద్దుగుమ్మ షేర్ చేసే ప్రతి చిన్న పోస్ట్ క్షణాల్లో వైరలవుతుంటుంది. ఇటీవల పుష్ప మూవీలోని పుష్పరాజ్ సెట్ పిక్ షేర్ చేసుకుంది రష్మిక. అలాగే రెండు రోజుల క్రితం దుబాయ్ ఈవెంట్ కు సంబంధించిన అందమైన ఫోటోస్ పంచుకుంది. మీరంతా కలిసి నాకు చీరలపై మరింత ఇష్టాన్ని పెంచేశారు.. అంటూ దుబాయ్ లో ఓ ఈవెంట్ కోసం చీరలో మరింత అందంగా ముస్తాబైన ఫోటోస్ పంచుకుంది. ఆమె ధరించిన చీర ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.
రష్మిక ధరించిన అర్పితా మెహతా డస్ట్ పింక్ చీర ధర రూ. 2.6 లక్షలు. అవును, మీరు చదివింది నిజమే! చీరపై చేసిన ఎంబ్రాయిడరీ పనిని కళాకారులు చేతితో చేశారు. ఇది ఆ చీరకు మరింత అద్భుతమైన రూపాన్ని అందిస్తుంది. ఇక రష్మిక చీర ధర తెలిసి అవాక్కవుతున్నారు నెటిజన్స్. ఈవెంట్ కోసం అన్ని లక్షల చీరను ధరించిందా ?.. అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రష్మిక చేతిలో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆమె తర్వాత పెద్ద తెరపై రణబీర్ కపూర్ సరసన యానిమల్ చిత్రంలో కనిపించనుంది.
View this post on Instagram
అలాగే పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు పుష్ప 2 చిత్రంతో అడియన్స్ ముందుకు రానుంది. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీ కోసం అడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతోపాటు తెలుగులో మరికొన్ని చిత్రాల్లో నటిస్తోంది. అలాగే లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ రష్మిక కనిపించనుంది. ఓవైపు సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక.. అటు నెట్టింట తెగ సందడి చేస్తుంటుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.







