Dulquer Salman: ఓటీటీలోకి బాక్సాఫీస్ సంచలనం కొత్త లోక.. స్పందించిన దుల్కర్ సల్మాన్.. ఏమన్నారంటే..
మలయాళీ సినిమా ప్రపంచంలో ఉన్న టాప్ హీరోలలో దుల్కర్ సల్మాన్ ఒకరు. ఇప్పుడు తెలుగులోనూ వరుస హిట్స్ అందుకుంటున్నారు. దక్షిణాదిలోనే కాకుండా ఉత్తరాదిలోనూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో అతడు. ఇప్పుడు నిర్మాతగానూ సక్సెస్ అయ్యాడు. అతడు నిర్మించిన లోక చాప్టర్ 1 సినిమా ఇప్పుడు కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుంది.

సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో దుల్కర్ సల్మాన్ ఒకరు. మమ్ముట్టి తనయుడిగా సినీరంగంలో అడుగుపెట్టిన ఈ హీరో.. ఇప్పుడు తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. తెలుగు, మలయాళం భాషలలో వరుస హిట్స్ అందుకున్నారు. ఇప్పుడు నిర్మాతగానూ సక్సెస్ అయ్యారు. ఆయన నిర్మించిన లేటేస్ట్ మూవీ లోక చాప్టర్ 1 ; చంద్ర. ఒక ఉమెన్ సూపర్ హీరో కథ ఆధారంగా విడుదలైన ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ కథానాయికగా నటించింది. ఇందులో నజ్లానే, టోవినో థామస్, డాన్స్ మాస్టర్ శాండీ, విజయరాఘవన్, సంధు సలీంకుమార్, రఘునంద పలేరి, శివాజిత్ పద్మనాభన్, జైన్ ఆండ్రూస్ కీలకపాత్రలు పోషించారు. అలాగే ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, టోవినో థామస్, షౌబిన్ అతిథి పాత్రలు పోషించారు.
ఇవి కూడా చదవండి : Tollywood : 19 ఏళ్ల వయసులో 31 ఏళ్ల స్టార్ హీరోతో పెళ్లి.. 11 సంవత్సరాలకు రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..
ఈ చిత్రానికి డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించారు. డొమినిక్ అరుణ్‌తో కలిసి సంధ్యా బాలచంద్రన్ ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే రాశారు. ఈ చిత్రాన్ని 5 భాగాలుగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. రూ.30 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం రూ.250 కోట్లకు పైగా వసూలు చేసి మలయాళ సినిమాల్లో కొత్త రికార్డు సృష్టించింది. ఈ చిత్రం ఆగస్టు 28, 2025న థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ పై స్పందించారు దుల్కర్ సల్మాన్.
ఇవి కూడా చదవండి : Cinema: కాంతార, కేజీఎఫ్ చిత్రాలను వెనక్కు నెట్టింది.. అప్పుడు థియేటర్లు.. ఇప్పుడు ఓటీటీని ఊపేస్తోన్న మూవీ..
“లోక సినిమా త్వరలోనే ఓటీటీలోకి రావడం లేదు. రూమర్స్ నమ్మకండి. కేవలం అధికారికంగా వచ్చే ప్రకటనల కోసమే ఎదురుచూడండి. ” అంటూ తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ ట్వీట్ నెట్టింట వైరలవుతుంది.
Lokah isn't coming to OTT anytime soon. Ignore the fake news and stay tuned for official announcements! #Lokah #WhatstheHurry
— Dulquer Salmaan (@dulQuer) September 21, 2025
ఇవి కూడా చదవండి : Actress: అప్పుడు స్కూల్లో టీచర్.. తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన టాప్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?




