- Telugu News Photo Gallery Cinema photos Married Actress who did romantic roles in they movies updates here Telugu Actress Photos
Married Actress: పెళ్లి తర్వాత కూడా రెచ్చిపోతున్న హీరోయిన్లు.. హాట్ ఫొటోస్ తో గ్లామర్ షో.
తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే.. ఈ సామెత మన హీరోయిన్లకు ఎన్నిసార్లైనా వాడుకోవచ్చు.. అస్సలు ఓల్డ్ అవ్వదు తెలుసా..? ఇప్పుడూ ఇదే జరుగుతుంది. సాధారణంగా పెళ్లి తర్వాత హీరోయిన్లు గ్లామర్ షోకు దూరంగా ఉంటారంటారు కానీ అది కొన్నిరోజులే. ఏంటి నమ్మరా.. ఈ ముద్దుగుమ్మలను చూడండి.. ఎందుకు నమ్మరో మేం కూడా చూస్తాం..! గ్లామర్ షో చేయకుండా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లు అవ్వడం అనేది అరుదైన విషయం.
Updated on: Oct 12, 2023 | 7:29 PM

తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే.. ఈ సామెత మన హీరోయిన్లకు ఎన్నిసార్లైనా వాడుకోవచ్చు.. అస్సలు ఓల్డ్ అవ్వదు తెలుసా..? ఇప్పుడూ ఇదే జరుగుతుంది. సాధారణంగా పెళ్లి తర్వాత హీరోయిన్లు గ్లామర్ షోకు దూరంగా ఉంటారంటారు కానీ అది కొన్నిరోజులే.

ఏంటి నమ్మరా.. ఈ ముద్దుగుమ్మలను చూడండి.. ఎందుకు నమ్మరో మేం కూడా చూస్తాం..! గ్లామర్ షో చేయకుండా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లు అవ్వడం అనేది అరుదైన విషయం. కీర్తి సురేష్ లాంటి బ్యూటీస్ సైతం ఇప్పుడు హాట్ షో వైపు అడుగులు వేస్తున్నారు.

ఎక్కడో సాయి పల్లవి లాంటి ఒకరిద్దరికి మాత్రమే స్కిన్ షో చేయకపోయినా నడుస్తుంది. ఈ క్రమంలోనే పెళ్లైన హీరోయిన్లు కూడా ఛాన్సుల కోసం రెచ్చిపోక తప్పట్లేదు. అలియా భట్‌నే తీసుకోండి.. పెళ్లికి ముందు ఈ భామ హద్దులే లేకుండా రెచ్చిపోయారు.

కానీ కపూర్ ఇంటికి కోడలయ్యాక కొన్ని రోజులు గ్లామర్ షోకు దూరంగా ఉన్నారు అలియా. ఓ బిడ్డకు తల్లయ్యాక పూర్తిగా మారిపోయారేమో అనిపించింది.కానీ ఉన్నట్లుండి ఈ బ్యూటీ గ్లామర్ షో షురూ చేసారు.

కాజల్ అగర్వాల్ కూడా ఇదే దారిలో వెళ్తున్నారు. ప్రస్తుతం భగవంత్ కేసరిలో నటిస్తున్నారు చందమామ. ఓ వైపు సినిమాల్లో సీనియర్ హీరోలకు జోడీగా నటిస్తూనే.. మరోవైపు బయట మాత్రం హాట్ ఫోటోషూట్స్‌తో రెచ్చిపోతున్నారు కాజల్.

విడాకుల తర్వాత సమంతను ఎవరూ అడ్డుకోలేకపోతున్నారు. ఈ బ్యూటీ షోకు థర్మామీటర్లు పేలిపోతున్నాయి. మరోవైపు సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లాడిన తర్వాత కూడా కియారా అద్వానీ గ్లామర్ షో వైపు అడుగులేస్తున్నారు. మొత్తానికి హీరోయిన్లందరూ పెళ్లితో కెరీర్‌ను ముడిపెట్టట్లేదు.




