అందంలో అప్సరస.. అనుపమ క్యూట్ నెస్‌కు ప్రేమలో పడిపోవాల్సిందే 

Rajeev 

24 May  2026

instagram

ప్రేమమ్ సినిమాతో సినీరంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన అనుపమ.. 2015లో స్టార్ స్టేటస్ అందుకుంది.

తెలుగు, తమిళం, మలయాళంలో వరుస ఆఫర్స్ అందుకుని ఈ బ్యూటీ రోజు రోజుకు మరింత పాపులర్ అయ్యింది. 

కానీ అనుపమకు అనుకున్నంతగా సరైన బ్రేక్ మాత్రం రాలేదు. ఇప్పటివరకు అనేక హిట్ చిత్రాల్లో నటించిన అనుపమకు.. స్టార్ హీరోల సినిమాల్లో మాత్రం ఛాన్స్ రాలేదు.

2015లో ‘ప్రేమమ్’ సినిమాతో ఆమె సినీరంగుల జీవితాన్ని ప్రారంభించింది. ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది.

ఆ తర్వాత తెలుగులో శతమానం భవతి సినిమాతో కథానాయికగా పరిచయమైంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం భాషలలో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది.

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలలో ఒకరిగా మారింది. అనుపమ పరమేశ్వరన్ కేవలం 19 సంవత్సరాల వయసులోనే హీరోయిన్ అయ్యింది.

మలయాళ ‘ప్రేమమ్’ ఆమె జీవితాన్ని మార్చేసింది. ఈ సినిమాలో కనిపించింది కాసేపు మాత్రమే అయినప్పటికీ అందరి దృష్టిని ఆకర్షించింది.