AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2 : ఇదెక్కడి క్రేజ్ రా సామి.. బిత్తరపోతున్న ఫ్యాన్స్.. వేలంలో పుష్ప 2 టికెట్స్.. ?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం పుష్ప 2. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే జనాల్లో మంచి హైప్ నెలకొంది. గత మూడేళ్ల క్రితం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన పుష్పరాజ్.. ఇప్పుడు మళ్లీ ఎలాంటి విధ్వంసం సృష్టించనున్నాడో తెలుసుకునేందుకు అడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Pushpa 2 : ఇదెక్కడి క్రేజ్ రా సామి.. బిత్తరపోతున్న ఫ్యాన్స్.. వేలంలో పుష్ప 2 టికెట్స్.. ?
డే ఒన్‌ రికార్డులు.. డే ఒన్‌ 200 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన క్రెడిట్‌ ఇప్పటిదాకా ట్రిపుల్‌ ఆర్‌, బాహుబలి2కి మాత్రమే ఉంది.. వాటిని మించి వసూలు చేసి.. వసూళ్లలో మాస్‌ జాతర చూపించేయాలన్నది ఐకాన్‌ స్టార్‌ ఆలోచన.
Rajitha Chanti
|

Updated on: Nov 20, 2024 | 1:29 PM

Share

ఇప్పుడు సోషల్ మీడియాలో పుష్ప2 ఫీవర్ నడుస్తోంది. పాన్ ఇండియన్ సినీ పరిశ్రమలోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీగా ఈ సినిమా అడియన్స్ ముందుకు రాబోతుంది. డిసెంబర్ 5న విడుదలయ్యే ఈ మూవీ కోసం యావత్ ప్రపంచం ఎదురుచూస్తుంది. మొత్తం 6 భాషలలో రిలీజ్ కానున్న ఈ ప్రాజెక్ట్ ఓవర్సీస్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. రికార్డు స్థాయిలో పుష్ప 2 టికెట్స్ బుక్ అవుతున్నాయి. అటు అతిపెద్ద మార్కెట్ అయిన అమెరికాలో ఇప్పటికే పుష్పరాజ్ సరికొత్త రికార్డ్ సృష్టించాడు. అమెరికాలో ప్రీ బుకింగ్‌లోనే మిలియన్ డాలర్లు దాటిన మొదటి సినిమాగా నిలిచింది. దీంతో భారత్‏లో ఎప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అవుతాయా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే మూవీ బుకింగ్స్ కు సంబంధించి ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ విభిన్నంగా స్టార్ట్ చేసిన మైత్రీ మూవీ మేకర్స్.. ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్ టికెట్స్ విషయంలోనూ డిఫరెంట్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాకు ఉన్న హైప్ వలన టికెట్లను వేలం పద్దతిలో విక్రయించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారంటూ ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. పుష్ప 2 ది రూల్ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షోకు సంబంధించి తొలి టికెట్‏ను వేలం పద్దతి ద్వారా అమ్మబోతున్నట్లు ఇప్పటికే నెట్టింట రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ వేలంలో ఎవరు ఎక్కువకు పాడుకుంటే వాళ్లకే ఆ టికెట్ ఇస్తారని.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్లలో మొదటి టికెట్ వేలం ద్వారా మాత్రమే విక్రయించాలని చూస్తున్నారట మేకర్స్. ఇలా వేలం ద్వారా టికెట్ సొంతం చేసుకున్నవారి వివరాలను ఆన్ లైన్ లో లేదా ఆఫ్ లైన్ లో వెల్లడించనున్నారని.. ప్రస్తుతం దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఇప్పుడు ఇదే విషయం గురించి మేకర్స్ ఆలోచనలో ఉన్నారని.. అయితే ఈ వేలం గురించి త్వరలోనే క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది.

కానీ వేలం ద్వారా పుష్ప 2 మొదటి టికెట్ అనే బజ్ మాత్రం ఇప్పుడు నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. అలాగే వేలం ద్వారా టికెట్ విక్రయం అని తెలియడంతో ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో క్రేజ్ బట్టి చూస్తే తెలుస్తోంది. పుష్ప 2 పై ఇటు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా హైప్ నెలకొంది. పుష్ప 2 ప్రాజెక్ట్ దాదాపు రూ.2000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టనున్నట్లు టాక్ నడుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి : Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..

Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..

Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‏కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే 'స్పీడ్ గన్'గా
తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే 'స్పీడ్ గన్'గా
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
పాతకాలం నాటి ప్రేమే ముద్దు అంటున్న బాలీవుడ్ బ్యూటీ
పాతకాలం నాటి ప్రేమే ముద్దు అంటున్న బాలీవుడ్ బ్యూటీ
రవీంద్ర భారతిలో ఆటా సందడి.. తెలుగు మూలాలను మర్చిపోవద్దన్న గవర్నర్
రవీంద్ర భారతిలో ఆటా సందడి.. తెలుగు మూలాలను మర్చిపోవద్దన్న గవర్నర్
ఫ్రీగా సినిమా టికెట్స్.. రెస్టారెంట్‌లో భోజనం.. మీకు కూడా..
ఫ్రీగా సినిమా టికెట్స్.. రెస్టారెంట్‌లో భోజనం.. మీకు కూడా..
15 రోజుల ముందే చెప్పేసిన హిట్‌మ్యాన్..
15 రోజుల ముందే చెప్పేసిన హిట్‌మ్యాన్..
'నేనూ భారతీయుడినే..' డెహ్రాడూన్ జాత్యహంకార దాడిలో విద్యార్ధి మృతి
'నేనూ భారతీయుడినే..' డెహ్రాడూన్ జాత్యహంకార దాడిలో విద్యార్ధి మృతి