AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రియ డేట్స్ ఇప్పిస్తానంటూ.. రూ. 5 లక్షలు స్వాహా!

ఈజీ మనీ కోసం.. అమాయకులను మోసం చేయటానికి కేటుగాళ్లు ఎన్నెన్నో కొత్త పంథాలను ఎంచుకుంటున్నారు. ఇక తాజాగా  ప్రముఖ నటి శ్రియ డేట్స్ ఇప్పిస్తానంటూ.. ఓ మీడియా ప్రతినిధి ఏకంగా రూ.5 లక్షలు స్వాహా చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులో వచ్చింది. ఈ కేసులో అతనికి ఓ మహిళ కూడా సహాయం చేసినట్లు తెలుస్తోంది. దీంతో బంజారా హిల్స్ పోలీసులు ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. బంజారా హిల్స్‌కు చెందిన చంద్రనాయుడు అనే సినీ […]

శ్రియ డేట్స్ ఇప్పిస్తానంటూ.. రూ. 5 లక్షలు స్వాహా!
Ravi Kiran
|

Updated on: Nov 17, 2019 | 7:05 PM

Share

ఈజీ మనీ కోసం.. అమాయకులను మోసం చేయటానికి కేటుగాళ్లు ఎన్నెన్నో కొత్త పంథాలను ఎంచుకుంటున్నారు. ఇక తాజాగా  ప్రముఖ నటి శ్రియ డేట్స్ ఇప్పిస్తానంటూ.. ఓ మీడియా ప్రతినిధి ఏకంగా రూ.5 లక్షలు స్వాహా చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులో వచ్చింది. ఈ కేసులో అతనికి ఓ మహిళ కూడా సహాయం చేసినట్లు తెలుస్తోంది. దీంతో బంజారా హిల్స్ పోలీసులు ఇద్దరిపై కేసులు నమోదు చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. బంజారా హిల్స్‌కు చెందిన చంద్రనాయుడు అనే సినీ దర్శకుడు తన ఛానల్‌లో పెద్ద ఎత్తున రియాలిటీ షోకు భారీగా ప్లాన్ చేశాడు. ఇక ఆ షోకు సీనియర్ నటి శ్రియ జడ్జిగా వ్యవహరిస్తే.. టీఆర్పీ రేటింగ్స్ బాగుంటాయని అనుకున్నాడు. అంతేకాకుండా ఆమెను కాంటాక్ట్ కావడం కోసం.. పలువురితో డీలింగ్స్ కూడా చేసుకున్నాడు. ఈ తరుణంలో మీడియా ప్రతినిధి అయిన చైతన్య అతనికి పరిచయమయ్యాడు. సదరు దర్శకుడు, చైతన్యకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పేశాడు. ఇక డబ్బు మీద దుర్బుద్ధి కలిగిన చైతన్య పక్కాగా ఓ స్కెచ్ వేశాడు.

హీరోయిన్ శ్రియ డేట్స్ అన్నింటినీ చూసే మేనేజర్ ఈమేనంటూ లక్షీ సింధూజ అనే అమ్మాయిని పరిచయం చేయడమే కాకుండా.. ఆమెకు ఆ దర్శకుడు రూ.5 లక్షల అడ్వాన్స్ ఇప్పించేలా చైతన్య ప్రేరేపించాడు. ఇంకేముంది డబ్బు మొత్తం ముట్టిన తర్వాత ఈ జంట కనిపించకుండా పోయింది.

సదరు దర్శకుడు వివిధ మార్గాల ద్వారా వారిని కాంటాక్ట్ చేద్దామని చూసినా ఉపయోగం లేకుండా పోయింది. చివరికి తాను మోసపోయానని తెలుసుకున్న చంద్రనాయుడు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. ఇక అతడిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు.

Follow Us
ఆ భూములను రైతులకు, అమరవీరుల కుటుంబాలకు ఇవ్వండి: సీఎం
ఆ భూములను రైతులకు, అమరవీరుల కుటుంబాలకు ఇవ్వండి: సీఎం
16 బౌండరీలతో అయ్యర్ విధ్వంసం.. ఒకే దెబ్బకు 4 రికార్డులు బ్రేక్
16 బౌండరీలతో అయ్యర్ విధ్వంసం.. ఒకే దెబ్బకు 4 రికార్డులు బ్రేక్
ఆర్బీఐ బిగ్ అనౌన్స్‌మెంట్‌కు అంతా రెడీ..
ఆర్బీఐ బిగ్ అనౌన్స్‌మెంట్‌కు అంతా రెడీ..
భరించలేని ఎముకల నొప్పులు ఉన్నాయా? కప్పు రాగి పిండితో ఇలా
భరించలేని ఎముకల నొప్పులు ఉన్నాయా? కప్పు రాగి పిండితో ఇలా
చందనం తిలకం ఎందుకు పెట్టుకుంటారు? దీని వెనుక ఉన్న రహస్యం తెలుసా?
చందనం తిలకం ఎందుకు పెట్టుకుంటారు? దీని వెనుక ఉన్న రహస్యం తెలుసా?
25ఏళ్ల పాలనాప్రస్థానం పూర్తి.. వినాయకుడి సన్నిధిలో PM మోదీ పూజలు
25ఏళ్ల పాలనాప్రస్థానం పూర్తి.. వినాయకుడి సన్నిధిలో PM మోదీ పూజలు
రజత్ పటిదార్ హాఫ్ సెంచరీ వృథా.. తొలి వన్డేలో ఇండియా-ఎ ఘోర పరాజయం
రజత్ పటిదార్ హాఫ్ సెంచరీ వృథా.. తొలి వన్డేలో ఇండియా-ఎ ఘోర పరాజయం
రైతులకు కేంద్రం దసరా కానుక.. అకౌంట్లోకి రూ.2 వేలు అప్పుడే..!
రైతులకు కేంద్రం దసరా కానుక.. అకౌంట్లోకి రూ.2 వేలు అప్పుడే..!
4 గుర్రాలను ముగ్గురు అన్నదమ్ములు ఎలా పంచుకోవాలి.. చిక్కుప్రశ్న
4 గుర్రాలను ముగ్గురు అన్నదమ్ములు ఎలా పంచుకోవాలి.. చిక్కుప్రశ్న
అమ్మవారికి చేపల నైవేద్యం.. 200 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం..
అమ్మవారికి చేపల నైవేద్యం.. 200 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం..