Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ కన్నీటి పర్యంతం.. నాన్న గుర్తుకొచ్చి వెక్కివెక్కి ఏడ్చిన బ్యూటీ..!
హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కంటతడి పెట్టుకున్నారు. మంగళవారం నిర్వహించిన ఫస్ట్ టైమ్ మూవీ ట్రైలర్ లాంచ్ వేడుకలో పాల్గొన్న ఆమె ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు. తన తండ్రి గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అలాగే తాను అనుభవించిన కష్టాలను గుర్తు చేసుకున్నారు పాయల్.

టాలీవుడ్ స్టార్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ఓ పబ్లిక్ ఫంక్షన్‌లో కన్నీరుమున్నీరుగా విలపించారు. తన బాల్యమిత్రుడు సౌరభ్ ధింగ్రా ప్రధాన పాత్రలో.. డైరెక్టర్ హేమంత్ ఇప్పలపల్లి తెరకెక్కించిన ‘ఫస్ట్ టైమ్ 01-01-01’ మూవీ ప్రమోషన్స్‌కు ఆమె స్పెషల్ గెస్ట్‌గా వచ్చారు. హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ బ్యూటీ.. గ్రాఫిక్స్ పరంగా ఈ ప్రాజెక్ట్ అందరినీ అలరిస్తుందని తన నమ్మకాన్ని వెల్లడించారు. అయితే తన పర్సనల్ లైఫ్‌లో జరిగిన ఓ దుర్ఘటనను తలచుకుని ఆమె కంటతడి పెట్టడం అక్కడున్న వాళ్ల హృదయాలను బరువెక్కించింది. కార్యక్రమం ఆఖరులో మీడియా ప్రతినిధులు ఆమెను అడిగిన ఓ ప్రశ్న వాతావరణాన్ని సీరియస్‌గా మార్చేసింది. కొద్ది రోజుల క్రితం ఆమె విపాసన ధ్యానంకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని ఓ జర్నలిస్ట్ అడగడంతో.. తన కన్నతండ్రి విమల్ కుమార్ రాజ్‌పుత్ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆమె కన్నీరు కట్టలు తెంచుకుంది.
ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi: ఆమె గొప్ప నటి.. ఆమె టాలెంట్ స్వయంగా చూశా.. కానీ సక్సెస్ కాలేకపోయింది.. కారణం ఇదే.. డైరెక్టర్ కృష్ణవంశీ..
“నా లైఫ్‌లో రియల్ హీరో డ్యాడీనే. నేను యాక్ట్ చేసిన ఏ ప్రాజెక్ట్ అయినా ముందు ఆయనే వీక్షించి ఫీడ్‌బ్యాక్ ఇచ్చేవారు. నా లేటెస్ట్ పంజాబీ మూవీని చూడాలని ఆయనకు ఎంతో కోరిక ఉండేది, కానీ ఆ ఛాన్స్ దక్కకుండానే ఆయన దూరం అయ్యారు” అంటూ దుఃఖసాగరంలో మునిగిపోయారు. తన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అయిన ఆర్ఎక్స్ 100 లాంటి రొమాంటిక్ అండ్ డేరింగ్ రోల్స్‌లో కనిపించినా.. తనలోని టాలెంట్‌ను గుర్తించి అభినందించిన వ్యక్తి నాన్నేనని ఆమె పేర్కొన్నారు. ఈ విషయాలు చెబుతూనే దుఃఖాన్ని అదుపు చేసుకోలేక స్టేజ్ పైనుంచి సగంలోనే వెళ్లిపోయారు. ఆ సమయంలో యూనిట్ సభ్యులు ఆమెకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేసినా.. ఆ పంజాబీ భామ పడుతున్న ఆవేదన చూసి అక్కడున్న ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అయ్యారు.
ఎక్కువ మంది చదివినవి : Raviteja : జీవితంలో ఆయనను మర్చిపోలేను.. నన్ను మరో స్థాయికి తీసుకెళ్లాడు.. రవితేజ..
2025 జూలై 28న పాయల్ నాన్నగారు తుది శ్వాస విడిచారు. 67 ఏళ్ళ వయస్సులో ఆయన అన్నవాహిక సంబంధిత క్యాన్సర్ వ్యాధితో పోరాడి కన్నుమూశారు. ఆయనకు ట్రీట్మెంట్ జరిగే రోజుల్లో తమ ఫ్యామిలీ పడ్డ స్ట్రగుల్స్, అనుభవించిన మానసిక వేదన తాలూకు చేదు జ్ఞాపకాలను సైతం ఈ నటి గత ఇంటర్వ్యూలలో అనేకసార్లు పంచుకున్నారు. ఆ తీరని శోకం నుంచి బయటకు వచ్చేందుకే ఆమె ప్రాచీన ఆధ్యాత్మిక మార్గమైన విపాసన ధ్యానంను ఎంచుకున్నారు. డిస్టర్బ్ అయిన మైండ్‌ను రిలాక్స్ చేయడానికి, ఎమోషన్స్‌ను బ్యాలెన్స్ చేయడానికి మన దేశంలో పురాతన కాలం నుంచి ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు. ఈ మెడిటేషన్ చేయటం ద్వారానే తన లైఫ్‌లో ఎదురైన చేదు నిజాన్ని జీర్ణించుకుని, కెరీర్ పరంగా ముందుకు అడుగులు వేసేందుకు ఈ స్టార్ హీరోయిన్ గట్టిగా ట్రై చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
ఎక్కువ మంది చదివినవి : Babloo Prithiveeraj : హీరో కంటే బాగా చేశానని ఆ సినిమాలో నా సీన్స్ తీసేశారు.. దెబ్బకు సినిమా రిజల్ట్ మారిపోయింది.. నటుడు పృథ్వీరాజ్..
పాయల్ రాజ్ పుత్ ఎమోషనల్..
ఎక్కువ మంది చదివినవి : JD Chakravarthy : 25 ఏళ్లుగా ఆ ఒక్కటి తినడం మానేసా.. 56 ఏళ్ల వయసులో నా హెల్త్ సీక్రెట్ ఇదే.. జేడీ చక్రవర్తి కామెంట్స్..
