Prema Vimanam: ఓటీటీలో ఆకట్టుకుంటున్న అందమైన ప్రేమకథ.. ‘ప్రేమ విమానం’ ఎక్కడ చూడొచ్చంటే..
వివిధ OTT ప్లాట్‌ఫారమ్‌లలో అనేక తెలుగు సినిమాలు , వెబ్ సిరీస్‌లను విడుదల చేస్తూనే వీక్షకులను బాగా ఆకట్టుకుంది. లోతైన కథాంశం, అసాధారణమైన నటనా నైపుణ్యాలు చాలా మంది వాటిని చూడటానికి ప్రోత్సహించాయి. ఇక జీ5 ఓటీటీ ప్లాట్‌ఫారమ్ గతంలో అనేక ఉత్తేజకరమైన వెబ్ షోలు, చిత్రాలను అందించింది. ఇప్పుడు ఈ ఓటీటీ వేదికగా ప్రేమ విమానం అనే మరో వెబ్ ఫిల్మ్‌ని తీసుకొచ్చింది. ఈ సినిమాను అక్టోబర్ 13 న స్ట్రీమింగ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ ఇదివరకే ప్రకటించింది. కానీ
తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‌ను క్రియేట్ చేస్తోంది. కేవలం థియేటర్ అభిమానులకే కాదు.. ఓటీటీ మూవీ లవర్స్ కోసం సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ చేస్తూనే.. ఇప్పుడిప్పుడే అందమైన ప్రేమకథలను అడియన్స్ ముందుకు తీసుకువస్తుంది. వివిధ OTT ప్లాట్‌ఫారమ్‌లలో అనేక తెలుగు సినిమాలు , వెబ్ సిరీస్‌లను విడుదల చేస్తూనే వీక్షకులను బాగా ఆకట్టుకుంది. లోతైన కథాంశం, అసాధారణమైన నటనా నైపుణ్యాలు చాలా మంది వాటిని చూడటానికి ప్రోత్సహించాయి. ఇక జీ5 ఓటీటీ ప్లాట్‌ఫారమ్ గతంలో అనేక ఉత్తేజకరమైన వెబ్ షోలు, చిత్రాలను అందించింది. ఇప్పుడు ఈ ఓటీటీ వేదికగా ప్రేమ విమానం అనే మరో వెబ్ ఫిల్మ్‌ని తీసుకొచ్చింది. ఈ సినిమాను అక్టోబర్ 13 న స్ట్రీమింగ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ ఇదివరకే ప్రకటించింది. కానీ అడియన్స్ కోరిక మేరకు ఈ సినిమాకు ఒక రోజు ముందుగానే అంటే అక్టోబర్ 12నే విడుదల చేశారు. ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో ప్రసారం అవుతోంది.
భారీ అంచనాలున్న ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రముఖ తెలుగు నిర్మాత అభిషేక్ నామా నిర్మించారు. ఇందులో దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా, సంగీత్ శోభన్, సాన్వి మేఘన, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రల్లో నటించగా.. సంతోష్ కట్టా దర్శకత్వం వహించారు. ఇక అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది.
Thank you so much @DirectorMaruthi garu for joining us on our flight ♥️#PremaVimanam now streaming on ZEE 5 🙌🏻#PremavimanamOnZee5 #SangeethShobhan @saanvemegghana #DevanshNama #AnirudhNama @anusuyakhasba @vennelakishore @tweetravivarma @abhishekpicture #AbhishekNama… pic.twitter.com/dGHALzPXuX
— ABHISHEK PICTURES (@AbhishekPicture) October 12, 2023
కథ విషయానికి వస్తే..
రాము (దేవాన్ష్), లక్ష్మణ్ (అనిరుధ్) ఇద్దరికి విమానం ఎక్కాలనే కోరిక ఉంటుంది. కానీ చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో తల్లి (అనసూయ) కూలి పనులు చేస్తూ పిల్లలను పోషిస్తుంటుంది. ఇక అదే ఊరిలో ఉండే మణికంఠ (సంగీత్ శోభన్).. ఊరి సర్పంచ్ కూతురు అభిత (శాన్వీ మేఘన) ఇద్దరు ప్రేమించుకుంటారు. అభితకు పెళ్లి సంబంధం కుదరడంతో ఇద్దరు ఊరి నుంచి పారిపోతారు. దుబాయ్ కి వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. మరోవైపు రాము, లక్ష్మణ్ ఇద్దరు కూడా ఇంట్లో నుంచి పారిపోతారు. ఎయిర్ పోర్ట్ కోసం వెతుకుతుంటారు. అప్పుడు వారికి ఎదురైన సమస్యుల ఏంటీ ?.. వీరు నలుగురు ఎలా కలిశారు ?.. అనేది తెలియాలంటే ప్రేమ విమానం చూడాల్సిందే.
The skies of love and entertainment have opened up. #PremaVimanam is now in every household and available for streaming on @ZEE5Telugu https://t.co/yEFJidhMgm
Don’t miss the flight to this HEARTWARMING tale ♥️#PremavimanamOnZee5 #SangeethShobhan @saanvemegghana… pic.twitter.com/wmrqoM94KL
— ABHISHEK PICTURES (@AbhishekPicture) October 12, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.