AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rambha: ‘నా ప్రపంచం శూన్యమైపోయింది’.. కన్నీరుమున్నీరవుతోన్న హీరోయిన్ రంభ.. ఏం జరిగిందంటే?

ఒకప్పటి తెలుగు స్టార్ హీరోయిన్ రంభ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి హఠాత్తుగా కన్నుమూశారు. ఈ దుర్వార్తను ఆమెనే సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు రంభకు ధైర్యం చెబుతున్నారు.

Rambha: 'నా ప్రపంచం శూన్యమైపోయింది'.. కన్నీరుమున్నీరవుతోన్న హీరోయిన్ రంభ.. ఏం జరిగిందంటే?
Rambha
Basha Shek
|

Updated on: May 25, 2026 | 4:12 PM

Share

ఒకప్పటి తెలుగు స్టార్ హీరోయిన్ రంభ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి వెంకటేశ్వరరావు కన్నుమూశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్న రంభ తన తండ్రిని తల్చుకుంటూ బాగా ఎమోషనలైంది.. ‘ నాన్నా.. నా హృదయంలో నీ స్థానాన్ని మరొకరు భర్తీ చేయలేరు. ఎ‍న్నో ఇ‍బ్బందులు పెట్టినప్పటికీ నీ ముఖంపై చిరునవ్వు మాత్రం చెరిగిపోనివ్వలేదు. ఇప్పుడు నువ్వు వెళ్లిపోవడంతో నా ప్రపంచం శూన్యమైపోయింది’ అని తన ఆవేదనకు అక్షర రూపమిచ్చింది రంభ. ప్రస్తుతం ఆమె పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు, సినీ అభిమానులు రంభ తండ్రి కి నివాళి అర్పిస్తున్నారు. అలాగే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు. కాగా రంభ మన తెలుగమ్మాయే. విజయ వాడలో పుట్టి పెరిగింది. ఆమె అసలు పేరు యూది విజయలక్ష్మి. తెలుగమ్మాయి అయినప్పటికీ రంభ తొలుత మలయాళంలో సినిమాలు చేసింది. 1992లో ‘సర్గామ్’ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

ఇక రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది రంభ. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. తన అందం, అభినయానికి కూడా మంచి మార్కులు పడ్డాయి. అల్లరి ప్రేమికుడు, అల్లుడా మజకా, బావగారూ బాగున్నారా, అరుణాచలం, బొంబాయి ప్రియుడు, ముద్దుల ప్రియుడు, మాతో పెట్టుకోకు, బంగారు కుటుంబం, గణేష్, హిట్లర్, ఇద్దరు మిత్రులు.. ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో కథానాయికగా చేసింది. దేశముదురు, హలో బ్రదర్, యమదొంగ వంటి సూపర్ హిట్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ, భోజ్ పూరి, బెంగాలి భాషల్లోనూ రంభ సినిమాలు చేసింది.

ఇవి కూడా చదవండి

రంభ ఎమోషనల్ పోస్ట్..

View this post on Instagram

A post shared by Rambha💕 (@rambhaindran_)

కాగా సినిమా కెరీర్ స్పీడ్ గా ఉన్న సమయంలోనే పెళ్లిపీటలెక్కింది రంభ. 2010లో కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్రకుమార్‌ని పెళ్లిచేసుకుని సినిమాలకు గుడ్‌బై చెప్పింది. ప్రస్తుతం ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నాడు. కాగా సినిమా ఇండస్ట్రీకి దూరమైనా బుల్లితెరపైనా కనిపిస్తోందీ అందాల తార. పలు టీవీ రియాలిటీ టీవీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. సినిమాల్లోకి కూడా రీఎంట్రీ ఇవ్వాలని అనుకుంటోంది.

భర్త పిల్లలతో రంభ..

View this post on Instagram

A post shared by Rambha💕 (@rambhaindran_)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఏం లెగ్ రా భయ్.. ఏ జట్టులో చేరితే ఆ టీం ట్రోఫీకి దూరమవ్వాల్సిందే?
ఏం లెగ్ రా భయ్.. ఏ జట్టులో చేరితే ఆ టీం ట్రోఫీకి దూరమవ్వాల్సిందే?
ఈ సీక్రెట్‌ తెలుసా? ఇలా చేస్తే 30 రోజులు వచ్చే గ్యాస్ 45 రోజులు
ఈ సీక్రెట్‌ తెలుసా? ఇలా చేస్తే 30 రోజులు వచ్చే గ్యాస్ 45 రోజులు
రంభ ఇంట్లో తీవ్ర విషాదం.. కన్నీరుమున్నీరవుతోన్న హీరోయిన్
రంభ ఇంట్లో తీవ్ర విషాదం.. కన్నీరుమున్నీరవుతోన్న హీరోయిన్
విజయ్ మాస్టర్ స్ట్రోక్.. అన్నాడీఎంకేకు బిగ్ షాక్..
విజయ్ మాస్టర్ స్ట్రోక్.. అన్నాడీఎంకేకు బిగ్ షాక్..
ఇదేదో కాస్ట్లీహోటల్ అనుకునేరు..రూ.1100కే డ్యూప్లెక్స్ లగ్జరీ రూమ్
ఇదేదో కాస్ట్లీహోటల్ అనుకునేరు..రూ.1100కే డ్యూప్లెక్స్ లగ్జరీ రూమ్
అరచేతిలో ఈ గుర్తు ఉంటే మీరు కోటీశ్వరులే.. మీ చేతిలో ఉందా మరి
అరచేతిలో ఈ గుర్తు ఉంటే మీరు కోటీశ్వరులే.. మీ చేతిలో ఉందా మరి
హిప్పోలు ఒక్క రాత్రిలో ఎంత గడ్డి మేస్తాయో తెలుసా..?
హిప్పోలు ఒక్క రాత్రిలో ఎంత గడ్డి మేస్తాయో తెలుసా..?
పెట్రోల్, డీజిల్ విషయంలో కేంద్రం మరో కీలక నిర్ణయం
పెట్రోల్, డీజిల్ విషయంలో కేంద్రం మరో కీలక నిర్ణయం
మీరు చేసే ఈ చిన్న తప్పుల వల్లే ఫ్రిజ్ కంప్రెసర్ పేలుతుంది..
మీరు చేసే ఈ చిన్న తప్పుల వల్లే ఫ్రిజ్ కంప్రెసర్ పేలుతుంది..
ఇలాంటి వారిని మీ ఇంటి గుమ్మం దాటనివ్వొద్దు.. చాణక్యుడి షాకింగ్ హె
ఇలాంటి వారిని మీ ఇంటి గుమ్మం దాటనివ్వొద్దు.. చాణక్యుడి షాకింగ్ హె