Rashmika Mandanna: ‘జీవితంలో సరైన వ్యక్తుల వల్ల కొన్నిసార్లు ఆగి ఆలోచించాలి’.. రష్మిక మందన్నా ఆసక్తికర పోస్ట్..
తండ్రికొడుకుల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన యానిమల్ దాదాపు రూ.800 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. దీంతో అటు హిందీలో రష్మికకు మరిన్ని ఆఫర్స్ వస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఈ బ్యూటీ ఫుల్ బిజీగా ఉంది. అటు అల్లు అర్జున సరసన పుష్ప 2 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇటీవలే యానిమల్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ నటించగా.. అనిల్ కపూర్, బాబీడియోల్ కీలకపాత్రలు పోషించారు. తండ్రికొడుకుల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన యానిమల్ దాదాపు రూ.800 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. దీంతో అటు హిందీలో రష్మికకు మరిన్ని ఆఫర్స్ వస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఈ బ్యూటీ ఫుల్ బిజీగా ఉంది. అటు అల్లు అర్జున్ సరసన పుష్ప 2 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే తెలుగులో లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తుంది. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి.
ఇటీవలే ది గర్ల్ ఫ్రెండ్ షూటింగ్ సైతం స్టార్ట్ చేసింది రష్మిక. ప్రస్తుతం క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్న రష్మిక.. సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ చేసింది. జీవితంలో కొన్నిసార్లు ఆగి ఆలోచించాలని.. ఇప్పుడు తను చాలా సంతోషంగా ఉన్నానంటూ సుధీర్ఘ పోస్ట్ రాసుకొచ్చింది. ‘జీవితం గురించి కొన్నిసార్లు ఆగి ఆలోచించాలి. అదంతా ఎలా జరిగింది ?.. ఎప్పుడు జరిగింది ?.. అసలేందుకు ఇదంతా జరిగిందని. ఇప్పుడు నేను చాలా ఆనందంగా ఉన్నా.. ఇదంతా జరిగినందుకు ఇప్పుడు చాలా ప్రశాంతంగా.. సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను ఎప్పటినుంచో కలలు కనేది. కానీ నేను ఇదంతా జరుగుతుందని నేను గ్రహించలేదు. అంతేకాదు నాకు ఏం కావాలో తెలియని దాని వైపు పరుగులు తీస్తూనే ఉంటాను. మన జీవితంలో సరైన వ్యక్తులతో ఉండడం వలన మీరు కొన్నిసార్లు ఆగి.. దాన్ని గ్రహించాల్సి ఉంటుందని తెలుసుకుంటారు. ఈ లిటిల్ అమ్మాయి కలలు కంటూ పెరిగింది కూడా ఇదే !’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం రష్మిక చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.
Sometimes you just pause and think. Damn! How did it all happen. When did it all happen. Why did it all happen. And I am so freaking glad – that it all, happened! Grateful. Anchored. At peace. Happy! This is everything that I’ve always dreamed of.. I’d have not realised… pic.twitter.com/3vGvtzLkNE
— Rashmika Mandanna (@iamRashmika) December 29, 2023
ప్రస్తుతం రష్మిక గర్ల్ ఫ్రెండ్ సినిమాలో నటిస్తుంది. ఈ మూవీలో దియా ఫేమ్ కన్నడ హీరో దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై విద్య కొప్పినేని, ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు. అలాగే డైరెక్టర్ సుకుమారన్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటిస్తోన్న పుష్ప 2 త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
