Dhoni-Ramcharan: మిస్టర్ కూల్‌తో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. వైరల్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ముంబై పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. ప్రముఖ సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించిన రామ్‌చరణ్.. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చెర్రీ వినాయక దేవాలయంలో తన అయ్యప్ప దీక్షను పూర్తి చేశారు. దీక్ష విరమణ కోసమే ముంబైకి వెళ్లారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా చరణ్‌ను ఆలయ పూజారులు శాలువాతో సత్కరించారు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ముంబై పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. ప్రముఖ సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించిన రామ్‌చరణ్.. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చెర్రీ వినాయక దేవాలయంలో తన అయ్యప్ప దీక్షను పూర్తి చేశారు. దీక్ష విరమణ కోసమే ముంబైకి వెళ్లారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా చరణ్‌ను ఆలయ పూజారులు శాలువాతో సత్కరించారు. అయితే ఈ ఆలయ సందర్శన అనంతరం రామ్ చరణ్.. టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనిని కలుసుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే వీరిద్దరూ.. ఒక యాడ్ షూట్ కోసం కలుసుకున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు ఈ ఫొటోలలో ధోనీ.. కొత్త లుక్‌లో దర్శనమిచ్చాడు. చాలా స్టైలిష్ లుక్‌తో అట్రాక్ట్ చేస్తున్నాడు. కొత్త తరహా హెయిర్ స్టయిల్‌తో డిఫరెంట్‌గా కనిపించాడు. కెరీర్ ఆరంభంలో టార్జన్ తరహా హెయిర్ స్టయిల్‌తో కిక్ ఇచ్చిన ధోనీ, మళ్లీ ఇప్పుడు దాదాపు అలాంటి హెయిర్ స్టయిల్‌తో దర్శనమిచ్చాడు. యాడ్ షూట్ కోసం ధోనీ తన తల వెంట్రుకల్ని పెంచినట్లు సమాచారం.
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??

