Mahesh Babu: 25 ఏళ్ల కుర్రాడికి 48 ఏంటీ ?.. మహేష్ బాబు లుక్ చూసి ముగ్దులవుతున్న లండన్ వాసులు..
లండన్ వాసులు మహేష్ న్యూలుక్ చూసి ఫిదా అవుతున్నారు. ఆయన వయసును అంచనా వేయడంలో పొరపాటు పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుది. ఇటీవల లండన్‌లో వీధుల్లో ఒక భారతీయ వ్యక్తి తన ఫోన్లో మహేష్ బాబు లేటేస్ట్ ఫోటో చూపిస్తూ.. ఆయన వయస్సును అంచనా వేయమని ప్రజలను అడిగాడు. మహేష్ లుక్ చూసిన అతని వయస్సు 24, 25 లేదా 28 అంటూ అంచనా వేశారు. ఇక కొందరు మాత్రం 30 ఉంటుందేమో అని ఊహించారు. కానీ సూపర్‌స్టార్ అసలు వయస్సు తెలిసి ఉలిక్కిపడ్డారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ఎప్పుడూ చెప్పక్కర్లేదు. సౌత్ టూ నార్త్ ఆయనకు ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం మహేష్ వయసు 48 అయినా.. 25 ఏళ్ల కుర్రాడిగా కనిపిస్తూ యంగ్ హీరోలకు సైతం కుళ్లుకోవాల్సిందే అనేట్టుగా ఫిట్నెస్ మెయింటెన్ చేస్తున్నారు మహేష్. ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ న్యూలుక్ ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ షాకిస్తున్నారు. మహేష్ స్టైలీష్ లుక్ లో అచ్చం హాలీవుడ్ హీరోలా కనిపిస్తున్నారంటూ ఇప్పటికే ఎంతో మంది కామెంట్స్ చేశారు. ఇక లండన్ వాసులు మహేష్ న్యూలుక్ చూసి ఫిదా అవుతున్నారు. ఆయన వయసును అంచనా వేయడంలో పొరపాటు పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుది. ఇటీవల లండన్‌లో వీధుల్లో ఒక భారతీయ వ్యక్తి తన ఫోన్లో మహేష్ బాబు లేటేస్ట్ ఫోటో చూపిస్తూ.. ఆయన వయస్సును అంచనా వేయమని ప్రజలను అడిగాడు. మహేష్ లుక్ చూసిన అతని వయస్సు 24, 25 లేదా 28 అంటూ అంచనా వేశారు. ఇక కొందరు మాత్రం 30 ఉంటుందేమో అని ఊహించారు. కానీ సూపర్‌స్టార్ అసలు వయస్సు తెలిసి ఉలిక్కిపడ్డారు.
మహేష్ బాబు తన మనోహరమైన లుక్స్, తనని తాను ప్రదర్శించే ఆకర్షణీయమైన విధానానికి ఎంతో ఫేమస్ అయ్యారు. ముఖ్యంగా అమ్మాయిల్లో మహేష్ బాబుకు విపరీతమైన ఫాలోయింగ్ ఉందంటే అతిశయోక్తి కాదు. భారతీయులే కాకుండా విదేశాల్లోనూ మహేష్ బాబుకు సపరేట్ ఫాలోయింగ్ ఉంది. ఇదిలా ఉంటే..తాజాగా మహేష్ బాబు కొత్త ఫోటో కూడా వైరల్ అవుతుంది. గురువారం జిమ్ లో వర్కవుట్ చేస్తోన్న ఫోటోను పంచుకున్నారు మహేష్. అందులో సీరియస్ లుక్‌లో స్పోర్ట్స్ టీ షర్ట్ ధరించి, హెడ్‌బ్యాండ్‌ని ఉపయోగించి జుట్టును వెనక్కి తిప్పి కట్టినట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం మహేష్ న్యూలుక్ పిక్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. మహేష్ కొత్త లుక్ పై ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ స్పందిస్తూ మాటలు రావడం లేదంటూ కామెంట్ చేశారు.
LONDON PEOPLE GUESSING MAHESHBABU’S AGE🥰
#maheshbabu #superstar@urstrulyMahesh #SSMB29#GunturKaaram pic.twitter.com/z13dlJJDDr
— Mahesh Sharukh Universe (@SSMBSRK1231) October 11, 2023
ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుంటూరు కారం షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు మహేష్. దశాబ్దం తర్వాత మహేష్, త్రివిక్రమ్ మళ్లీ కలుసుకోవడం ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత. వీరి మ్యాజిక్‌ను మళ్లీ వెండితెరపై చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జనవరి 12, 2024న సంక్రాంతి సంబరాలతో ఈ చిత్రం థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. మరోవైపు రాజమౌళి తెరకెక్కించనున్న కొత్త ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే శరవేగంగా జరుగుతున్నాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.