AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెండున్నరేళ్ల బాలుడు మిస్సింగ్‌..పట్టించిన వాట్సాప్‌

కనిపించకుండా పోయిన రెండున్నరేళ్ల చిన్నారిని వెతికి పట్టించింది సోషల్‌ మీడియా. ఈ సంఘటన అనంతపురం జిల్లలో జరిగింది. ఇంటినుంచి తప్పిపోయిన ఓ బాలుడ్ని తిరిగి తల్లిదండ్రులకు వద్దకు చేర్చింది సోషల్‌ మీడియా. అనంతపురం రూరల్‌ సమీపంలోని కొడిమి క్రాస్‌ సెంటర్‌లో నివసిస్తున్నారు సురేష్‌బాబు కుటుంబం. సురేష్‌బాబు ఆటో డ్రైవర్‌..అతని కుమారుడు రెండున్నరేళ్ల తేజేశ్వర్‌ ఈ నెల 11న ఇంటి ముందు ఆడుకుంటూ తప్పిపోయాడు. ఉన్నట్టుండి బాబు కనిపించకుండా పోవడంతో సురేష్‌బాబు, స్థానికులు చుట్టుపక్కలంతా గాలించారు. అయినా ఫలితం […]

రెండున్నరేళ్ల బాలుడు మిస్సింగ్‌..పట్టించిన వాట్సాప్‌
Anil kumar poka
|

Updated on: Nov 16, 2019 | 8:42 PM

Share

కనిపించకుండా పోయిన రెండున్నరేళ్ల చిన్నారిని వెతికి పట్టించింది సోషల్‌ మీడియా. ఈ సంఘటన అనంతపురం జిల్లలో జరిగింది. ఇంటినుంచి తప్పిపోయిన ఓ బాలుడ్ని తిరిగి తల్లిదండ్రులకు వద్దకు చేర్చింది సోషల్‌ మీడియా. అనంతపురం రూరల్‌ సమీపంలోని కొడిమి క్రాస్‌ సెంటర్‌లో నివసిస్తున్నారు సురేష్‌బాబు కుటుంబం. సురేష్‌బాబు ఆటో డ్రైవర్‌..అతని కుమారుడు రెండున్నరేళ్ల తేజేశ్వర్‌ ఈ నెల 11న ఇంటి ముందు ఆడుకుంటూ తప్పిపోయాడు. ఉన్నట్టుండి బాబు కనిపించకుండా పోవడంతో సురేష్‌బాబు, స్థానికులు చుట్టుపక్కలంతా గాలించారు. అయినా ఫలితం లేకపోవడంతో రూరల్‌ పోలీస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి డాగ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు చేయించారు. 10 ప్రత్యేక బృందాలతో ప్రధాన కూడళ్లు, రైల్వే స్టేషన్‌, బస్టాండ్ల వద్ద ముమ్మర గాలింపు చేపట్టారు. బళ్ళారి రోడ్డులోని అన్ని గ్రామాలను గాలించారు. డ్రోన్ కెమెరాలు తెప్పించి బాలుడి ‘ఇంటి చుట్టు పక్కల సుమారు ఐదు కిలోమీటర్ల వరకు జల్లెడ పట్టారు. 15 మంది ప్రత్యేక దళాలతో ఇంటి చుట్టు ప్రక్కల సుమారు ఐదు కిలోమీటర్ల వరకు అన్ని దిక్కులలోని వాగులు, వంకలు, ముళ్ళ పొదలు, రాళ్ళ గుట్ట ల లోను వెతికించారు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో.. watsapp, facebook లద్వారా అన్ని  గ్రూపులలో పంపించి బాగా వైరల్ చేశారు. దీంతో బాలుడి ఆచూకీ ఫోన్ సమాచారం ద్వారా పోలీసులకు అందింది.

అసలేం జరిగింది… కుందుర్పి మండలం బెస్తరపల్లి గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి కాంట్రాక్ట్  పనులు చేసుకునే వాడు. తన వ్యక్తిగత పని మీద ఈ నెల 11న కళ్యాణదుర్గం నుండి కూడేరు మీదుగా అనంతపురము వెళ్తుండగా కొడిమి వద్ద రాత్రి సుమారు 8.20 గంటల సమయంలో బాలుడు ఏడుస్తూ కనిపించాడట. కాసేపు అక్కడ ఆగిచూస్తే..చుట్టు పక్కల ఎవరూ లేకపోవడంతో ఆ బాలుడిని  తన స్కూటీపై ఎక్కించుకుని అనంతపురంలోని తమ ఇంటికి తీసుకెళ్ళాడు. మరసటి రోజు  ఉదయము తన స్వగ్రామానికి తీసుకెళ్లాడు. తనకు పెళ్లై తొమ్మిదేళ్లు అయినప్పటికీ..  పిల్లలు లేకపోవడంతో ఆ పిల్లవాడిని పెంచుకుందామని అనుకున్నారు. తరువాత వాట్సాప్,  ఫేస్ బుక్ ద్వారా బాలుడి ఫోటో ప్రచారం కావడంతో ఆ చిన్నారి తనవద్దే ఉన్నాడని పోలీసులకు సమాచారం అందించాడు. నవంబర్‌ 16న బాలుడిని పోలీసుల సమక్షంలో తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ వీర రాఘవ రెడ్డి వివరించారు. సోషల్ మీడియా ద్వారా నేటితరం యువత చెడు బారిన పడుతున్నారని ఆవేదనగా ఉన్నా,.. కొన్ని అంశాల్లో వాటిని సరిగా వినియోగిస్తే ఎంత మంచి జరుగుతుందో చెప్పేందుకు ఈ సంఘటనే ఉదాహరణగా నిలిచిందన్నారు.

Follow Us
1999లో రిలీజ్.. థియేటర్లు దద్దరిల్లిపోయాయి..
1999లో రిలీజ్.. థియేటర్లు దద్దరిల్లిపోయాయి..
గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు.. నావికుల రక్షణ కోసం కేంద్రం చర్యలు
గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు.. నావికుల రక్షణ కోసం కేంద్రం చర్యలు
హైదరాబాద్ ప్రజలకు శుభవార్త.. నగరంలో మరో భారీ ఫ్లైఓవర్..
హైదరాబాద్ ప్రజలకు శుభవార్త.. నగరంలో మరో భారీ ఫ్లైఓవర్..
విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఈ విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు
విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఈ విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు
విద్యార్థుల టెన్షన్‌కు బ్రేక్.. జూన్ మూడో వారంలో ఆ 2 కీలక ఫలితాలు
విద్యార్థుల టెన్షన్‌కు బ్రేక్.. జూన్ మూడో వారంలో ఆ 2 కీలక ఫలితాలు
జాబ్ కాకపోయినా జాక్‌పాట్ లాంటి అవకాశం.. DRDOలో ఇంటర్న్‌షిప్‌లు!
జాబ్ కాకపోయినా జాక్‌పాట్ లాంటి అవకాశం.. DRDOలో ఇంటర్న్‌షిప్‌లు!
కళ్లజోడు పెట్టుకునే పిల్లలకి ఈ కూర పెడితే.. కంటిచూపు సమస్యలు..
కళ్లజోడు పెట్టుకునే పిల్లలకి ఈ కూర పెడితే.. కంటిచూపు సమస్యలు..
ఈసారి 10 కాదు 14 జట్లు.. 2027 వన్డే వరల్డ్ కప్ డేట్స్ వచ్చేశాయ్
ఈసారి 10 కాదు 14 జట్లు.. 2027 వన్డే వరల్డ్ కప్ డేట్స్ వచ్చేశాయ్
భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఒక్కరోజే ఎంతంటే..?
భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఒక్కరోజే ఎంతంటే..?
ఏసీ కూలింగ్ ఎక్కువ రావడం లేదా.. ఈ చిన్న వాటర్ ట్రిక్ ట్రై చేయండి
ఏసీ కూలింగ్ ఎక్కువ రావడం లేదా.. ఈ చిన్న వాటర్ ట్రిక్ ట్రై చేయండి