జార్జ్ రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నో పర్మిషన్..పవనే రీజన్..?

ఆదివారం నెక్లస్ రోడ్‌లో జరుగబోయే ‘జార్జ్ రెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు  పోలీసులు అనుమతి నిరాకరించారు.  చీఫ్ గెస్ట్‌గా పవన్ కళ్యాణ్ వస్తున్నందున.. లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తుతుందని… ఆయన అభిమానులు, స్టూడెంట్ యూనియన్లు పెద్ద ఎత్తున హాజరయితే ప్రాబ్లెమ్ వస్తుందని పోలీసులు పేర్కొన్నారు. కాగా  నవంబర్ 22న ‘జార్జ్ రెడ్డి’ చిత్రం రిలీజ్ కాబోతుంది. విద్యార్ధి నాయకుడు జార్జ్ రెడ్డి జీవిత కథతో ఆయన పేరునే సినిమా టైటిల్‌గా పెట్టి మూవీని తెరకెక్కించారు. ఉస్మానియా […]

జార్జ్ రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నో పర్మిషన్..పవనే రీజన్..?
Follow us
Ram Naramaneni

| Edited By: Anil kumar poka

Updated on: Nov 18, 2019 | 12:47 PM

ఆదివారం నెక్లస్ రోడ్‌లో జరుగబోయే ‘జార్జ్ రెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు  పోలీసులు అనుమతి నిరాకరించారు.  చీఫ్ గెస్ట్‌గా పవన్ కళ్యాణ్ వస్తున్నందున.. లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తుతుందని… ఆయన అభిమానులు, స్టూడెంట్ యూనియన్లు పెద్ద ఎత్తున హాజరయితే ప్రాబ్లెమ్ వస్తుందని పోలీసులు పేర్కొన్నారు. కాగా  నవంబర్ 22న ‘జార్జ్ రెడ్డి’ చిత్రం రిలీజ్ కాబోతుంది. విద్యార్ధి నాయకుడు జార్జ్ రెడ్డి జీవిత కథతో ఆయన పేరునే సినిమా టైటిల్‌గా పెట్టి మూవీని తెరకెక్కించారు. ఉస్మానియా క్యాంపస్ రాజకీయాల్లో బలమైన విద్యార్థి నాయకుడిగా జార్జ్ రెడ్డి నిలబడ్డారు. జీవన్ రెడ్డి  ఈ చిత్రానికి దర్శకుడు. ఇటీవలే రిలీజ్ చేసిన  సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది.