నాడు ‘ఖైదీ’.. నేడు ‘దొంగ’.. మరోసారి చిరు టైటిల్‌తోనే వస్తున్న కార్తీ!

తమిళ నటుడు కార్తీ హీరోగా ‘దృశ్యం’ ఫేమ్ జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘దొంగ’. కార్తీ  వదిన, సీనియర్ నటి జ్యోతిక కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాను వయాకామ్‌ 18 స్టూడియోస్‌, ప్యారలల్‌ మైండ్స్‌ ప్రొడక్షన్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా, ఈ చిత్రం తెలుగు టీజర్‌ను కింగ్‌ నాగార్జున ఇవాళ విడుదల చేయగా… తమిళ టీజర్‌ను హీరో మోహన్‌లాల్‌, హీరో సూర్య కలిసి రిలీజ్ చేశారు. హీరో కార్తీ ఈ చిత్రంలో డిఫరెంట్ గెటప్‌లో […]

నాడు 'ఖైదీ'.. నేడు 'దొంగ'.. మరోసారి చిరు టైటిల్‌తోనే వస్తున్న కార్తీ!
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 16, 2019 | 8:59 PM

తమిళ నటుడు కార్తీ హీరోగా ‘దృశ్యం’ ఫేమ్ జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘దొంగ’. కార్తీ  వదిన, సీనియర్ నటి జ్యోతిక కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాను వయాకామ్‌ 18 స్టూడియోస్‌, ప్యారలల్‌ మైండ్స్‌ ప్రొడక్షన్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా, ఈ చిత్రం తెలుగు టీజర్‌ను కింగ్‌ నాగార్జున ఇవాళ విడుదల చేయగా… తమిళ టీజర్‌ను హీరో మోహన్‌లాల్‌, హీరో సూర్య కలిసి రిలీజ్ చేశారు.

హీరో కార్తీ ఈ చిత్రంలో డిఫరెంట్ గెటప్‌లో కనిపించనున్నట్లు టీజర్ ప్రారంభంలోనే తెలుస్తుంది. రకరకాల పేర్లతో చలామణి అయ్యే దొంగగా పోలీసుల దృష్టిలో కనిపిస్తాడు కార్తీ. ప్రేక్షకులకు కావాల్సినంత థ్రిల్ కలిగించే యాక్షన్ సన్నివేశాలతో పాటుగా సిస్టర్ సెంటిమెంట్ కూడా పుష్కలంగా ఉంది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ టీజర్‌కు సంగీత దర్శకుడు గోవింద్ వసంత అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది.

ఇటీవల ‘ఖైదీ’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న కార్తీకు.. ‘దొంగ’తో మరో హిట్ ఖాయమనిపించేలా ఉంది. కాగా, ఈ సినిమాను డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.