AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anchor Suma: యాంకర్ సుమ ఒక్కో షోకి ఎంత తీసుకుంటుందో తెలుసా? నెల సంపాదన తెలిస్తే మతిపోవాల్సిందే

ప్రస్తుతం టాలీవుడ్ లో నంబర్ వన్ యాంకర్ ఎవరంటే అందరూ సుమ కనకాల పేరే చెబుతారు. అందులో ఎలాంటి అనుమానమే లేదు. అయితే సుమ రెమ్యునరేషన్స్, అలాగే ఆమె నెల, ఏడాది సంపాదనల గురించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Anchor Suma: యాంకర్ సుమ ఒక్కో షోకి ఎంత తీసుకుంటుందో తెలుసా? నెల సంపాదన తెలిస్తే మతిపోవాల్సిందే
Anchor Suma Kanakala
Basha Shek
|

Updated on: Apr 29, 2026 | 11:29 AM

Share

తెలుగు బుల్లితెరపై మకుటం లేని మహరాణిగా వెలుగొందుతోంది సుమ కనకాలు. పేరుకు మలయాళీ అయినా స్వచ్ఛమైన తెలుగు ఉచ్చారణ, సమయానికి తగ్గట్టుగా మాటలు, డైలాగులు, చమత్కార పంచులు వెరసి ఆమెను నెంబర్ వన్ యాంకర్‌గా నిలబెట్టాయి. ఆమె తర్వాత చాలా మంది కొత్త యాంకర్లు వచ్చినా, సుమలాగా క్రేజ్ తెచ్చుకోలేకపోయారు. టీవీ షోస్, ప్రోగ్రామ్స్, నిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఆడియో ఫంక్షన్లు, సక్సెస్ మీట్లు, టెలివిజన్ షోలు, స్పెషల్ ఇంటర్వ్యూలు, అవార్డు వేడుకలు.. ఇలా ఏది కావాలన్నా యాంకర్ సుమ ఉండాల్సిందే. ముఖ్యంగా ఈ మధ్యన ఏ సినిమా ఈవెంట్ చూసినా సుమనే కనిపిస్తోంది. చిన్న హీరోల నుంచి స్టార్ హీరోల సినిమా ఈవెంట్లను కూడా సుమనే హోస్టింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యాంకర్ సుమ రెమ్యూనరేషన్‌కు సంబంధించిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

సినిమా ఈవెంట్ల విషయానికి వస్తే, ఒక ప్రీ మూవీ రిలీజ్ ఈవెంట్, ఆడియో లాంచ్ లేదా సక్సెస్ మీట్‌కు సుమ రూ.4 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు పారితోషికం తీసుకుంటోందట. ఇక సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరో, హీరోయిన్లతో ఒక్కో ఇంటర్వ్యూకే రూ.3 లక్షల వరకు ఛార్జ్ చేస్తోందట. టీవీ ప్రసారమవుతున్న సుమ అడ్డా వంటి కార్యక్రమాల ద్వారా ఆమెకు భారీ ఆదాయం వస్తోందని తెలుస్తోంది. ఒక్కో ఎపిసోడ్‌కు రూ.2.5 లక్షల వరకు అందుకుంటున్నారని సమాచారం. ఇక ఈవెంట్‌లు, ప్రైవేట్ ఫంక్షన్‌లు, అవార్డు వేడుకలు తదితర ప్రత్యేక కార్యక్రమాలకు ఒక్కో ఈవెంట్ కు రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు తీసుకుంటోందట సుమ.

ఇవి కూడా చదవండి

సుమ రెమ్యునరేషన్ వివరాలిలా!

ధనుష్ కర ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం సుమ సన్నాహకాలు..

ఇవి కాకుండా ఇన్ స్టా గ్రామ్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, యూట్యూబ్ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు, సోషల్ మీడియా కోలాబరేషన్‌లు ద్వారా కూడా సుమకు భారీగా ఆదాయం వస్తోందని సమచారం. మొత్తానికి ఎప్పుడూ బిజీ బిజీగా ఉండే సుమ నెలకు కనీసం 60-70 లక్షలు సంపాదిస్తోందట. ఇక మిగిలిన ప్రోగ్రామ్స్ కూడా కలుపుకుంటే సుమ నెల సంపాదన దాదాపు కోటి రూపాయల వరకు ఉంటుందని టాక్. అంటే ఏడాదికి దాదాపు 12 కోట్ల రూపాయల ఆదాయాన్ని సుమ ఆర్జిస్తుందన్నమాట. ఇంతులో నిజమెంతుందో తెలియదు కానీ .. ప్రస్తుతం ఈ వార్తలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us