AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha : “సమంత జీవితం సోషల్ మీడియాతోనే పెనవేసుకుంది.. ఇప్పుడు కోర్టు కెక్కడమేంటి”

సమంత .. ఇప్పుడు ఈపేరు ఫిలిం సర్కిల్స్‌లో తెగ చక్కర్లు కొడుతుంది. ఇటీవలే సమంత నాగచైతన్యతో తన వివాహబంధాన్ని తెంచుకున్న విషయం తెలిసిందే.

Samantha : సమంత జీవితం సోషల్ మీడియాతోనే పెనవేసుకుంది.. ఇప్పుడు కోర్టు కెక్కడమేంటి
Samantha
Rajeev Rayala
|

Updated on: Oct 21, 2021 | 4:04 PM

Share

Samantha Ruth Prabhu : సమంత .. ఇప్పుడు ఈపేరు ఫిలిం సర్కిల్స్‌లో తెగ చక్కర్లు కొడుతుంది. ఇటీవలే సమంత నాగచైతన్యతో తన వివాహబంధాన్ని తెంచుకున్న విషయం తెలిసిందే. దాదాపు ఏడేళ్ల బంధాన్ని నాగచైతన్య-సమంత తెంపేసుకున్నారు. ప్రేమించి పెళ్లాడిన ఈ జంట ఇటీవలే తాము ఇష్టపూర్వకంగా విడిపోతున్నామంటూ ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు. ఇక సమంత నాగచైతన్య విడిపోవడన్ని ఇప్పటికీ కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదిలా ఉంటే విడాకుల తర్వాత ఇద్దరు తమ కెరీర్ లో బిజీగా ఉన్నారు. చైతన్య సినిమాలు సి చేస్తూ షూటింగ్స్ లో బిజీగా గడుపుతున్నాడు. మరో వైపు సమంత కూడా సినిమాలతో వెబ్ సిరీస్ లతో బిజీ బిజీగా గడిపేస్తుంది. ఇదిలా ఉంటే.. సమంత పై సోషల్ మీడియాలో రకరకాల ట్రోల్స్ పుట్టుకొచ్చాయి. తప్పంతా సామ్‌దే. ఆమెకు తల్లి కావడం ఇష్టం లేదు. అబార్షన్ చేయించుకుంది. ఆమెకు ఎఫైర్స్ ఉన్నాయ్. అందుకే చైతూ డైవోర్స్ ఇచ్చేశాడంటూ సమంతపై ట్రోల్స్‌ అటాక్ జరిగింది.

దీనిపై సమంత క్లారిటీ కూడా ఇచ్చింది. నాకెలాంటి ఎఫైర్స్ లేవ్. నేను అబార్షన్ చేయించుకోలేదు. తల్లి కావడానికి నేను ఒప్పుకోలేదన్న మాటల్లో నిజం లేదంటూ చెప్పుకుంది. అయినా, సామ్‌పై ట్రోల్స్ వార్ కంటిన్యూ అయ్యింది. దాంతో సమంత కోర్టును ఆశ్రయించింది. హైదరాబాద్ కూకట్‌పల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. తనపై దుష్ప్రచారం చేసిన డాక్టర్‌ సీఎల్‌ వెంకట్రావుతోపాటు మరో మూడు య్యూట్యూబ్‌ ఛానళ్లపై సమంత పిటిషన్‌ దాఖలు చేశారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా అసత్య ప్రచారం చేసిన యూట్యూబ్ ఛానెల్స్‌తో బహిరంగ క్షమాపణలు చెప్పించాలని సమంత కోరారు. అయితే సమంత పిటీషన్ పై ఆన్లైన్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బుర్ర శ్రీనివాస్ స్పందించారు. సమంత వేసిన కేసులపై తీవ్రంగా ఖండించింది ఆన్లైన్ జర్నలిస్ట్ అసోసియేషన్.  ప్రతి సామాన్యుడి చేతులో ఉన్న ఆయుధం సోషల్ మీడియా.. ప్రతి ఒక్కటీ సోషల్ మీడియా పై షేర్ చేసుకునే అవకాశం సోషల్ మీడియా కలిపించింది..అలాంటి ఆయుధం పై సమంత నోటీసులు ఇవ్వడం మంచిది కాదు అంటూ చెప్పుకొచ్చారు.

సమంత జీవితం సోషల్ మీడియాతోనే పెనవేసుకుంది. సమంత పెళ్లి నుండి విడాకుల వరకు ప్రతి ఒక్కటి సోషల్ మీడియా లోనే షేర్ చేసుకున్నారు. అలాంటి సోషల్ మీడియా పై ఈరోజు నోటీసులు నేరుగా ఇవ్వడం పై ఆలోచించాలి అన్నారు. అలాగే సమంతకి ఉన్న అభ్యంతరాలు మాకు ఎవ్వరు చెప్పిన తొలగించేవాళ్ళం అని ఆన్లైన్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బుర్ర శ్రీనివాస్ అన్నారు. మరి ఈవివాదం ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Aamna Sharif: ఆమ్నా షరీఫ్ అందాలకు క్లీన్ బౌల్డ్ అవుతున్న ఫాన్స్.. ఎలాంటి వారైనా ఆహా అని తీరాల్సిందే..

Samantha: కూకట్‌పల్లి కోర్టులో సమంత పిటిషన్… ‘బాధలో ఉంటే గద్దల్లా పొడుస్తున్నారు’.. మనసున ఎంతో ఆవేదన

Nayanthara: చెట్టును వివాహం చేసుకోనున్న నయనతార.. ఇన్ని రోజులు పెళ్లి ఆగిపోవడానికి అసలు కారణం అదేనా.?

40 ఏళ్ల తర్వాత మహిళల్లో జుట్టు రాలడం ఎందుకు పెరుగుతుంది?
40 ఏళ్ల తర్వాత మహిళల్లో జుట్టు రాలడం ఎందుకు పెరుగుతుంది?
పెట్టుబడి పెట్టాలంటే ఉండాల్సింది ఇదే.. వారెన్‌ బఫెట్‌ కీలక సూచన!
పెట్టుబడి పెట్టాలంటే ఉండాల్సింది ఇదే.. వారెన్‌ బఫెట్‌ కీలక సూచన!
నిండు సభలో లేడీ డాక్టర్ హిజాబ్‌ లాగిన CM నితీశ్‌.. వీడియో వైరల్
నిండు సభలో లేడీ డాక్టర్ హిజాబ్‌ లాగిన CM నితీశ్‌.. వీడియో వైరల్
డెబిట్ కార్డు ఉన్న వారికి బంపర్ ఆఫర్.. ఫ్రీగా జీవిత బీమా!
డెబిట్ కార్డు ఉన్న వారికి బంపర్ ఆఫర్.. ఫ్రీగా జీవిత బీమా!
నర్సరీ నుండి 5వ తరగతి వరకు పాఠశాలలు బంద్.. ఉత్తర్వులు జారీ!
నర్సరీ నుండి 5వ తరగతి వరకు పాఠశాలలు బంద్.. ఉత్తర్వులు జారీ!
మీరు తెలివైనవారైతే, ఈ గమ్మత్తైన గణిత సమస్యను సాల్వ్ చేయండి!
మీరు తెలివైనవారైతే, ఈ గమ్మత్తైన గణిత సమస్యను సాల్వ్ చేయండి!
పెళ్లి చేసుకునేటప్పుడు తెలియలేదారా..? నల్లగా ఉందని భార్యను అలా..
పెళ్లి చేసుకునేటప్పుడు తెలియలేదారా..? నల్లగా ఉందని భార్యను అలా..
ఆడవారికి ఉండే ఈ అలవాట్లే ఇంట్లో అశాంతికి కారణమట!
ఆడవారికి ఉండే ఈ అలవాట్లే ఇంట్లో అశాంతికి కారణమట!
తెలంగాణ పెన్షనర్లకు న్యూఇయర్ ముందే వచ్చేసింది..
తెలంగాణ పెన్షనర్లకు న్యూఇయర్ ముందే వచ్చేసింది..
జోడీల జాతర షురూ..2026లో సందడి చేయబోయే హీరో, హీరోయిన్స్ వీరే!
జోడీల జాతర షురూ..2026లో సందడి చేయబోయే హీరో, హీరోయిన్స్ వీరే!