అనన్య నాగళ్ళ.. ఈ తెలుగుఅమ్మాయి హీరోయిన్ గా నిలదొక్కుకోవడానికి చాలా ప్రయత్నిస్తుంది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన మల్లేశం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఆతర్వాత ఒకటి రెండు సినిమాలు చేసిన సక్సెస్ కాలేకపోయింది. ఆతర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో ముఖ్య పాత్రలో నటించింది.
ఈ సినిమాతో అనన్య క్రేజ్ పెరిగింది. ఆతర్వాత ఈ అమ్మడికి వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. దాంతో బిజీగా మారిపోయింది.
వకీల్ సాబ్ సినిమా తర్వాత మాస్ట్రో, ఊర్వశివో రాక్షశివో, శాకుంతలం,మళ్ళీ పెళ్ళి సినిమాల్లో నటించింది. కానీ అవేమి సక్సెస్ కాలేదు.
అలాగే హీరోయిన్ గా అన్వేషి, తంత్ర, పొట్టేలు సినిమాలు చేసింది అవి కూడా అంతగా ఆకట్టుకోలేదు. కానీ అనన్య వరుస సినిమాలతో దూసుకుపోతుంది.
సినిమాలతో పాటు సోషల్ మీడియాలో ఈ అమ్మడు యమా యాక్టివ్ గా ఉంటుంది. ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలకు విపరీతమైన క్రేజ్ ఉంది.
తాజాగా అనన్య షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. కుర్రాళ్ళు ఈ భామ ఫోటోలకు కొంటె కామెంట్స్ చేస్తున్నారు.