Parking Movie: ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ సెన్సేషన్ ‘పార్కింగ్’.. తెలుగులోనూ చూడొచ్చు..

డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తమిళ్ సినీ పరిశ్రమలో సూపర్ హిట్ అయ్యి భారీ వసూళ్లు రాబట్టింది. అద్దె కారు యజమాని వారి జీవితంలో ఎదుర్కొనే వాస్తవిక సమస్యల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రంలో నటుడు ఎంఎస్ భాస్కర్ హరీష్ కళ్యాణ్ తరహా పాత్రలో నటించారు. హరీష్ కళ్యాణ్ సరసన ఇందుజ కూడా నటించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది

Parking Movie: ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ సెన్సేషన్ 'పార్కింగ్'.. తెలుగులోనూ చూడొచ్చు..
Parking Movie
Follow us

|

Updated on: Dec 30, 2023 | 8:14 AM

కోలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల సూపర్ హిట్ అయిన సినిమా ‘పార్కింగ్’. వైవిధ్యమైన కథలు, పాత్రలు ఎంచుకుంటూ వస్తున్న యంగ్ హీరో హరీష్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు రామ్ కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వం వహించారు. డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తమిళ్ సినీ పరిశ్రమలో సూపర్ హిట్ అయ్యి భారీ వసూళ్లు రాబట్టింది. అద్దె కారు యజమాని వారి జీవితంలో ఎదుర్కొనే వాస్తవిక సమస్యల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రంలో నటుడు ఎంఎస్ భాస్కర్ హరీష్ కళ్యాణ్ తరహా పాత్రలో నటించారు. హరీష్ కళ్యాణ్ సరసన ఇందుజ కూడా నటించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. థియేటర్లలో విడుదలైన నెలరోజుల లోపే.. ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

పార్కింగ్ సినిమా ప్రముఖ ఓటీటీ మాధ్యామం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు థియేటర్లలో చూడని ఈ కామెడీ డ్రామాను ఇప్పుడు నేరుగా ఇంట్లోనే చూడొచ్చు. ఈ చిత్రం కార్ పార్కింగ్ స్థలం వల్ల తలెత్తే సమస్యల గురించి, ఇది ఒక వ్యక్తిని ఎలా ప్రభావితం చేస్తుంది అనే కథపై నిర్మించారు. ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీతం అందించారు. ఈ సంవత్సరపు నూతన దర్శకుడు తెరకెక్కించిన తక్కువ-బడ్జెట్ బ్లాక్‌బస్టర్‌లలో ఇది ఒకటి.

పార్కింగ్ కథ విషయానికి వస్తే.. పార్కింగ్ స్థలం కోసం ఇరుగుపొరుగు వారికి నిత్యం గొడవలు జరుగుతుంటాయి. భిన్నమైన తరాలు, ప్రపంచంలోని ఇరుగుపొరుగు వారి మధ్య ఉండే అనుబంధం.. అదే సమయంలో వారి మధ్య పార్కింగ్ స్థలం విషయంలో వివాదం ఏర్పడుతుంది. దీంతో వారి మధ్య ఎలాంటి మనస్పర్థలు వచ్చాయి ? చివరికి వారి బంధం ఏలా చెదిరిపోయింది ? అనేది ఈ సినిమాలో చూడొచ్చు. ఇందులో హరీష్ కళ్యాణ్ ఐటీ ఉద్యోగి పాత్రలో కనిపించాడు. ఈ సినిమాలో MS భాస్కర్, రామ రాజేంద్ర, ప్రార్థన నాథన్, ఇళవరసు కీలకపాత్రలు పోషించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
ఏపీలో ఈ పథకాల లబ్ధిదారులకు ఊరట.. నగదు పంపిణీకి లైన్ క్లియర్..
ఏపీలో ఈ పథకాల లబ్ధిదారులకు ఊరట.. నగదు పంపిణీకి లైన్ క్లియర్..
కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడంపై సీఎం రేవంత్ సెన్సేషనల్ కామెంట్స్
కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడంపై సీఎం రేవంత్ సెన్సేషనల్ కామెంట్స్
తెలంగాణలో RR ట్యాక్స్ ప్రస్తావన.. రేవంత్ రియాక్షన్ ఇదే
తెలంగాణలో RR ట్యాక్స్ ప్రస్తావన.. రేవంత్ రియాక్షన్ ఇదే
ఈ రోజు అక్షయ తృతీయ... పూజ విధానం, శుభముహర్తం ఏమిటంటే
ఈ రోజు అక్షయ తృతీయ... పూజ విధానం, శుభముహర్తం ఏమిటంటే
నేడు నారాయణపేట, హైదరాబాద్‌లో మోదీ సభలు
నేడు నారాయణపేట, హైదరాబాద్‌లో మోదీ సభలు
పసిడి ప్రియులకు స్వల్ప ఊరట.. తగ్గిన బంగారం ధరలు.. తులం ధర ఎంతంటే
పసిడి ప్రియులకు స్వల్ప ఊరట.. తగ్గిన బంగారం ధరలు.. తులం ధర ఎంతంటే
Horoscope Today: సమాజంలో ఆ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది..
Horoscope Today: సమాజంలో ఆ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది..
డూ ఆర్ డై మ్యాచ్‌లో పంజాబ్‌పై ఆర్సీబీ విజయం.. ప్లే ఆఫ్ ఆశలు సజీవం
డూ ఆర్ డై మ్యాచ్‌లో పంజాబ్‌పై ఆర్సీబీ విజయం.. ప్లే ఆఫ్ ఆశలు సజీవం
T20 ప్రపంచకప్‌కు శ్రీలంక జట్టు.. కెప్టెన్ ఎవరో అసలు ఊహించలేరు
T20 ప్రపంచకప్‌కు శ్రీలంక జట్టు.. కెప్టెన్ ఎవరో అసలు ఊహించలేరు
ఒకే గడ్డపై ఇద్దరు అగ్ర నేతలు.. ఏం మాట్లాడతారన్న సర్వత్రా ఆసక్తి!
ఒకే గడ్డపై ఇద్దరు అగ్ర నేతలు.. ఏం మాట్లాడతారన్న సర్వత్రా ఆసక్తి!