AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Moral Story: కష్టానికి తప్పకుండా ఫలితం దక్కుతుంది..! సోమరితనం వీడండి..

అదృష్టం కోసం ఎదురుచూడడం కంటే కష్టపడటం గొప్ప ఫలితాలను ఇస్తుంది. "కష్టే ఫలి" అనే ఈ నీతి కథ శ్రమ విలువను, పట్టుదలతో సాధించే విజయాన్ని చక్కగా వివరిస్తుంది. పిల్లలతో పాటు పెద్దల్లోనూ నిజాయితీ, క్రమశిక్షణ, కష్టపడి పనిచేసే అలవాటును పెంపొందించే ఈ కథ ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిందే.

Moral Story: కష్టానికి తప్పకుండా ఫలితం దక్కుతుంది..! సోమరితనం వీడండి..
Telugu Moral Story
Janardhan Veluru
|

Updated on: Aug 01, 2026 | 7:49 PM

Share

నీతి కథలు వ్యక్తిత్వ వికాశానికి ఎంతో ఉపయోగపడుతాయి. పిల్లలే కాదు పెద్దల్లోనూ నీతి కథలు నైతిక విలువలు, సత్ప్రవర్తనను పెంచుతాయి. నిజాయితీ, దయ, క్రమశిక్షణ, కృతజ్ఞత వంటి మంచి లక్షణాల ప్రాముఖ్యత నీతి కథలతో బాగా అర్థమవుతాయి. కష్టపడితే తప్పకుండా ఫలితం ఉంటుందనే గొప్ప సందేశాన్ని ఇచ్చే ఓ నీతి కథను ఇక్కడ ఇవ్వడం జరిగింది. జీవితంలో అదృష్టం కంటే కష్టం గొప్పది అని పెద్దలు తరచూ చెబుతుంటారు. దానికి నిదర్శనంగా నిలిచే చిన్న కథే “కష్టే ఫలి”. సోమరిపోతులను మేల్కొపే ఈ అద్భుతమైన కథను చదివేయండి.

కథ:

ఒక గ్రామంలో రాము అనే యువకుడు ఉండేవాడు. అతడు చాలా శ్రమజీవి. ఒకరోజు గ్రామంలోని పాత బావిని శుభ్రం చేసే పని మొదలుపెట్టాడు. బావిలో పేరుకుపోయిన చెత్తను, రాళ్లను బుట్టలో వేసుకుని తాడుతో పైకి లాగుతూ ఎంతో కష్టపడి పని చేస్తున్నాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన అతని స్నేహితుడు సోము, “ఇంత కష్టపడడం ఎందుకు? దీనివల్ల నీకు ఏం లాభం వస్తుంది?” అంటూ ఎగతాళి చేశాడు. కానీ రాము మాత్రం ఎలాంటి సమాధానం చెప్పకుండా తన పని చేసుకుంటూ వెళ్లిపోయాడు.

కొంతసేపటి తర్వాత బుట్టలో చెత్తతో పాటు ఒక పాత ఇనుప పెట్టె కూడా పైకి వచ్చింది. ఆసక్తిగా దాన్ని తెరిచి చూడగా అందులో బంగారు నాణేలు, వెండి ఆభరణాలు కనిపించాయి. గ్రామ పెద్దలు వాటిని పరిశీలించి, చాలా కాలం క్రితం ఎవరో దాచిన నిధి అని చెప్పారు. రాము నిజాయితీగా ఆ విషయాన్ని గ్రామ అధికారులకు తెలియజేయడంతో, నిధిలో కొంత భాగాన్ని బహుమతిగా అతనికే అందజేశారు.

ఇవి కూడా చదవండి

ఈ విషయం చూసిన సోము తన తప్పును గ్రహించాడు. కష్టాన్ని ఎగతాళి చేయకుండా, కష్టపడేవారిని గౌరవించాలని తెలుసుకున్నాడు. రామును అభినందిస్తూ.. “శ్రమను నమ్మినవారికి దేవుడూ తోడుంటాడు” అని అన్నాడు.

నీతి:

ఈ చిన్న కథ మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ఫలితం వెంటనే కనిపించకపోయినా నిజాయితీతో చేసిన కష్టం ఎప్పుడో ఒకప్పుడు మంచి ఫలితాన్ని ఇస్తుంది. అదృష్టం కోసం ఎదురుచూడడం కంటే, మన పని మనం నిబద్ధతతో చేస్తే అవకాశాలు వాటంతట అవే మన ముందుకు వస్తాయి.

కష్టపడి పనిచేసినవారికి విజయం, గౌరవం, ఫలితం తప్పకుండా లభిస్తాయి. శ్రమను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు.

Follow Us