AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: సుజిత్ చేసిన పనికి ఇలా వచ్చేశా.. వర్షాన్ని లెక్కచేయని పవన్..

పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ ఓజీ. సెప్టెంబర్ 25న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. తాజాగా సెప్టెంబర్ 21న హైదరాబాద్ లో ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ వేడుకకు స్టైలీష్ లుక్ లో ఎంట్రీ ఇచ్చారు పవన్.

Pawan Kalyan: సుజిత్ చేసిన పనికి ఇలా వచ్చేశా.. వర్షాన్ని లెక్కచేయని పవన్..
Pawan Kalyan
Rajitha Chanti
|

Updated on: Sep 21, 2025 | 9:09 PM

Share

ఏపీ డిప్యూటీ సిఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ ఓజీ. డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్, ఇమ్రాన్ హష్మీ కీలకపాత్రలు పోషించారు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. సెప్టెంబర్ 25న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్ లో ఆదివారం సాయంత్రం ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈవెంట్ జరుగుతున్న సమయంలో భారీగా వర్షం పడింది. అయినప్పటికీ అభిమానుల కోసం పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చారు.

ఇవి కూడా చదవండి : Tollywood : 19 ఏళ్ల వయసులో 31 ఏళ్ల స్టార్ హీరోతో పెళ్లి.. 11 సంవత్సరాలకు రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..

జోరు వానలో ఏమాత్రం తగ్గకుండా చేతిలో సినిమాలో వాడిన జపనీస్ కత్తి పట్టుకుని స్టైలీష్ గా ఎంట్రీ ఇచ్చారు. అంతేకాదు..సినిమాలోని ఓజీ సినిమాటిక్ లుక్ లోనే కనిపించారు. సింగిల్ గా నడుస్తూ వచ్చి సినిమాలోని పవర్ ఫుల డైలాగ్ చెప్పి అభిమానులను మరింత ఉత్సాహపరిచారు. దీంతో పవన్ లుక్ , స్వాగ్ చూసి ఫ్యాన్స్ ఆనందంతో కేరింతలు కొట్టారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. సుజిత్ చేసిన పనికి తాను సినిమాలో వాడిన బట్టల్లోనే వేడుకకు రావాల్సి వచ్చిందని అన్నారు.

ఇవి కూడా చదవండి : Cinema: కాంతార, కేజీఎఫ్ చిత్రాలను వెనక్కు నెట్టింది.. అప్పుడు థియేటర్లు.. ఇప్పుడు ఓటీటీని ఊపేస్తోన్న మూవీ..

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. “సుజీత్ చెప్పేది తక్కువ.. కానీ సినిమా తీసేటప్పుడు మాములుగా ఉండదు. ఈ మూవీకి ఎక్కువ క్రెడిట్ అతడికే దక్కుతుంది. తన విజన్ ను తెరపై అద్భుతంగా ఆవిష్కరించిన మరో వ్యక్తి తమన్. ఇద్దరు ఒక ట్రిప్ లోకి వెళ్లిపోయారు. అందులోకి నన్ను కూడా లాగేసారు. ఈ సినిమా చేస్తున్న సమయంలో నేను డిప్యూటీ సీఎం అన్న సంగతి మర్చిపోయా. డిప్యూటీ సిఎం కత్తిపట్టుకుని వస్తే ఊరుకుంటారా.. ? సినిమా కాబట్టి సరిపోయింది. ఈ సినిమాతో అద్భుతమైన లవ్ స్టోరీని తెరకెక్కించారు. రాజకీయాల్లోకి వెళ్లినా మీరు నన్ను వదల్లేదు.. ఇలా పోరాటం చేస్తున్నాననంటే అందుకు కారణం మీరే. సుజీత్ నాకు జపనీస్ నేర్పించాడు. అలాగే శ్రియా రెడ్డి అద్భుతమైన నటి. భవిష్యత్తులో ఏదైనా ప్రాజెక్ట్ చేస్తాను” అంటూ భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా స్పీచ్ ఇచ్చారు పవన్.

ఇవి కూడా చదవండి : Actress: అప్పుడు స్కూల్లో టీచర్.. తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన టాప్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?

ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, బాలకృష్ణతో సూపర్ హిట్ సినిమాలు.. 55 ఏళ్ల వయసులోనూ స్టిల్ సింగల్.. ఇప్పటికీ యూత్‏లో యమ క్రేజ్..

నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?