AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఫొటోస్ వైరల్.. ఎవరో గుర్తు పట్టారా?

టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ అమ్మగా ప్రమోషన్ పొందింది. తనకు పండంటి బిడ్డ పుట్టినట్లు ఆమె సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ క్రేజీ హీరోయిన్ కు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Tollywood: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఫొటోస్ వైరల్.. ఎవరో గుర్తు పట్టారా?
Akshara Gowda
Basha Shek
|

Updated on: Dec 07, 2024 | 2:48 PM

Share

టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ అక్షర గౌడ అమ్మగా ప్రమోషన్ పొందింది. తనకు పండంటి బిడ్డ జన్మించినట్లు సోషల్ మీడియా ద్వారా శుభవార్త షేర్ చేసింది. ఈ సందర్భంగా తన బేబీ కి సంబందించిన క్యూట్ ఫొటోలను కూడా అందులో షేర్ చేసింది. అయితే తనకి పుట్టింది పాపనో, బాబునో మాత్రం చెప్పలేదీ అందాల తార. బేబీ ఫొటోలతో పాటు తాను గర్భంతో ఉన్నప్పటి ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన అక్షర గౌడ 9 నెలల ఆ అద్భుతమైన రోజులను గుర్తుచేసుకుంది. ‘ తల్లి డ్యూటీ చేస్తూ.. ఎన్నో కోరికలను కోరుతూ 2024వ సంవత్సరాన్ని ఘనంగా ముగిస్తున్నాం. తనకు (భర్త) బెస్ట్ బర్త్ డే గిఫ్ట్ ఇచ్చాను. 9 నెలలు నా కడుపులో మోసి.. అచ్చం తనలాగే ఉండే ఒక బేబీ ని గిఫ్ట్ గా ఇచ్చాను’ అని తన ఆనందానికి అక్షర రూపమిచ్చిందీ అందాల తార. దీంతో ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు అక్షర గౌడ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

మన్మథుడు 2 సినిమాతో టాలీవుడ్ లో కి ఎంట్రీ..

బెంగళూరుకు చెందిన అక్షర గౌడ దర్శకుడు ఆకాశ్ బిక్కీని వివాహం చేసుకుంది. ఇక అక్షర సినిమాల విషయానికి వస్తే.. మొదట తమిళ సినిమాతో సినీ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది. తుపాకీ, ఆరంభం, భోగన్, మాయావన్ తదితర సూపర్ హిట్ సినిమాల్లో కీలక పాత్రలు పోషించింది. ఇక గత కొన్నేళ్లుగా వరుసగా తెలుగు సినిమాల్లో నటిస్తోందీ అందాల తార. మన్మథుడు 2 , ది వారియర్, దాస్ కా ధమ్కీ, నేనేనా, హరోంహర సినిమాల్లో కనిపించింది అక్షర.

క్యూట్ బేబితో అక్షర గౌడ దంపతులు..

ది మస్తీ, మిక్స్ అప్ వంటి బోల్డ్ సినిమాలతో పాటు పలు వెబ్ సిరీసుల్లోనూ నటించిన అక్షర సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తన లేటస్ట్ అండ్ గ్లామరస్ ఫొటోలను నెట్టింట తరచూ షేర్ చేస్తుంటుంది. వీటికి నెటిజన్ల నుంచి క్రేజీ కామెంట్స్ వస్తుంటాయి.

మన్మథుడు 2 సినిమాలో అక్కినేని నాగార్జునతో అక్షర గౌడ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్