- Telugu News Photo Gallery Cinema photos Actor naveen polishetty next movie anaganaga next movie oka raju update telugu heroes photos
Naveen Polishetty: జాతి రత్నాలు కాంబో మళ్లీ రిపీట్ అవుతుందా..? అనగనగా ఒక రాజు అసలు వస్తుందా..!
జాతి రత్నాలు కాంబినేషన్ రిపీట్ కానుందా..? రెండేళ్ల కింద కరోనా టైమ్‌లో కడుపులు చెక్కలయ్యేలా నవ్వించిన నవీన్ పొలిశెట్టి, అనుదీప్ కేవీ మరో సినిమాకు సైన్ చేసారా..? నవీన్ ఆల్రెడీ మొదలుపెట్టిన ఓ సినిమాను అనుదీప్ టేకోవర్ చేయబోతున్నారా..? అదే నిజం అయితే ఏంటా సినిమా..? అసలు నవీన్ పొలిశెట్టి కెరీర్‌లో అలా ఆగిపోయిన సినిమా ఏంటి..? అవునూ.. అప్పట్లో అనగనగా ఒక రాజు అంటూ నవీన్ పొలిశెట్టి ఓ సినిమా మొదలుపెట్టారు కదా..! ఇంతకీ ఏమైందది..?
Updated on: Oct 12, 2023 | 6:30 PM

జాతి రత్నాలు కాంబినేషన్ రిపీట్ కానుందా..? రెండేళ్ల కింద కరోనా టైమ్‌లో కడుపులు చెక్కలయ్యేలా నవ్వించిన నవీన్ పొలిశెట్టి, అనుదీప్ కేవీ మరో సినిమాకు సైన్ చేసారా..? నవీన్ ఆల్రెడీ మొదలుపెట్టిన ఓ సినిమాను అనుదీప్ టేకోవర్ చేయబోతున్నారా..? అదే నిజం అయితే ఏంటా సినిమా..?

అసలు నవీన్ పొలిశెట్టి కెరీర్‌లో అలా ఆగిపోయిన సినిమా ఏంటి..? అవునూ.. అప్పట్లో అనగనగా ఒక రాజు అంటూ నవీన్ పొలిశెట్టి ఓ సినిమా మొదలుపెట్టారు కదా..! ఇంతకీ ఏమైందది..?

అప్పుడెప్పుడో జాతిరత్నాలు తర్వాత ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసారు.. అయినా ఇప్పటికీ బయటికి రాలేదు.ఇంతకీ అనగనగా ఒక రాజు సినిమా ఉందా లేదా..? ఉంటే ఏమైనట్లు.. ఎప్పుడొస్తున్నట్లు..? ఈ అనుమానాలు ఆడియన్స్‌లో చాలానే ఉన్నాయి.

దీనిపై ఇప్పుడో క్లారిటీ వచ్చేలా ఉంది. ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ, జాతి రత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి లాంటి సినిమాలతో నవీన్ మార్కెట్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

అయితే విజయాలొస్తున్నంత వేగంగా సినిమాలకు మాత్రం సైన్ చేయట్లేదు నవీన్. ప్రస్తుతం ఈయన అనగనగా ఒకరాజు సినిమాతో బిజీగా ఉన్నారు. అప్పుడెప్పుడో 2022 జనవరిలో టీజర్ విడుదల చేసారు.. తర్వాత మళ్లీ ఉలుకు పలుకు లేదు ఈ సినిమా గురించి.

కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో అనగనగా ఒకరాజు మొదలైంది. అనుకోని కారణాలతో ఈ చిత్రం ఆలస్యమవ్వడంతో.. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌లోనే మ్యాడ్ సినిమా చేసారు కళ్యాణ్ శంకర్.

దాంతో అనగనగా ఒకరాజు సినిమాను జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీ టేకోవర్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇదే నిజమైతే సినిమాపై అంచనాలు పెరగడం ఖాయం. అన్నట్లు ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారు.




