Kantara: కాంతార సినిమాలో మొదట‌గా ఆ స్టార్ హీరోను అనుకున్నారట.. కానీ

అక్టోబర్ 15న తెలుగుతో పాటు పలు భాషల్లో రిలీజ్ అయ్యింది. రిషబ్ శెట్టి నటించి, డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ‘గీతా ఆర్ట్స్’ రిలీజ్ చేసింది.

Kantara: కాంతార సినిమాలో మొదట‌గా ఆ స్టార్ హీరోను అనుకున్నారట.. కానీ
Kantara
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 02, 2022 | 5:10 PM

ఇటీవల సూపర్ హిట్ అయిన సినిమాల్లో కాంతార సినిమా ఒకటి. కన్నడ సినిమా అయినప్పటికీ విడుదలైన అన్ని భాషల్లో మంచి విజయాన్నిఅందుకుంది ఈ సినిమా. అక్టోబర్ 15న తెలుగుతో పాటు పలు భాషల్లో రిలీజ్ అయ్యింది. రిషబ్ శెట్టి నటించి, డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ‘గీతా ఆర్ట్స్’ రిలీజ్ చేసింది. మొదటి రోజే ఈ మూవీ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.క్రిటిక్స్ అయితే ఈ మూవీతో లవ్ లో పడిపోయినట్టు రేటింగ్ లు ఇచ్చారు. మొదటి రోజు మార్నింగ్ షోలు మ్యాట్నీలు కాస్త డల్ గా స్టార్ట్ అయినా ఈవెనింగ్ షోల నుండి ఈ మూవీ బాగా కలెక్ట్ చేసింది. కన్నడిగుల సంప్రదాయమైన భూత కోల ఆచారం నేపథ్యంలో ఎంతో ఆసక్తికరంగా కాంతార సినిమాను తెరకెక్కించారు. ఇక ఈ సినిమా రోజు రోజుకు క్రేజ్ పెంచుకుంటూ కలెక్షన్స్ సాధిస్తోంది.

భాషతో సంబంధం లేకుండా కాన్సెప్ట్ కీ, కల్చర్ కీ కనెక్ట్ అయ్యారు ఆడియన్స్.. దీంతో మూవీ బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది కాంతార మూవీ. ఇక విడుదలైన ప్రతిచోటా వసూళ్ల వర్షం కురిపిస్తోన్న ఈ సినిమాపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో ముందు హీరో రిషబ్ కాదట. ఈ సినిమాకు రిషబ్ దర్శకత్వంతోపాటు హీరోగానూ నటించిన విషయం తెలిసిందే. అయితే ముందుగా ఈ సినిమాలో హీరోగా దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ అనుకున్నారట. ఆ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో ఉండాలని ముందుగానే అనుకున్నారట. అందుకోసమే హోంబలే ప్రొడక్షన్‌ హౌస్‌ను సంప్రదించాడు. అన్ని కుదిరిన తర్వాత పునీత్‌ రాజ్‌కుమార్‌తో సినిమా చేయాలని అనుకున్నాడట. అయితే ఇదే విషయం పునీత్‌ రాజ్‌కుమార్‌తో చెబితే.. ఆ మట్టి వాసన బాగా పండాలంటే.. హీరోగా నువ్వే నటించాలి అని సలహా ఇచ్చాడట. దాంతో రిషబ్ ఈ సినిమాలో హీరోగాను నటించాడట.

ఇవి కూడా చదవండి