AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sumanth : విలన్ రోల్స్ చేయడానికి రెడీనా.. నాగార్జునతో బాండింగ్ ఎలా ఉంటుందంటే.. సుమంత్ ఓపెన్ కామెంట్స్..

అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమైన హీరోలలో సుమంత్ ఒకరు. నాగేశ్వరరావు మనవడు.. నాగార్జున మేనల్లుడు.. ప్రేమకథ సినిమాతో వెండితెరకు హీరోగా తెరంగేట్రం చేశాడు. 1999లో విడుదలైన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. మొదటి సినిమాతోనే నటుడిగా ప్రశంసలు అందుకున్న సుమంత్.. తాజాగా టీవీ9కు ఇచ్చిన పాడ్ కాస్ట్ లో పాల్గొని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Sumanth : విలన్ రోల్స్ చేయడానికి రెడీనా.. నాగార్జునతో బాండింగ్ ఎలా ఉంటుందంటే.. సుమంత్ ఓపెన్ కామెంట్స్..
Sumanth
Rajitha Chanti
|

Updated on: Aug 01, 2026 | 8:42 PM

Share

టాలీవుడ్ ప్రేక్షకులకు సుమంత్ సుపరిచితమే. 1999లో ప్రేమకథ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన ఆయన.. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సుమంత్.. తాజాగా టీవీ9కి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ పాడ్‌కాస్ట్‌లో తన కుటుంబ సంబంధాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా, తన మేనల్లుళ్లు నాగ చైతన్య, అఖిల్‌లతో తన అనుబంధం గురించి ప్రస్తావించారు. చాలా మంది భావించినట్లుగా, తాము కలిసినప్పుడు సినిమాల గురించి ఎక్కువగా చర్చించుకోమని సుమంత్ స్పష్టం చేశారు. సుమంత్ మాట్లాడుతూ, “మేము కలిసినప్పుడు సినిమాల గురించి తక్కువ మాట్లాడుకుంటాం. ఆహా, మేము వేరే విషయాల గురించి, జస్ట్ సరదాగా… లైక్ ఎనీ ఫ్యామిలీ, లైక్ యు నో ద… వాళ్ళ వెకేషన్స్ గురించి, లైక్… ఆర్ జస్ట్ ద జనరల్ హేపెనింగ్స్ ఇన్ అవర్ లైఫ్స్. లైక్ ఎనీ అదర్ ఫ్యామిలీ, నథింగ్ టూ డిఫరెంట్” అని వివరించారు. సుమంత్ తన కెరీర్‌లో నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని, విభిన్న జానర్లలో నటించాలనే తన ఆకాంక్షను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తను చేయాలనుకుంటున్న సినిమాల గురించి మాట్లాడుతూ, డెఫినెట్‌గా ఒక హారర్ సినిమా చేయాలని ఉందని తెలిపారు. అంతేకాకుండా, లాజిక్ లేని, పూర్తిగా వినోదాత్మకమైన ఒక పిచ్చ కామెడీ చిత్రంలో నటించాలనే కోరిక కూడా ఉందని పేర్కొన్నారు.

ఎక్కువమంది చదివినవి : Aamani : సినిమాలు మానేసి సీరియల్స్ చేయడానికి కారణం అదే.. ఎట్టకేలకు ఆమని ఓపెన్ కామెంట్స్..

వీడియో చూడండి..

ఎక్కువమంది చదివినవి : ఎక్కువ మంది చదివినవి : K. Raghavendra Rao: ఆ హీరోయిన్‏తో 24 సినిమాలు చేశా.. అలాంటి చావు ఎవరికీ రాకూడదు.. డైరెక్టర్ రాఘవేంద్ర రావు..

Follow Us