Rana-Naga Chaitanya: రానా షోలో నాగ చైతన్య సందడి.. లైవ్‌లో ఆ హీరోయిన్‌కు సర్ప్రైజ్ కాల్..
అక్కినేని నాగచైతన్య ఇటీవలే ఓ ఇంటి వాడయ్యాడు. డిసెంబర్ 4న హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల మెడలో మూడు ముళ్లు వేశాడు చైతూ. వీరిద్దిరి వివాహ వేడుక అన్నపూర్ణ స్టూడియోలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబసభ్యులు, సినీప్రముఖులు వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు. అంతకు ముందు రానా హోస్టింగ్ చేస్తున్న టాక్ షోలో నాగచైతన్య సందడి చేశారు.
హీరో దగ్గుబాటి రానా ఇప్పుడు హోస్ట్‌గా కొత్త టాక్ షో స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ షో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో రానా చేస్తున్న అల్లరి, అతిథులను రోస్టు చేస్తున్న తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అలాగే సిద్దు జొన్నలగడ్డ, శ్రీలీలతో కలిసి రానా చేసిన అల్లరి అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా సిద్ధు మాటలు.. రానా పంచులతో శ్రీలీలను ఆడుకున్నారు. వీరిద్దరి తర్వాత ఈ షోలో నాగచైతన్య సందడి చేశాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట తెగ వైరలవుతుంది. రానా టాక్ షోలో తండేల్ సినిమా అప్డేట్స్, పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయలను పంచుకున్నారు చైతన్య.
ఇక ఇదే షోలో సాయి పల్లవి గురించి చైతూ మాట్లాడుతూ.. తనతో డ్యాన్స్, యాక్టింగ్ చేయాలంటే చాలా కష్టమని.. పవర్ ఫుల్ టాలెంటెడ్ హీరోయిన్ అంటూ పొగడ్తలు కురిపించాడు. నువ్వు మాత్రం ఆమెతో ఒక్క పాట కూడా లేకుండా, డ్యాన్స్ లేకుండా సినిమా చేశావ్ అంటూ చైతూ రానాకు కౌంటరిచ్చాడు. ఇక అదే సమయంలో రానా సాయి పల్లవికి కాల్ చేసాడు. ఫోన్ లిఫ్ట్ చేయగానే సాయి పల్లవి నవ్వుతూ సిగ్గు పడుతూ మాట్లాడింది. ఎందుకు సిగ్గపడుతున్నావ్ ? అని చైతన్య అంటాడు. వెంటనే రానా.. నీ గురించి చైతూ చాలా గొప్పగా చెప్పాడు అని అంటాడు. నాకు తెలుసు ఏం చెప్పి ఉంటాడో అని సాయి పల్లవి అంటే.. బాగా గొప్పగా చెప్పాడు అని రానా అన్నాడు. ఇంకా మానిటర్ దగ్గరకు వెళ్లి.. అది మార్చు, ఇది మార్చు అని చెబుతున్నావా ? అని సాయి పల్లవిని అడిగాడు రానా.
సాయి పల్లవి కేవలం బాగుందా ? లేదా ? నచ్చిందా ? అనేది మాత్రమే అడుగుతుంది అంటూ కౌంటరిస్తాడు నాగచైతన్య. సాయి పల్లవికి ఫేక్ నెస్ అంటే ఏంటో తెలీదని అంటూనే.. మెల్లిగా రానా.. అరేయ్ నెక్ట్స్ మంత్ మళ్లీ ఓ సాంగ్ షూటింగ్ ఉందిరా.. అందుకే ఇలా కాకా పడుతున్నా అని అన్నాడు చైతూ. ఇక చైతన్యలో నీకు చిరాకు వచ్చే అంశం ఏంటీ అని రానా అడగ్గా.. ఏం ఇబ్బంది ఉన్నా చెప్పడని.. అదే చిరాగ్గా అనిపిస్తుందని చెప్పుకొచ్చింది సాయి పల్లవి. ఇందుకు సంబంధించిన వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
Phone call with Sai Pallavi in Rana Daggubati Show!
Sai Pallavi is an ACTOR like a Director in Sets 😁♥️ – #Nagachaithanya @Sai_Pallavi92 @RanaDaggubati @chay_akkineni #SaiPallavi #Thandelpic.twitter.com/eQFPwt06SW
— Sai Pallavi FC™ (@SaipallaviFC) December 7, 2024
Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?
Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..
Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.