AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Central Government: పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ విషయంలో కేంద్రం కొత్త నిర్ణయం.. ఇకపై అక్కడ టెస్టులు..

కేంద్ర ప్రభుత్వం సోమవారం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటివరకు లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ.7 వరకు పెరిగింది. ఈ క్రమంలో కేంద్రం వీటి విషయంలో మరో నిర్ణయం తీసుకుంది. వినియోగదారులకు సరైన మోతాదులో ఇంధన లభించేలా చేసేందుకు కీలక నిర్ణయానికి శ్రీకారం చుట్టింది.

Central Government: పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ విషయంలో కేంద్రం కొత్త నిర్ణయం.. ఇకపై అక్కడ టెస్టులు..
Central Government
Venkatrao Lella
|

Updated on: May 25, 2026 | 3:40 PM

Share

పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ, ఎల్పీజీ, ఎల్‌ఎన్‌జీ, హైడ్రోజన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఐదు వస్తువుల పంపిణీ విషయంలో ఎలాంటి అవకతవకలకు ఇకపై ఆస్కార్ ఉండదు. ఎందుకంటే.. వీటి పంపిణీ యంత్రాల పరీక్ష, పున:పరీక్షలను జీఎటీసీ వద్ద నమోదు చేయనున్నారు. ప్రభుత్వ ఆమోదం పొందిన పరీక్షా కేంద్రాల పరిధిలోకి వీటిని కేంద్ర ప్రభుత్వం చేర్చింది. దీంతో వీటి తూనికలు, కొలతల తనిఖీ వ్యవస్థను ఈ నిర్ణయం బలోపేతం చేయనుంది. ఈ మేరకు ప్రస్తుతం ఉన్న నిబంధనల్లో మార్పులు చేసింది. వీటి పంపిణీ వ్యవస్థలో అక్రమాలు చోటుచేసుకోకుండా సరైన మోతాదులో ఇంధనం అందేలా చేయడం, పంపిణీలో పారదర్శకత తెచ్చేందుకు కొత్త నిబంధనలు ఉపయోగపడతాయని స్పష్టం చేసింది.

ఐదు కొత్త నిబంధనలు ఇవే..

-పెట్రోల్ డీజిల్ డిస్పెన్సర్, సీఎన్‌జీ డిస్పెన్సర్, ఎల్పీజీ డిస్పెన్సర్, ఎల్‌ఎన్జీ డిస్పెన్సర్, హైడ్రోజన్ డిస్పెన్సర్ వ్యవస్థలు ఏర్పాటు

-ప్రభుత్వ ఆమోదం పొందిన జీఎటీసీ కేంద్రాల్లో టెస్టులు

-వీటి పంపిణీ మెషీన్లను పరీక్షించడం, పున:పరీక్షించడం అనేది మరింత సులువు

-ఇంధన పంపిపీ వ్యవస్ధలో ఖచ్చితత్వం

-గతంలో ఈ నిబంధనలు పరిమితంగా ఉండగా.. ఇప్పుడు విస్తరించారు

23 రకాల తూనిక, కొలత పరికరాలు

గతంలో 18 రకాల తూనిక, కొలత పరికరాలను మాత్రమే ధృవీకరించేవారు. ఇప్పుడు వీటి సంఖ్య 23కి చేరుకుంది. ఇప్పటివరకు గ్యాస్ మీటర్లు, ఎనర్జీ మీటర్లు, ఫ్లో మీటర్లు, నీటి మీటర్లు, తూనిక యంత్రాలు వంటివి ఉన్నాయి. ఇప్పుడు వీటిల్లో ఫ్యూయల్ డిస్పెన్సర్లు కూడా చేర్చారు. స్వచ్చమైన ఇంధన వినియోగం పెరగడంతో పాటు వినియోగదారులకు సరైన మోతాదులో ఇంధనం అందించేందుకు ఈ చర్య సహాయపడుతుంది. అలాగే ఇంధన కేంద్రాల లావాదేవీల్లో కూడా పాదర్శకత అనేది పెరుగుతుంది. స్వచ్చమైన ఇంధనాన్ని ప్రోత్సహించేందుకకు ఇది ఉపయోగపడుతుంది. ఇంధన పంపిణీ కేంద్రాలపై మరింత నిశిత పరిశీలన చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ధృవీకరణ ఛార్జీలను కూడా ప్రభుత్వం నిర్ణయించింది. పెట్రోల్, డీజిల్ డిస్పెన్సర్లకు ఒక్కో నాజిల్‌కు రూ.5 వేలు, సీఎన్జీ, ఎల్పీజీ, ఎల్‌ఎన్‌జీ, హైడ్రోజన్ డిస్పెన్సర్లకు రూ.10 వేలుగా ఫిక్స్ చేశారు. దేశవ్యాప్తంగా ఏకరూప నిబంధలను అమలు చేయడంలో ఇది ఉపయోగపడుంది.

Follow Us
తిరుపతిలో eRZL హైడ్రేషన్ అవగాహన కార్యక్రమం
తిరుపతిలో eRZL హైడ్రేషన్ అవగాహన కార్యక్రమం
భారత గడ్డపై పుట్టి, ఆస్ట్రేలియా తరపున ఎంట్రీ.. డెబ్యూలోనే అదుర్స్
భారత గడ్డపై పుట్టి, ఆస్ట్రేలియా తరపున ఎంట్రీ.. డెబ్యూలోనే అదుర్స్
ఖమ్మంలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం
ఖమ్మంలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం
ఫేస్‌బుక్‌లో చాటింగ్.. అడిగినంత డబ్బు ఇచ్చాడు.. తీరా కలవడానికి
ఫేస్‌బుక్‌లో చాటింగ్.. అడిగినంత డబ్బు ఇచ్చాడు.. తీరా కలవడానికి
మీ ఇంట్లో ఈ పిరమిడ్ పెట్టి చూడండి.. జాక్ పాట్ కొట్టినట్టే!
మీ ఇంట్లో ఈ పిరమిడ్ పెట్టి చూడండి.. జాక్ పాట్ కొట్టినట్టే!
ఈ నటుడు మల్టీ ట్యాలెంటెడ్.. విమానాలు నడుపుతాడు.. డెంటిస్ట్ కూడా..
ఈ నటుడు మల్టీ ట్యాలెంటెడ్.. విమానాలు నడుపుతాడు.. డెంటిస్ట్ కూడా..
రెండో విడతలో వారికే ఇందిరమ్మ ఇండ్లు.. మంత్రి కీలక ఆదేశాలు
రెండో విడతలో వారికే ఇందిరమ్మ ఇండ్లు.. మంత్రి కీలక ఆదేశాలు
2027 వరల్డ్ కప్ రేస్ నుంచి హార్దిక్‌తోపాటు తెలుగోడు ఔట్?
2027 వరల్డ్ కప్ రేస్ నుంచి హార్దిక్‌తోపాటు తెలుగోడు ఔట్?
మేష రాశిలో కుజుడు.. ఆ రాశుల వారు వైవాహిక జీవితంలో జాగ్రత్త..!
మేష రాశిలో కుజుడు.. ఆ రాశుల వారు వైవాహిక జీవితంలో జాగ్రత్త..!
అల్లం త్వరగా ఎండిపోతోందా? ఈ చిట్కాలు పాటిస్తే నెల రోజులైనా తాజాగా
అల్లం త్వరగా ఎండిపోతోందా? ఈ చిట్కాలు పాటిస్తే నెల రోజులైనా తాజాగా